Richie Gadi Pelli Review డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రిచి గాడి పెళ్లి... ఫన్ గేమ్ ఎలా సాగిందంటే?

విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 తొలి రోజు ముగిసింది. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా మాట్లాడారు. 2023ను విజిట్ ఆంధ్రప్రదేశ్ గా ప్రకటించినట్లు చెప్పారు.

నటీనటులు: నవీన్ నేని, సత్య ఎస్కే, ప్రణిత పట్నాయక్, బన్నీ వాక్స్, కిషోర్ మారిశెట్టి, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి, సతీష్ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హేమరాజ్ కేఎస్
కథ, డైలాగ్స్: రాజేంద్ర వైట్ల, నాగరాజు మధురి
ఎడిటర్: అరుణ్ ఇఎమ్
మ్యూజిక్ డైరెక్టర్: సత్యన్
సినిమాటోగ్రఫి: విజయ్ ఉళఘనాథ్
సహ నిర్మాత: సూర్య మెహర్
నిర్మాత: కె.ఎస్.హేమరాజ్
బ్యానర్: కేఎస్ ఫిల్మ్ వర్క్స్
రిలీజ్ డేట్: 2023-03-03

నేత్ర (యూట్యూబర్ బన్నీ వాక్స్)‌తో లవ్ అఫైర్ బ్రేకప్ అయిన రిచీ (సత్య ఎస్కే)కి సిరి (చందన రాజ్)‌తో పెళ్లి నిశ్చయమవుతుంది. ఊటీలో జరిగే మ్యారేజ్‌కు ఆహ్వానించి అక్కడే బ్యాచ్‌లర్ పార్టీని అరెంజ్ చేస్తాడు. అయితే బ్యాచ్‌లర్ పార్టీ జరుగుతున్న సమయంలో అందరూ కలిసి ఫన్ గేమ్ ఆడాలనుకొంటారు. ఫన్ గేమ్ ప్రకారం.. తమకు వచ్చే ఫోన్ కాల్స్ స్పీకర్ ఆన్ చేసి వినిపించాలి.. మెసేజ్‌ వస్తే గట్టిగా బయటకు చదవాలి అనే కండిషన్‌తో గేమ్ ఆడటం ప్రారంభిస్తారు. అయితే ఫన్ గేమ్ కాస్త వారి మధ్య గొడవలకు కారణమై.. పార్టీ సీరియస్ మూడ్‌లోకి మారుతుంది.

నేత్రతో రిచీ లవ్ బ్రేకప్‌కు కారణం ఏమిటి? సిరిని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలని అనుకొన్నాడు. బ్యాచ్‌లర్ పార్టీలో ఫన్ గేమ్‌ ఎలా సాగింది. స్నేహితుల మధ్య ఫన్ గేమ్ ఎలాంటి గొడవ పెట్టింది. ఫన్ గేమ్ సీరియస్‌గా మారడానికి కారణం ఏమిటి? బ్యాచ్‌లర్ పార్టీ చివరకు ఎలా ముగిసింది? అనే ప్రశ్నలకు సమాధానమే రిచి గాడి పెళ్లి సినిమా కథ.

 Richie Gadi Pelli Review and Rating: Naveen Neni impresses with humour

దర్శకుడు హేమరాజ్ మొబైల్‌లో లౌడ్ స్పీకర్‌ను ఆన్ చేసి ఫోన్ సంభాషణను అందరికి వినిపించాలని ఎంచుకొన్న కాన్సెప్ట్‌ కొత్తగా ఉంది. అయితే ఆ కాన్సెప్ట్‌ను చక్కగా హ్యాండిల్ చేశాడనే చెప్పాలి. కాకపోతే సీన్లు, ఫోన్ సంభాషణలు, సిట్యుయేషన్స్‌పై మరింత వర్కవుట్ చేసి ఉంటే ఇంకా బెటర్‌గా ఉండేదనిపించింది. బ్యాచ్‌లర్ పార్టీలో పాల్గొన్న ఫ్రెండ్స్ జీవితాల్లో సీక్రెట్ అంశాలను చక్కగా డీల్ చేశాడని చెప్పవచ్చు. కథ, కథనాలపై దృష్టి పెట్టి ఉంటే ఇంకా మంచి సినిమా అయి ఉండేదనిపిస్తుంది.

రిచిగా సత్య, సిరి‌గా కనిపించిన చందన రాజ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కొత్తవారైనా మంచి హావభావాలతో, సన్నివేశాల మూడ్‌‌కు తగినట్టగా ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. రిచి గర్ల్‌ఫ్రెండ్‌గా బన్నీ వాక్స్ గ్లామర్‌తో ఆకట్టుకొన్నది. టెలివిజన్ యాక్టర్‌గా కమెడియన్ నవీన్ మంచి హ్యూమర్ పండించాడు. లక్ష్మీపతి పాత్రలో కొరియోగ్రాఫర్ సతీష్, ప్రణీత పట్నాయక్, కిషోర్, ప్రవీణ్ రెడ్డి, కియారా నాయుడు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

సాంకేతిక నిపుణుల వివరాల్లోకి వెళితే.. . విజయ్ ఉలగనాథ్ సినిమాటోగ్రపి ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సత్యన్ అందించిన సంగీతం కొన్ని సన్నివేశాలను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. నాగరాజు, రాజేంద్ర రాసిన డైలాగ్స్ బాగున్నాయి.

ఫన్‌తోపాటు ఎమోషన్స్ కలబోసిన చిత్రం రిచి గాడి పెళ్లి. చిన్న చిత్రాల్లో మంచి క్వాలిటీతో రూపొందించిన చిత్రంగా ఫీల్‌ అందిస్తుంది. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. యంగ్ టాలెంట్ ఆ లోపాలను కప్పివేసిందనే చెప్పాలి. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X