twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RGV's Murder మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    రేటింగ్: 2.75/5
    మర్డర్ మూవీ
    నటీనటులు: శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రీ భార్గవి, సాహితీ, గిరిధర్, దీపక్, గణేష్
    సమర్పణ: రాంగోపాల్ వర్మ
    నిర్మాతలు: నట్టి కరుణ, నట్టి క్రాంతి
    దర్శకత్వం: ఆనంద్ చంద్ర
    సంగీతం: డిఎస్ఆర్
    డివోపి: జగదీష్ చీకటి
    ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్
    బ్యానర్: నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్
    రిలీజ్ డేట్: 2020-12-24
    మీడియా ప్రివ్యూ: 2020-12-22 (ప్రసాద్ ల్యాబ్స్)

    మీషా ఘోషల్ ట్రెడిషినల్ లుక్ ట్రెండింగ్.. అందంగా ముద్దు ముద్దుగా...

    మర్డర్ మూవీ కథ..

    మర్డర్ మూవీ కథ..


    సమాజంలో పేరు, ప్రతిష్టలు, హోదా ఉన్న మాధవరావు, వనజ (శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రీ భార్గవి) ముద్దు బిడ్డ నమ్రత (సాహితి). అతి గారాబంగా సాహితిని పెంచుతారు. తన కూతురు ఏది అడిగినా కాదనకుండా సాహితికి అన్నీ ఇస్తాడు. అలా మాధవరావు తన కూతుర్ని గొప్పగా ఊహించుకొంటున్న సమయంలో సాహితి తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదంటూ సాహితిని కోరికను తిరస్కరిస్తారు. దాంతో ఉన్నట్టుంది తండ్రి, కూతురు మధ్య కోపతాపాలు పెరిగిపోతాయి. ఇంటి నుంచి పారిపోయి తన తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.

    మర్డర్ మూవీలో ట్విస్టులు

    మర్డర్ మూవీలో ట్విస్టులు

    ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన కూతురు చేసిన పనికి కుంగిపోయిన తండ్రి మాధవరావు ఎలా రియాక్ట్ అయ్యాడు. తండ్రి మాటను జవదాటిన సాహితి ఎలాంటి నిర్ణయాలు తీసుకొన్నది. సాహితి పెళ్లిని అంగీకరించని మాధవరావు ఏం చేశాడు? ఎలాంటి పరిస్థితుల్లో మాధవరావు తన కూతురు జీవితాన్ని ఛిన్నాభిన్నం చేయాలనుకొన్నాడు? తన కూతురు కోసం ఎలాంటి పరిస్థితుల్లో ప్రాణత్యాగం చేశాడనే ప్రశ్నలకు సమాధానమే మర్డర్ చిత్ర కథ.

    మర్డర్ మూవీ ఎలా ఉందంటే..

    మర్డర్ మూవీ ఎలా ఉందంటే..

    తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన పరువు హత్య మర్డర్ సినిమాకు ఆధారమనేది ఎంత దాచినా దాగని విషయం. ఆ వివాదాన్ని పక్కన పెడితే.. దర్శకుడిగా ఆనంద్ చంద్ర రాసుకొన్న పాయింట్.. దాని చుట్టు అల్లుకొన్న ఎమోషన్స్ ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తాయి. తల్లిదండ్రుల పాత్రలపై విపరీతమైన సానుభూతి కలిగేలా స్ట్రిప్టును రాసుకోవడం సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు.

     దర్శకుడి ప్రతిభ..

    దర్శకుడి ప్రతిభ..

    మర్డర్ కథలో నాటకీయత ఎక్కువగా అనిపించినా.. మాధవరావు పాత్ర పలికించిన ఎమోషన్స్‌ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని చెప్పవచ్చు. ఈ సినిమాలో మాధవరావు పాత్ర వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. దర్శకుడిగా తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు ఎమోషన్స్‌ను దట్టించడంలోను, అలాగే ప్రేక్షకులను సీట్లో కదలకుండా చేయడంలో దర్శకుడిగా ఆనంద్ చంద్ర సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

    శ్రీకాంత్ అయ్యంగార్ నటన..

    శ్రీకాంత్ అయ్యంగార్ నటన..

