twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పవర్ స్టార్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    1.0/5

    రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ సమయంలో వరుసగా సినిమాలు తీస్తూ అందరికీ షాకుల మీదు షాకులిస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం వంటి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన వర్మ.. తాజాగా పవర్ స్టార్ చిత్రాన్ని విడుదల చేశాడు. పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్‌తో ప్రకంపనలు సృష్టించి.. కావాల్సిన హైప్‌ను తీసుకొచ్చాడు. మరి సినిమాలోనూ కంటెంట్ ఉందా? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అన్నది ఓ సారి చూద్దాం.

     కథ

    కథ

    ప్రవన్ కళ్యాణ్ అనే ఓ సినిమా స్టార్ మన సేన పార్టీని స్థాపించి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతాడు. పోటిన చేసిన రెండు చోట్లా ఓడిపోవడం, పార్టీకి ఒక్క సీటు రావడంతో ఫలితాలు వచ్చిన రాత్రి కుంగిపోతాడు. ఇక ప్రవన్ కళ్యాణ్‌ను ఆయన పెద్దన్న, చిన్నన్న, ఆప్త మిత్రుడు టీఎస్, భక్తుడు గుండ్ల రమేష్, బాబు వచ్చి మాట్లాడుతారు, ఓదార్చుతారు, తిడతారు. చివరగా తన తదుపరి కార్యాచరణ ఏంటో పాలుపోకుండా ఉన్న ప్రవన్ కళ్యాణ్‌కు ఓ వీరాభిమాని వచ్చి సలహాలు, సూచనలు, హితబోధన చేస్తాడు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరని తెలియాలంటే పవర్ స్టార్ చూడాల్సిందే.

    నటీనటుల పనితీరు

    నటీనటుల పనితీరు

    పవర్ స్టార్ సినిమా ప్రవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మిగతావన్నీ అతిథి పాత్రలే. అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. అయితే సినిమాలో చూపించే పాత్రలు నిజ జీవితంలో కొందరిని పోలి ఉంటుంది. మాట్లాడే విధానం, కనిపించే పద్దతిని బట్టి మనం కొందరి పోలికలు కనిపిస్తాయి. ఈ క్రమంలో టీఎస్, గుండ్ల రమేష్, కత్తి, ఆయన అన్నయ్య, బాబు, రష్యన్ భార్య వస్తారు. చివరగా వీరాభిమాని వచ్చి కనువిప్పు కలిగిస్తాడు. ఆయా పాత్రల్లో అందరూ చక్కగా నటించారు.

     సాంకేతిక నిపుణుల పనితీరు

    సాంకేతిక నిపుణుల పనితీరు

    సాంకేతిక నిపుణుల పనితం గురించి పవర్ స్టార్‌లో చెప్పుకోవాల్సినంతగా ఏమీ లేదు. ఉన్న ఒక్క గడ్డి తింటావా సాంగ్ సెటైరికల్‌గా బాగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూడ్‌కు తగ్గట్టుంది. కెమెరామెన్‌ ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం రానట్టు కనిపిస్తోంది. అంతా ఒకే చోట, ఒకే ఇంట్లో తీయడంతో నిర్మాణానికి కూడా ఎక్కువగా ఖర్చుకానట్టు తెలుస్తోంది.

    బలాలు, బలహీనతలు

    బలాలు, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్..

    నిడివి
    ప్రవన్ కళ్యాణ్

    మైనస్ పాయింట్స్..
    కథ
    కథనం

    Recommended Video

    PARANNAGEEVI Official Trailer | RGV | Shakalaka Shankar
    ఫైనల్

    ఫైనల్

    ‘పవర్ స్టార్' సినిమా ఆర్జీవీ ఏదొ ఆటవిడుపుగా తీసినట్టున్నాడు. తన ఊహకు ఏది వస్తే అది తీసే వర్మ.. పవర్ స్టార్‌ను తీయడంలో ఆశ్చర్యమే లేదు. వర్మ తన ఊహలు, కల్పనలను బాగానే వాడుకున్నాడు. ప్రవన్ కళ్యాణ్‌కు ఓ వీరాభిమాని, నిజమైన అభిమాని ఉన్నాడని చెప్పడానికే ఈ చిత్రం తీశాడేమో.

    చిత్రం : పవర్ స్టార్
    నటీనటులు: ప్రవన్ కళ్యాణ్
    దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
    సంగీతం : డీఎస్ఆర్
    సినిమాటోగ్రఫీ : జోషి
    నిర్మాణ సంస్థ : ఆర్జీవీ వరల్డ్ థియేటర్
    రిలీజ్ డేట్ : 2020-07-25
    రేటింగ్: 1/5

    English summary
    RGV POWERSTAR Movie Review And Rating. This Movie Released On 25th july On His RGV World Theater. This Movie Is Produced By RGV.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X