Run Baby Run Review: చూపు తిప్పుకోనివ్వని మర్డర్ మిస్టరీ.. ఐశ్వర్య, ఆర్జే బాలాజీ నటన అద్భుతంగా!

రేటింగ్: 2..75/5

టైటిల్: రన్ బేబీ రన్
నటీనటులు: ఐశ్వర్య రాజేష్, ఆర్జే బాలాజీ, ఇషా తల్వార్, రాధిక శరత్ కుమార్, నాగినీడు, స్మృతి వెంకట్, జో మల్లూరి, వివేక్ ప్రసన్న, భగవతి పెరుమాళ్, హరీష్ పేరడి
సినిమాటోగ్రఫీ: ఎస్ యువ
దర్శకత్వం: జియేన్ కృష్ణకుమార్
సంగీతం: సామ్ సీఎస్
నిర్మాణ సంస్థ: ప్రిన్స్ పిక్చర్స్
థియేటర్ విడుదల తేది: ఫిబ్రవరి 3, 2023
ఓటీటీ విడుదల తేది: మార్చి 10, 2023
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తమిళ బ్యూటి ఐశ్వర్య రాజేష్. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కమర్షియల్ గా పెద్దగ సక్సెస్ కానప్పటికీ కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ ముందుగు సాగుతోంది. ఇక ఆర్జే బాలాజీ నటుడిగా అనేక చిత్రాల్లో అలరించి ఇటీవల కాలంలో ఎక్కువగా లీడ్ రోల్ పాత్రల్లో అదరగొడుతున్నాడు. స్పైడర్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆర్జే బాలాజీ, ఐశ్వర్య రాజేష్ నటించిన సినిమా 'రన్ బేబీ రన్'. ముందుగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

 కథ:

కథ:


సత్య (ఆర్జే బాలాజీ) ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి. ఒకరోజు తనకు కాబోయే భార్య ప్రియాంక (ఇషా తల్వార్)తో బయటకు వెళతాడు. ఆమెకు ఒక గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేద్దామనుకుంటాడు. ఆ కానుక ఇవ్వబోతుండగా.. తన కారులో అనుకోకుండా వెనుక సీట్లో పరిచయం లేని అమ్మాయి తార (ఐశ్వర్య రాజేష్) కనిపిస్తుంది. దీంతో షాక్ అయిన సత్య.. ప్రియాంకను మేనేజ్ చేసి ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాడు. తర్వాత తను ప్రమాదంలో ఉన్నానని ఒక రెండు గంటలు తన ఆశ్రయం కావాలని బతిమిలాడుకుంటుంది తార. దీంతో సత్య ఒప్పుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం తార శవమై కనిపిస్తుంది. దీంతో ఆ శవాన్ని సూట్ కేస్ లో పెట్టి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తాడు సత్య.

 ఎవరు హత్య చేశారు..

ఎవరు హత్య చేశారు..

తార శవాన్ని సత్య ఎలా తరలిద్దామనుకున్నాడు? ఆ శవం చివరికీ ఏమైంది? అసలు తార ఎలా చనిపోయింది? తను ఆత్మహత్య చేసకుందామనుకున్న సత్య ఎందుకు ఆగిపోయాడు? తారను హత్య చేసింది ఎవరో సత్య తెలుసుకున్నాడా? ఈ క్రమంలో సత్యకు ఎదురైన ఇబ్బందులు ఏంటీ? అసలు సోఫియా (స్మృతి వెంకట్) ఎవరు? అనే తదితర ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే కచ్చితంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ 'రన్ బేబీ రన్' చూడాల్సిందే.

విశ్లేషణ:

విశ్లేషణ:


