Robinhood Movie Review: రాబిన్‌హుడ్ తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating : 2.75/5
మూవీ: రాబిన్ హుడ్
నటీనటులు: నితిన్, శ్రీలీల, దేవ దత్ నాగే, డేవిడ్ వార్నర్, రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్, లాల్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్
కథ, మాటలు, కథనం, దర్శకుడు: వెంకీ కుడుముల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్
సంగీతం: జీవి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరాం
రిలీజ్ డేట్: 2025-03-28
ప్రపంచ వ్యాప్తంగా గంజాయి సాగులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తే రాక్షసుడు సామీ (దేవదత్త నాగే) రుద్రవనం అనే ఊరులో అక్కడ పండించే గంజాయికి అత్యంత డిమాండ్ ఉందని ఆ ఊరినే తన సొంతం చేసుకొని ఎదురిచ్చినవారిని చంపి మరీ ఆ ఊరిలో వారితోనే గంజాయి సాగు చేయిస్తూ తన డ్రీం వైపు అడుగులు వేస్తుంటాడు.

తనకి డబ్బు కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ కావాలని చూసే సామి ఆ రుద్రవనం ఊరికి పెద్ద దిక్కు అయినటువంటి వ్యక్తి (లాల్) అతని మనవరాలు నీరా వాసుదేవ్ (శ్రీలీల) ని ఆ ఊరికి కావాలని రప్పిస్తాడు. అయితే ఈ రప్పించడం వెనుక ఉన్న కారణం ఏంటి? రామ్ అలాగే రాబిన్ హుడ్ గా పిలవబడే (నితిన్) ఎందుకు ఒక దొంగలా మారాల్సి వస్తుంది.
ఇండియన్స్ అంతా తన ఫ్యామిలీ అనే మోటివ్ పెట్టుకొని ఏం చెయ్యాలని చూస్తాడు? ఇండియాస్ నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతున్న జనార్దన్ సున్నిపెంట (రాజేంద్ర ప్రసాద్) తో కలిసి శ్రీలీలని తీసుకొని రుద్రవనంకి వచ్చిన తర్వాత రాబిన్ హుడ్ డబ్బులు కోసం ఏం చేస్తాడు? విలన్ తో కూడా డీలింగ్ చేసి ఆమెని వదిలేస్తాడా లేదా అసలు తానే కావాలని రావాలనుకున్నాడా? ఈ అంతటిలో డేవిడ్ (డేవిడ్ వార్నర్) ఎవరు అనేవి మిగతా కథ..
ఛలో, భీష్మ సినిమాలతో మంచి ఎంటర్టైనర్స్ ని అందించిన వెంకీ కుడుముల నుంచి మళ్ళీ నితిన్ తో వచ్చిన ఈ సినిమా కూడా వాటి తరహాలోనే మంచి ఎంటర్టైనర్ అని చెపుకోవచ్చు. వెంకీ ఏమనుకొని స్క్రీన్ ప్లే డెవలప్ చేసుకున్నాడో కానీ కొన్ని సీన్స్ మాత్రం లింక్డ్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ ఆస్ట్రేలియాలో ఉంటుంది అలాగే హీరోకి కూడా ఇండియాలో ఉండే వారు అంతా తన బ్రదర్ అండ్ సిస్టర్స్ అనే సెంటిమెంట్ లో ఉంటాడు కాబట్టి తనకి ఒక ఫారినర్ కావాలి అలా ఓ లింక్ ఇంట్రెస్టింగ్ గా సెట్ చేస్తే విలన్ గ్యాంగ్ సెట్ చేసే డీలింగ్ డాన్ కూడా ఆస్ట్రేలియాకి చెందినట్టుగా చూపిస్తారు.
ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాలో మెయిన్ విలన్ కే హెడ్ ని కూడా ఆస్ట్రేలియా నుంచే దింపడం గమనార్హం. ఈ డాట్స్ ఒకింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఇక సినిమాలో వెంకీ మార్క్ కథనం బాగుంది అని చెప్పవచ్చు. సినిమాలో క్రేజీ కామెడి సీన్స్ ఆడియెన్స్ కి ఫెళ్ళున నవ్వేలా చేస్తాయి. ఫస్టాఫ్, సెకండాఫ్ లలో పలు కామెడీ సీన్స్ హిలేరియస్ గా వర్కౌట్ అవుతాయి. అలానే క్లైమాక్స్ లో నితిన్ కి దేవదత్త నాగే నడుమ సాగే ఓ డైలాగ్స్ తో కూడిన కామెడీ ట్రాక్ బాగుంది. ఇంకా ఫస్టాఫ్ లో రాజేంద్ర ప్రసాద్ పై ప్రతీ సీన్ అదిరిపోయింది.
కామెడీ, ఫన్ విషయంలో మాత్రం వెంకీ ఎక్కడా తగ్గలేదు. తన మార్క్ కామెడీ టైమింగ్ ని చిన్న చిన్న డైలాగ్స్ ని చూపించారు. కాగా ఇవి మాత్రమే కాకుండా సినిమాలో ఒక ఎమోషనల్ ట్రాక్ నటుడు లాల్ పై చూపించేది బాగుంది. అలాగే తనకి నితిన్ పాత్రకి ఉన్న కనెక్షన్ వాటితో కూడిన ట్విస్ట్ లు సినిమాలో మంచి ఫీల్ కలిగిస్తాయి. కాగా ఇలా చాలా వరకు బాగానే నడిచిన కథనంలో కొత్తదనం మిస్ అయ్యింది. ఇంకొన్ని సన్నివేశాలు మేకర్స్ బాగా చేయాల్సింది. ఒక్క అదిదా సర్ప్రైజ్ తప్ప మిగతా పాటల విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సిందనిపిస్తుంది.
