India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rocketry movie review మాధవన్ ఫెర్ఫార్మెన్స్ సూపర్.. హృదయాన్ని పిండేసే భావోద్వేగమైన మూవీ!

  |

  Rating: 3/5

  రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ చిత్రం ప్రముఖ భారతీయ ఇండియన్ ఎయిరోస్సేస్ సైంటిస్ట్, పద్మభూషణ్ నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఇస్రో పరిశోధనకు సంబంధించిన విషయాలు, క్రయోజెనిక్ ఇంజిన్లను పాకిస్థాన్‌కు అమ్మారనే ఆరోపణలపై ఆయన అరెస్ట్ అయ్యాడు. అయితే సీబీఐ దర్యాప్తులోను, అలాగే సుప్రీంకోర్టు విచారణలోను నంబి నారాయణ్ నిర్దోషిగా తనకు తాను నిరూపించుకొన్నారు.

  కోర్టు ఆదేశాల మేరకు కేరళ ప్రభుత్వం కూడా 1.3 కోట్ల పరిహారాన్ని చెల్లించింది. ఇలాంటి భావోద్వేగమైన జీవితాన్ని ఆర్ మాధవన్ నిర్మాతగా, దర్శకుడిగా మారి తెరకెక్కించారు. ఇన్నో మలుపులు తిరిగిన నంబీ నారాయణ్ జీవితం తెర మీద ఎలాంటి అనుభూతికి గురిచేసిందనే విషయంలోకి వెళితే..

  రాకెట్రీ కథ ఏమిటంటే?

  రాకెట్రీ కథ ఏమిటంటే?

  భారతీయ అంతరిక్ష పరిశోధనలో దిగ్గజం విక్రమ్ సారాభాయ్ శిష్యుడిగా 1966లో నంబీ నారాయణ్ ఇస్రోలో ఉద్యోగంలో చేరుతాడు. నాసా ఫెలోషిప్ రావడంతో ప్రిన్స్‌టాన్ యూనివర్సిటీలో చేరడంతో అతడి జీవితానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. లిక్విడ్ ప్రొపల్షన్ ద్వారా రాకెట్లను అంతరిక్షంలోకి పంపాలనే కొత్త ప్రయోగం చేసి చరిత్ర సృష్టించే ప్రయత్నం చేస్తాడు.

  రష్యా డెవలప్ చేసిన క్రయోజెనిక్ ఇంజిన్లు భారత్ తీసుకొచ్చి.. ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీ పడుతూ.. 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థలో భారత్‌ను భాగం చేయాలని అనుకొంటాడు. ప్రపంచపటంపై భారత్‌ను ఉన్నతస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న సమయంలో పాకిస్థాన్‌కు ఇస్రో పరిశోధన పత్రాలను చేరవేశాడనే ఆరోపణలపై నంబి నారాయణ్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేస్తారు.

  కథలో కీలక మలుపులు ఇలా?

  కథలో కీలక మలుపులు ఇలా?

  ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో అతి తక్కు కాలంలో పీహెచ్‌డీ నంబీ నంబియార్‌ ఎలా పూర్తి చేశాడు? నాసాలో ఉన్నత పదవిని తిరస్కరించి భారత్‌కు ఎందుకు తిరిగి వచ్చాడు? ఎలాంటి పరిస్థితుల్లో నంబి నారాయణ్ అరెస్ట్ అయ్యారు. నంబి నారాయణ్ అరెస్ట్ తర్వాత పరిస్థితులు ఎలా మలుపుల తిరిగాయి? కేరళ పోలీసుల చెరలో నంబి ఎలాంటి చిత్రహింసలు అనుభవించాడు? తాను నిర్దోషి అని నిరూపించుకోవడానికి నంబి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? తన అరెస్ట్ తర్వాత మానసిక వ్యాధికి గురైన భార్య మీనా (సిమ్రాన్)‌ను ఎలా ప్రొటెక్ట్ చేసుకొన్నాడు? నంబిపై కుట్ర కేసులో అసలు నేరస్థులు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే రాకెట్రీ సినిమా కథ.

   ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

  రాకెట్రీ మూవీ కథ.. పెళ్లి నేపథ్యం ఉన్న ఎమోషనల్‌తో కూడిన ఫీల్‌గుడ్ సన్నివేశాలతో మొదలువుతుంది. అలాంటి ఫీల్ గుడ్‌ పరిస్థితుల మధ్య నంబి నారాయణ్ అరెస్ట్ కావడం.. ఆయన అరెస్ట్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎదుర్కొన్న దారుణ పరిస్థితులు ప్రేక్షకుడిని కథకు కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. అయితే తొలి భాగంలో రాకెట్ సైన్స్, స్పేస్ రీసెర్చ్‌కు సంబంధించిన విషయాలను లోతుగా చూపించడం వల్ల కాస్త డాక్యుమెంటరీ ఫీల్ అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్‌కు ముందు వికాస్ ఇంజిన్‌ను కనుగొన్న సీన్‌తో తొలి భాగం అత్యంత భావోద్వేగంగా ముగుస్తుంది.

