twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RGV's థ్రిల్లర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating: 0.5/5

    లాక్‌డౌన్‌లో వరుస చిత్రాలతో దడదడలాడిస్తున్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న మరో చిత్రం థ్రిల్లర్. అడల్డ్ (సెక్స్) కంటెట్ అండ్ సస్పెన్స్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 14 తేదీన శ్రేయాస్ ఈటీ యాప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు ఫస్ట్ లుక్, ట్రైలర్, టీజర్లు హాట్‌గా ఉండటంతో యూత్‌ను విశేషంగా ఆకర్షించింది. ఆర్జీవి ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫోటోలు కూడా విపరీతంగా ఆకట్టుకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వస్తున్న గరం మసాలా చిత్రం ఎలాంటి అనుభూతిని పంచిందో తెలుసుకొందాం..

    థ్రిల్లర్ కథ ఏమిటంటే..

    థ్రిల్లర్ కథ ఏమిటంటే..

    సమీర్ అలియాస్ సామ్, మేఘ ప్రేమికులు. విశాల్ అనే స్నేహితుడితో పార్టీ చేసుకొని ఇంటికి తిరిగే వెళ్లే ప్లాన్‌లో ఉంటారు. మధ్యలో మేఘాను ఇంటిలో డ్రాప్ చేయాలని సమీర్ భావిస్తాడు. ప్రియురాలితో కోరిక తీర్చుకోవాలని ప్రయత్నిస్తాడు. పెళ్లి తర్వాతే నీ కోరిక తీరుస్తానని మేఘా చెబుతుంది. అలా మేఘ తన ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అనుకొని సంఘటనలు ఎదురవుతాయి. ఆ సంఘటనల నేపథ్యంలో ప్రియుడు సమీర్‌ను మేఘా చంపేస్తుంది.

    థ్రిల్లర్‌లో కీలక ప్రశ్నలు

    థ్రిల్లర్‌లో కీలక ప్రశ్నలు

    ఇంట్లోకి వెళ్లిన తర్వాత మేఘాకు ఎదురైన సంఘటనలు ఏమిటి? మేఘా ఇంట్లోకి చేరగానే సుస్మా ఉందా అంటూ అదృశ్య వ్యక్తి ఎందుకు వినిపిచింది? ఆ ఇంట్లోకి దూరిన మరో వ్యక్తి ఎవరు? ఇంటిలో ఎదురైన సంఘటనలతో మేఘ ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నది? తన ప్రియుడు సమీర్‌ను మేఘా ఎందుకు చంపింది? అనే ప్రశ్నలకు సమాధానమే థ్రిల్లర్ మూవీ కథ.

    థ్రిల్లర్ ఎలా ఉందంటే..

    థ్రిల్లర్ ఎలా ఉందంటే..

    థ్రిల్లర్ మూవీ మూడు క్యారెక్టర్లతో 22 నిమిషాలు తీసిన చిత్రం. మేఘా ఇంటిలో ఊహించుకోవడానికి, అసలు కనీసం సబ్జెక్ట్ లేకుండా పిల్ల చేష్టల మాదిరిగా రూపొందించిన చిత్రంగా పేర్కొన్నవచ్చు. పాత్రల చిత్రీకరణ కూడా లేదు. సెక్స్ అండ్ సస్పెన్స్ అని వర్మ చెప్పినట్టుగా ఆ రెండు అంశాలు మచ్చుకు కూడా కనిపించవు. అపర్ణను అర్ధనగ్నంగా చూపించి పండుగ చేసుకోవాలనే వర్మ ఆసక్తే తెరపైన కనిపించింది. లాక్‌డౌన్‌లో గట్టిగా జేబుకు చిల్లు పడే అవకాశం ఉంది. సినిమా చూస్తే థ్రిల్లింగ్‌కు బదులు వర్మపై మరేదో ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాకు బదులు యూట్యూబ్‌లో ఎలాంటి వీడియో చూసినా వంద రెట్ల సంతృప్తి ఉచితంగా దొరుకుతుంది.

    పాత్రల చిత్రీకరణ దారుణం

    పాత్రల చిత్రీకరణ దారుణం

    ఇక అప్సర రాణి, రాకీ కచ్చి నటన గురించి చెప్పాల్సిన పని కూడా వర్మ కల్పించలేదు. పాత్రల తీరుతెన్నుల సరిగా లేవు. కనీసం బూతు సీన్లు ఉంటాయని భావించే ప్రేక్షకుల అవి కూడా కనిపించవు. రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫోటోలకు సంబంధించిన సీన్లు ఉన్నా ప్రేక్షకులు సంతృప్తి పడేవారమే.. నటనపరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఆలోచిస్తే అంతా శూన్యమే. ఇకనైనా మంచి సినిమా వస్తుందనే ఆశతో వర్మ మాయలో పడే ఫ్యాన్స్.. థ్రిల్లర్ మూవీ చూసిన తర్వాత ఇంకా మోసపోకపోవడమే ఉత్తమం అనే ఫీలింగ్ కలుగుతుంది

    Recommended Video

    Mia Malkova's Climax Teaser Is Out | RGV | GST
     వర్మ మార్కు వెతికినా కనిపించదు

    వర్మ మార్కు వెతికినా కనిపించదు

    ఇక రాంగోపాల్ వర్మ తాలుకూ ఎలాంటి అంశాలు కనిపించని చిత్రం థ్రిల్లర్. కేవలం రెండు కెమెరా యాంగిల్స్, రెండు మూడు సన్నివేశాల్లో మ్యూజిక్ తప్ప ఈ సినిమాలో పెద్దగా ఆసక్తి కలిగించే అంశాలే కనిపించదు. ఈ సినిమాకు ఎంత దూరంగా ఉంటే అంత డబ్బు మిగులుతంది. దాని బదులు ఓ మంచి సినిమాను ఓటీటీలో ఆదరిస్తే.. మరిన్ని మంచి సినిమాలు తీసే దర్శకులను ఆదరించిన వారవుతారు. ప్రేక్షకుల వర్మ బలహీనతకు సాధ్యమైనంత దూరంగా ఉంటే మంచింది.

    ట్యాగ్‌లైన్: థ్రిల్లర్ సినిమా జేబుకు పెద్ద బొక్క

    English summary
    Ram Gopal Varma's Thriller released in http://rgvworldtheatre.com and http://ShreyasET.com. Apsara Rani is doing a lead role. This movie released on 14 August 2020
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X