ఒక సాధారణ, మాములు మనిషి జీవితంలోకి పరిచయం లేని అమ్మాయి వచ్చి అకస్మాత్తుగా తన ఇంట్లో చనిపోవడం.. సాయం చేద్దామనుకున్న వ్యక్తి జీవితం ఎలా తలకిందులైందనే ప్రధాన కథాంశంతో రన్ బేబీ రన్ ను తెరకెక్కించారు. ఇదొక మర్డర్ మిస్టరీ. అయితే నార్మల్ గా ఇలాంటి సినిమాల్లో హీరో బంధువులు, స్నేహితులు చనిపోవడం. వాళ్లను ఎవరు చంపారో తెసుకోవడం వంటివి జరుగుతాయి. ఇది కూడా అలాంటి స్టోరీనే. కానీ ఇందులో పరిచయం లేని అమ్మాయి మర్డర్ మిస్టరీని చేధించడమనే నెరేషన్ తో కొత్తగా అడుగులు వేశారు డైరెక్టర్ జియేన్ కృష్ణకుమార్. ఒక మెడికల్ కాలేజీ స్టూడెంట్ సూసైడ్ తో సీన్ ప్రారంభించి.. ఎక్కడా లేట్ చేయకుండా వేగంగా కథలోకి తీసుకెళ్లారు.

చివరి వరకు సస్పెన్స్..

చివరి వరకు సస్పెన్స్..

మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య తర్వాతే హీరో సూసైడ్ చేసుకోవడం వంటి సీన్ చూపించి ఏం జరుగుతుందో అని సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. తర్వాత వెనువెంటనే గ్రిప్పింగ్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. మొదట జరిగిన ఒక మెడికో మరణం హత్యా.. ఆత్మహత్యా అనే విషయాన్ని హోల్డ్ లో పెట్టి సినిమా ఎండ్ వరకు సస్పెన్స్ క్రియేట్ చేశారు. సూసైడ్ చేసుకోవాలనుకున్న హీరో సీన్ నుంచి ఒక్కో సన్నివేశం కథలో లీనమయ్యేలా చేస్తుంది. తర్వాత హీరో ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ వెళ్లడం, హీరో కోసం పోలీసులు వెతకడం వంటివి ఆసక్తి పెంచారు. అయితే పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ మాత్రం పేలవంగా ఉంటుంది.

అది మైనస్ గా..

అది మైనస్ గా..

తార కాకుండా ఇంకెవరెవరు చనిపోయారని హీరో తెలుసుకునే విషయం ఉత్కంఠంగా ఉంటుంది. చివరి వరకు హత్యలు ఎవరు చేశారనేది కనిపెట్టడం కష్టంగానే ఉంటుంది. అయితే కొన్ని విషయాలు ఎండ్ కు వచ్చిన లాజిక్ అందవు. కానీ సత్య చేసే ఇన్వెస్టిగేషన్ మాత్రం చూపు తిప్పుకోనివ్వదు. ఇక చివరి క్లైమాక్స్ మాత్రం చాలా సాదాసీదాగా ఉంటుంది. అది కాస్తా మైనస్ అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే..

ఎవరెలా చేశారంటే..

అమాయకత్వం, భయపడే వ్యక్తిగా.. తన ప్రాణాల మీదకు వస్తే తెగించే సత్య పాత్రలో ఆర్జే బాలాజీ నటన చాలా బాగా ఆకట్టుకుంది. తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. ఐశ్వర్య రాజేష్ పాత్ర నిడివి తక్కువ అయినా తన ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది. ఆమె నటన హైలెట్ గా ఉంటుంది. ఇక మిగతా పాత్రలు బాగా నటించాయి. సినిమాకు మ్యూజిక్ అందించిన సామ్ సీఎస్ ను మెచ్చుకోక తప్పదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో బీజీఎమ్, ఐశ్వర్య నటన భయపెట్టిస్తుంది.

ఉత్కంఠంగా సాగే..

ఉత్కంఠంగా సాగే..

మలయాళంలో కాలేజ్ డేస్, కాంచి, తియాన్ వంటి చిత్రాలను తెరకెక్కించిన జియెన్ కృష్ణ కుమార్ చాలా కాలం తర్వాత రన్ బేబీ రన్ మూవీ డైరెక్ట్ చేశారు. గ్యాప్ వచ్చిన కూడా పనితనం ఏమాత్రం తగ్గలేదన్నట్లుగా ఉంది ఆయన దర్శకత్వం. సినిమా టేకింగ్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అన్ని సూపర్బ్ గా కుదిరాయి. ఇక ఫైనల్ గా చెప్పాలంటే సాదా సీదా క్లైమాక్స్ తప్పా ఉత్కంఠంగా సాగే మర్డర్ మిస్టరీ ఈ 'రన్ బేబీ రన్' ను కచ్చితంగా చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X