twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తిప్పలరాజు("అప్పలరాజు" రివ్యూ)

    By Srikanya
    |


    -సూర్య ప్రకాష్ జోశ్యుల
    బ్యానర్: శ్రేయ ప్రొడక్షన్స్
    తారాగణం: సునీల్, స్వాతి, బ్రహ్మానందం, సాక్షి, రఘుబాబు, అజయ్,ఆదర్స్ తదితురులు.
    సంగీతం: కోటి
    సినిమాటోగ్రఫీ: సుధాకర్ ఎక్కంటి
    కూర్పు: ప్రవీణ్ పూడి
    నిర్మాత: కిరణ్ కుమార్ కోనేరు
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
    విడుదల తేది: 18/02/2011

    సినిమా పరిశ్రమ అనేది బయిటకు కనపడినంత గ్లామర్ గా లోపల ఉండదనేది అందరికీ తెలిసిన నిజమే అయినా ఒప్పుకోవటానికి ఎవరికీ ఆసక్తి ఉండదనేది నిజం. అందుకేనేమో సినిమావాళ్ళ మీద సినిమా తీయటం ఎప్పుడూ సాహసమేనంటారు సినీ జీవులు. అయితే అప్పుడప్పడూ కొందరు ధైర్యం చేసి సినీ పరిశ్రమ బ్యాక్ గ్రౌండ్ లో నేనింతే,ఒక విచిత్రం వంటివి రూపొందిస్తూనే ఉన్నారు...భాక్సాఫీస్ వద్ద బోల్తా కొడ్తూనే ఉన్నారు. ఆ కోవలో సునీల్ వంటి కామిడీ హీరోని పెట్టుకుని సీరియస్ సినిమా ..అదీ సినీ బ్యాక్ గ్రౌండ్ లో చేసిన ఘనత మాత్రం నిత్య ప్రయోగశీలి రామ్ గోపాల్ వర్మకే దక్కింది. కథను నమ్ముకుని చేసానంటున్న ఈ సినిమాకి ఆయన కామిడీ ప్యాండిగ్ ని అయితే ఇచ్చాడు గానీ, కామిడీ పంచ్ ని మాత్రం ఇవ్వలేకపోయారు. సునీల్ ఉన్నాడు కదా కామిడీ గ్యారెంటీ అని ధియోటర్ కి వెళ్ళిన సగటు ప్రేక్షకుడుకి నిరాశ ఎదురౌతోంది.

    అమలాపురం రంభ దియేటర్లో రెగ్యులర్ గా సినిమాలు చూస్తూ విశ్లేషించుకునే అప్పలరాజు(సునీల్)కి ఓ శుభ ముహూర్తాన హైదరాబాద్ వెళ్ళి డైరక్టర్ అవ్వాలనే ఆలోచన పుడుతుంది. పుట్టిందే తడువుగా హైదరాబాద్ లో వాలి రాకీ(రఘుబాబు) అనే సెక్స్ సినిమా నిర్మాతను కలసి సినిమా కథ చెప్పి ఒప్పిస్తాడు. కానీ తన వద్ద రూపాయి కూడా లేని రాకీ ఎలాగయినా ఈ కథతో సినిమా తీయాలని(సెక్స్ సినిమాలు తీసుకునే ఆ నిర్మాతకు ఈ అనుభవం లేని కొత్త దర్శకుడు చెప్పిన కథలో ఏం పాయింటు నచ్చిందో మరి) నిర్ణయించుకుని ఫైనాన్సియర్స్ చుట్టూ తిప్పుతాడు.

    ఆ ఫైనాన్సియర్స్ ఒక్కొక్కరూ ఒక్కో రకం...తమ ఆలోచనలు,అవసరాలు ఈ కథలో రుద్దాలని ప్రయత్నిస్తూంటారు.దానికి ఒప్పుకోని అప్పలరాజుకి ఎవరైనా ఓ స్టార్ సినిమా చేస్తానంటే ఫైనాన్స్ దొరకటం ఈజీ అవుతుందని తెలుస్తుంది. దాంతో స్టార్ హీరోయిన్ కనిష్క(సాక్షి) ని ఒప్పిస్తాడు.ఆమెతో పాటు ప్యాకేజీలా స్టార్ హీరో బాబు(ఆదర్శ్) సీన్ లోకి వస్తాడు.స్టార్,స్టార్ హీరో,హీరోయిన్ దొరికగానే డేటాబేస్(కృష్ణభగవాన్) అనే కార్పోరేట్ కంపెనీ వాడు ఫైనాన్స్ చేస్తానంటాడు. అంతా సెట్ అయింది సినిమా ప్రారంభిద్దామనుకునేసరికి ఆ హీరో,హీరోయిన్స్ ఇద్దరూ బ్రేక్ అప్ అయి విడిపోతారు. అప్పలరాజు సినిమా ఆగిపోతుంది. ఆ స్ధితిలో అప్పలరాజు తన సినిమా ఎలా పూర్తి చేసాడు అనేది మిగతా కథ.