ఇక నటీనటుల విషయంకి వస్తే.. నితిన్ అదరగొట్టాడు. ఒక దొంగగా ఇంకోపక్క ఎమోషనల్ పాత్రలో ఒక సెక్యూరిటీ గార్డ్ గా కూడా ఇలా పలు షేడ్స్ లో బాగా చేసాడు. ముఖ్యంగా కామెడీ సీన్స్ ఇంకా యాక్షన్ సన్నివేశాల్లో నితిన్ ఇంప్రెస్ చేస్తాడు. అలానే తనతో ట్రావెల్ అయ్యే రాజేంద్ర ప్రసాద్ గత సినిమాల్లో కంటే ఇందులో చాలా బాగా చేసినట్టుగా అనిపిస్తుంది.
నితిన్ తో కొన్ని కామెడీ ట్రాక్స్ అలానే తనపై ఒకటీ రెండు సోలో ట్రాక్స్ కూడా అదరగొట్టేశారని చెప్పవచ్చు. ఇంకా బ్యూటీ శ్రీలీల విషయానికి వస్తే ఆమె రష్మిక మందన్న రోల్ ని రీప్లేస్ చేసినట్టు అందరికీ తెలిసిందే. అయితే ఆమె కొన్ని సీన్స్ బాగానే చేసింది. కానీ మరికొన్ని సీన్స్ లో మాత్రం రష్మికాని ఊహించుకుంటే నిజంగానే శ్రీలీల కంటే ఆమెనే బెటర్ ఛాయిస్ కదా ఈ సీన్స్ రష్మిక ఇంకా బెటర్ గా చేసేది అనిపించక మానదు. అయినప్పటికీ తనకున్నంతలో శ్రీలీల బాగానే చేసేసింది.
ఇక ఆదిపురుష్ నటుడు ఈ సినిమా విలన్ దేవదత్త నాగే ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. ఆల్రెడీ తెలుగులో ఓ సినిమాలో విలన్ గా మెప్పించిన తాను రాబిన్ హుడ్ లో కూడా అంతకు మించిన నెగిటివ్ పెర్ఫామెన్స్ ని తాను అందించారు. విలనిజంతో పాటుగా లాస్ట్ లో అమాయకత్వం కామెడీగా ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. ఇక సినిమాలో అంతా ఎదురు చూసిన అవైటెడ్ స్టార్ డేవిడ్ వార్నర్ కోసం చెప్పకుండా ఎలా? డేవిడ్ వార్నర్ కి వెంకీ మంచి రోల్ నే డిజైన్ చేస్తే దానిని డేవిడ్ భాయ్ కేజ్రీగా పండించారు.
ఉన్న కొంచెం సేపే అయినప్పటికీ చిన్న చిన్న డైలాగ్స్ తో మంచి ఇంపాక్ట్ ని డేవిడ్ వార్నర్ చూపించి మంచి కిక్ ఇస్తారు. కాగా వీరితో పాటుగా వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో ఫుల్ ఫన్ జెనరేట్ చేస్తారు. ఇంకా షైన్ టామ్ చాకో మంచి రోల్ చేశారు కానీ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. వీరితో పాటుగా శుభలేఖ సుధాకర్, లాల్ ఇతర నటీనటులు తమ పాత్రలకి ఉన్న ప్రాముఖ్యత మేర బానే చేసేసారు. ఫైనల్ గా కేతిక శర్మ స్పెషల్ సాంగ్ లో తన అందాల ఆరబోతతో ఆడియెన్స్ కి మంచి కిక్ ఇస్తుంది.
సాంకేతిక వర్గ పని తీరుకి వస్తే.. జీవి ప్రకాష్ మంచి బీట్స్ ఈ సినిమాకి అందించాడు. పాటలు, స్కోర్ అలాగే సెకండాఫ్ లో నితిన్ పై ఓ స్పెషల్ ట్రాక్ ని తాను బాగా డిజైన్ చేశారు. ఇంకా సాయి శ్రీరాం కెమెరా పనితనం సినిమాలో బాగుంది. పలు విజువల్స్ ని ప్రెజెంట్ చేసిన తీరు విజువల్స్ బాగున్నాయి. కోటి ఎడిటింగ్ లో అక్కడక్కడా కత్తెర వేయాల్సింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు అత్యున్నతంగా సినిమాలో అనిపిస్తాయి.
మొత్తమ్మీద చూసుకున్నట్టయితే ఈ రాబిన్ హుడ్ సినిమా ఒక ఎంటర్టైనింగ్ యాక్షన్ ఫ్లిక్ అని చెప్పుకోవచ్చు. కావాల్సినంత ఫన్ అందులోనే మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ఇంకా బాగున్నాయి అనిపించే ఎమోషన్స్ సినిమాలో బలంగా కనిపిస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువగానే చూస్తున్న డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ అనేది సినిమాని ఒకింత రొటీన్ అనిపించేలా చేస్తుంది. కానీ మిగతా అంశాలు మాత్రం ఈ సినిమాలోకి ఆడియెన్స్ ఎంగేజ్ అయ్యేలా చేసి తీరుతాయి. ఛలో, భీష్మ లాంటి ఎంటర్టైనర్స్ మీకు నచ్చితే రాబిన్ హుడ్ కూడా ఎంటర్టైన్ చేస్తాడు. నితిన్, డేవిడ్ వార్నర్, శ్రీలీల కోసమైనా డోంట్ మిస్.. వాచ్ ఇట్.


Click it and Unblock the Notifications