    ఇక నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. మాధవరావు పాత్రను శ్రీకాంత్ అయ్యంగార్ కథాపరంగా గొప్ప రేంజ్‌కు తీసుకెళ్లాడని చెప్పవచ్చు. ప్రతీ ఫ్రేమ్‌లో ప్రేమ, కరుణ, కాఠిన్యం, విద్వేషం, సానుభూతి ఇలాంటి అంశాలన్ని కలబోసి మాధవరావును తెరమీద అద్భుతంగా ఆవిష్కరించారు. ఇప్పటి వరకు శ్రీకాంత్ పోషించిన పాత్రల్లో మాధవరావు పాత్ర కూడా ఒకటిగా గొప్పగా మిగిలిపోతుంది. ఇక గాయత్రి భార్గవి వనజ పాత్ర ద్వారా ప్రేక్షకుల నుంచి సానుభూతి సంపాదించుకోవడమే కాకుండా తన నటనతతో సర్‌ప్రైజ్ ఇచ్చిందనే చెప్పాలి.

     నమ్రతగా సాహితి యాక్టింగ్

    నమ్రతగా సాహితి యాక్టింగ్

    ఇక నమ్రత పాత్రకు సాహితి న్యాయం చేసిందనే చెప్పాలి. మాధవరావుగా శ్రీకాంత్ ధాటికి తట్టుకొంటూ సాహితి పోటీగా నటించడంలో కొంత వరకు సఫలమైందనే చెప్పొచ్చు. మాధవరావు తమ్ముడిగా గిరిధర్ పాత్ర ఫర్వాలేదనిపిస్తుంది. కానీ ఆ పాత్రలో కొంత డెప్ట్‌ను ఉద్దేశపూర్వకంగా తగ్గించారా అనే సందేహాలు వ్యక్తమవుతాయి. కీలకమైన తమ్ముడి పాత్రను సైడ్ ట్రాక్‌లో పెట్టారా అనే అభిప్రాయం కలుగుతుంది.

     టెక్నికల్‌ అంశాల గురించి

    టెక్నికల్‌ అంశాల గురించి

    టెక్నికల్ విషయాలకు వస్తే.. మర్డర్ సినిమాకు రీరికార్డింగ్ స్పెషల్ ఎట్రాక్షన్స్‌గా మారింది. కొన్ని సన్నివేశాలను మరో లెవెల్‌కు తీసుకుపోవడానికి దోహదపడింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాల పనితీరు బాగుంది. అన్ని విభాగాల పనితీరు, ప్రతిభ సమతూల్యంగా ఉందనే ఫీలింగ్ కలుగుతుంది.

    ఫైనల్‌గా ఎలా ఉందంటే..

    ఫైనల్‌గా ఎలా ఉందంటే..

    ఓవరాల్‌గా మర్డర్ చిత్రం గురించి చెప్పాలంటే.. కుటుంబ విలువులు, పిల్లలపై ప్రేమాభిమానాలు చూపే తల్లిదండ్రుల వ్యధ, భావోద్వేగాల కలయికగా రూపొందిందని చెప్పవచ్చు. కథలో ఒక వెర్షన్‌పై ఫోకస్ చేయడం కొంత అసంతృప్తిగా అనిపిస్తుంది. లాక్‌డౌన్‌లో వినోదానికి దూరమైన ఫ్యామిలీ ఆడియెన్స్ చక్కటి అనుభూతిని, భావోద్వేగాన్ని అందించే చిత్రంగా మర్డర్ రూపొందింది. అన్ని వర్గాలకు నచ్చే విధంగా సినిమాను రూపొందించడంలో యూనిట్ సఫలమైందని చెప్పవచ్చు. నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. సినిమాపై వారి అభిరుచికి అద్దం పట్టేలా మర్డర్‌ను తెరకెక్కించారు.

    అంజు కురియన్ క్యూట్ గ్యాలరీ.. వైరల్ అవుతున్న లవ్లీ పిక్

    English summary
    Popular Director Ram Gopal Varma presented movie murder set to release on December 24th. Natti's Entertainment banner produced this movie. Natti Karuna, Natti Kranthi are the producers. In this occassion, Telugu filmibeat is presenting exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X