    సినిమా వాళ్ళు బాగా కనెక్టు అయ్యి నిజమే కదా అనిపించే ఈ కథ సామాన్య ప్రేక్షకుడుకి ఓ బ్రహ్మ పదార్ధంలా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇందులో పాత్రలని నిజ జీవితంలో సినీ పరిశ్రమలో కలిసే చాలా మందిని సెటైర్ చేస్తూ రూపొందించారు. వారిని ఐడింటిఫై చేసుకున్న వారికే ఆసక్తి,నవ్వు వస్తాయి.అందులోనూ ఏ అనుభవం లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన అప్పలరాజు కి వెంటనే ఓ ప్రొడ్యూసర్ ఓకే అనటం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది చాలా కాలంగా దర్శకత్వ విభాగంలో పనిచేసి అనుభవం సంపాదించుకుని, కథలు పట్టుకుని పరిశ్రమలో ఒక్క ఛాన్స్ అంటూ తిరుగుతున్నా ఆఫర్స్ రావటం అనేది చాలా కష్టంగా ఉంది.

    విజన్ ఉంది విజయం సాధిస్తానంటే నీ సొంత డబ్బుతో సినిమా తీసుకో అని నిర్మహమాటంగా చెప్తారనే విషయం అందరికీ తెలుసు. ఇక మొదటే చెప్పుకున్నట్లుగా సునీల్ అనగానే కామిడీ ఆశిస్తారు..అందులోనూ పోస్టర్స్ చూసి కామిడీ ప్యాడింగ్ ఉండటం గమనించి చాలా ఎక్సపెక్ట్ చేసుకుని వస్తారు. వారికి సినిమా సీరియస్ గా నడవటం,కామిడీ నటులు కూడా నవ్వించకపోవటం షాక్ ఇస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ స్ధాయి దర్శకుడు ఈ చిత్రం తీసాడంటే ఎవరికీ నమ్మబుద్ది కూడా కాదు.

    ఇక ప్లస్ ల విషయానికి వస్తే...వేణుమాధవ్ గన్ పాత్ర సినిమాలో బాగా నవ్వించింది. అలాగే సినిమా పరిస్ధితులను ఉన్నదున్నట్లు చూపించటంలోనూ, రియల్ గా పరిశ్రమలో ఉన్న వ్యక్తులను సెటైర్ చేయటంలో వర్మ సక్సెస్ అయ్యారు. ఎంత అధ్బుతమైన కథ అయినా తెరమీదకు వచ్చే సరికి ఎన్ని మార్పులకు గురి అవుతుందనేది విశదీకరంగా అరటి పండు వలిచి చెప్పిన రీతిలో స్పష్టం చేసారు. సునీల్ కూడా తన పాత్రలో లీనమై సీన్స్ పండించటమే కాక, డాన్స్ లు కూడా అదరకొట్టారు. కలర్స్ స్వాతి ఎప్పటిలాగే నవ్వుతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కోటీ సంగీతం, కలువ సాయి పాటలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. బ్రహ్మానందం నవ్వించాలని చాలా ట్రై చేసాడు కానీ మనీ సినిమాలో పాత్రకు కంటిన్యూషన్ లా అనిపించటంతో నిండుతనం రాలేదు. అజయ్,ఆదర్శ్ వాళ్ళ పాత్రలకు న్యాయం చేసారు. సాక్షి అందాల ప్రదర్శన ఓకే.

    సినిమావాళ్ళ బాగా ఐడింటిఫై చేసుకునే ఈ చిత్రం కామిడీ ఆశించి ధియోటర్ కి వెళ్ళిన సామాన్య ప్రేక్షకుడుకి కొంచెం ఇబ్బంది పరిచే అంశమే. అయితే సినీ పరిశ్రమలో ప్రవేశించాలనే ఆసక్తి ఉన్నవారు మాత్రం చూడటం మంచిది. క్లీన్ గానే ఉన్నా ప్యామిలీలకు ఎంతవరకూ పడుతుందనేది చూడాలి. వర్మ సినిమా లేదా సునీల్ సినిమా అని వారి గత సినిమాలను బేరేజు చేసుకుని చేసుకుని వెళితే మాత్రం బాగా నిరాశపరుస్తుంది. ఫైనల్ గా ఇది కామిడీ కాదు ..ట్రాజెడీ అని వర్మ మొదట్లోనే ఈ సినిమా గురించి వాయిస్ ఓవర్ లో చెప్పేంది మాత్రం పూర్తి నిజం.

    English summary
    Appalaraju hails from Amalapuram. He watches each and every film that releases. But he does not like any of them. He has no good opinion on the current generation directors. So he sets out to make his own film, Nayaki and lands in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X