Robinhood Movie Twitter Review: రాబిన్‌హుడ్ మూవీ ట్విట్టర్ రివ్యూ

యువ హీరో నితిన్, శ్రీలీల జంటగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం రాబిన్‌హుడ్. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యెర్నేని నవీన్, రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రీమియర్ల ప్రదర్శన తర్వాత నెటిజన్లు సోషల్ మీడియాలో వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే..

Robinhood Movie Twitter Review

రాబిన్‌హుడ్ ఫన్ ఎంటర్‌టైనర్‌. సినిమా యావరేజ్ కంటే ఎక్కువగానే ఉంది. ఫస్టాఫ్ బాబగుంది. సెకండాఫ్ ఒకే అనిపిస్తుంది. స్టోరీ కొత్తగా ఏమీ లేదు. కామెడీ వైజ్‌ చూస్తే సీన్లతో ఓ ఫ్లోలో వెళ్లిపోతుంది. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా ఇది. మంచి ఫన్ ఉంటుంది. రాబిన్‌హుడ్‌కు సీక్వెల్ ఉంటుందని లీడ్ ఇచ్చారు. 2వ పార్ట్‌లో విలన్‌గా డేవిడ్ వార్నర్ అని చెప్పారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఫెయిల్యూర్ చాలా మందిని కుంగదీస్తాయి. 12 ఫ్లాపుల చూసిన నితిన్ బలంగా తిరిగి హిట్ కొట్టడం ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం 5 ఏళ్లుగా నితిన్‌కు హిట్ లేదు. కానీ రాబిన్‌హుడ్‌తో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ కమ్ బ్యాక్ ఆయనకు స్పెషల్‌గా ఉంటుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


రాబిన్‌హుడ్ సమ్మర్‌లో మంచి ఎంటర్‌టైనర్. నితిన్, రాజేంద్రప్రసాద్ కాంబో ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్. డైరెక్టర్ వెంకీ కుడుముల సింపుల్ స్టోరిని తనదైన ట్రేడ్ మార్క్ కామెడీ, స్క్రీన్ ప్లేతో బాగా డీల్ చేశాడు. డేవిడ్ వార్నర్ కేమియో పూర్తిగా రోమాలు నిక్కబొడుస్తుంది. మైత్రీ ఖాతాలో మరో హిట్ చేరింది. శ్రీలీల పెర్ఫార్మెన్స్ ఫెంటాస్టిక్. జీవీ ప్రకాశ్ బీజీఎం బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

రాబిన్‌హుడ్ ఫన్‌తో కూడిన మంచి ఎంటర్‌టైనర్. ఫస్టాఫ్‌లో వెంకి కుడుముల, నితిన్ కాంబో మంచి వినోదాన్ని పంచింది. సెకండాప్ ఎమోష్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో మెప్పించే ప్రయత్నం చేశారు. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ బాగుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఈ సినిమాకు గుండెకాయ లాంటిది అని ఓ నెటిజన్ తన రివ్యూను అందిచారు.

రాబిన్‌హుడ్ సినిమా ప్రీమియర్ షో మొదలైంది. ఈ సినిమా గురించి నిజాయితీతో కూడిన రివ్యూను ఇస్తాం. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అనుకొంటున్నాను. యాక్టర్ నితిన్, శ్రీలీలకు మంచి విజయం చేకూరాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

రాబిన్‌హుడ్ సినిమా బాగుంది. హీరో ఇంట్రడక్షన్ క్రేజీగా ఉంది. ఈ సినిమాకు జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళితే.. కొన్ని సర్‌ప్రైజ్‌లు మీకు వినోదాన్ని అందిస్తాయి అని ఓ నెటిజన్ అన్నాడు.

రాబిన్‌హుడ్ సినిమా ఫస్టాఫ్ ఓకేగా ఉంది. సెకండాఫ్ చాలా బాగుంది. యూకేలో ఈ సినిమా ప్రీమియర్లు గ్రాండ్‌గా మొదలయ్యాయి. చాలా చోట్ల మంచి ఆక్యుపెన్సీ కూడా నమోదైంది అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Read more about: robinhood nithiin sreeleela
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X