  రెండో భాగం ఫుల్ ఎమోషనల్‌గా

  రెండో భాగం ఫుల్ ఎమోషనల్‌గా

  ఇక సెకండాఫ్‌లో కథలో సీరియస్, సెన్సిబుల్ ఎలిమెంట్స్‌ తెరపైన అద్భుతంగా కనిపిస్తాయి. పాత్రల మధ్య ఎమోషన్స్, నంబి నారాయణ్ ఎదుర్కొన్న పరిస్థితులన్నీ ప్రేక్షకుడి హృదయాన్ని పిండేస్తాయి. ఓ నిజమైన దేశభక్తుడిపై ఇలాంటి కుట్రలా అనే ఆవేదన ప్రతీ సన్నివేశంలో కలుగుతుంది. నంబి నారాయణ్ నిర్దోషి అని కోర్టులు, సీబీఐ తేల్చిన తర్వాత పరిహారం, పద్మభూషణ్ పొందడం లాంటి సీన్లు టచింగ్‌గా ఉంటాయి. అయితే నేను నిర్దోషిని.. మరి నేరస్థుడు ఎవరు అనే ప్రశ్న ప్రస్తుతం మిలియన్ డాలర్ క్వశ్చన్‌‌గా ప్రేక్షకులకు మదిలో మెదలడం ఖాయం.

  దర్శకుడిగా మాధవన్

  దర్శకుడిగా మాధవన్

  దర్శకుడిగా ఆర్ మాధవన్ ఎంచుకొన్న పాయింట్‌ను పూర్తిస్థాయి సినిమాగా విస్తరించిన తీరు తొలి సన్నివేశం నుంచే ఆకట్టుకొంటుంది. అయితే అత్యంత సాంకేతికతతో కూడిన కంటెంట్‌ను సాధారణ ప్రేక్షకులకు కూడా అర్ధం అయ్యేలా ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. అయితే తొలి భాగంగా కథా స్వరూపం కారణంగా డాక్యుమెంటరీ మాదిరిగా అనిపిస్తుంది. అది కాకుండా సినిమా అంతా ఎమోషనల్‌గా చిత్రీకరించడం ఆయనకు సినిమాపై ఉన్న అభిరుచిని తెలియచేస్తుంది. సెకండాఫ్‌లో సన్నివేశాల కోసం రాసుకొన్న డైలాగ్స్ కానీ.. ఎమోషనల్ పాయింట్స్ గానీ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని చెప్పవచ్చు. సైబీరియాలో చిత్రీకరించిన సీన్లు హాలీవుడ్ సినిమాను ముఖ్యంగా జెమ్స్ బాండ్ మూవీని తలపించాయి

  నంబీగా మాధవన్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే..

  నంబీగా మాధవన్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే..


  ఇక నటుడిగా ఆర్ మాధవన్ ఓ రకమైన విశ్వరూపమే చూపించాడు. ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోసిన ఆయన మరోసారి ఫెర్ఫార్మెన్స్ పరంగా చెలరేగిపోయారు. నంబి పాత్ర యువకుడిగా ఉన్నప్పటి నుంచి.. ముసలివాడయ్యే వరకు రకరకాల గెటప్స్ కనిపిస్తాయి. ఆ గెటప్స్‌కు అనుగుణంగా మాధవన్ తన దేహాన్ని పాత్రకు అనుగుణంగా మార్చుకోవడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. పాత్ర కోసం ఆయన కష్టపడిన విధానం తెర మీద చూస్తే థ్రిల్ అవ్వడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

  సిమ్రాన్, ఇతర పాత్రల్లో

  సిమ్రాన్, ఇతర పాత్రల్లో

  ఇక ఇతర పాత్రల్లో నంబి భార్య మీనాగా సిమ్రాన్ నటించింది. సాధారణ గృహిణి పాత్రలో ఆకట్టుకొన్నది. సన్నివేశాలకు తగినట్టుగా హావభావాలు, ఫన్, డైలాగ్స్‌తో సరసం లాంటి రసాలను తెరమీద బాగా పండించింది. ఇక క్లైమాక్స్‌లో సిమ్రాన్ నటన గుండెను పిండేస్తుంది. సిమ్రాన్ మీనా పాత్రలో ఒదిగిపోయింది. ఇక కలాం పాత్రలో గుల్షన్ గ్రోవర్ చక్కగా నటించారు. సూర్య పాత్ర సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. కథలో ఉండే ఫీల్‌ను ముందుకు తీసుకెళ్లడానికి సూర్య రోల్ పూర్తిగా న్యాయం చేసింది.

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే.. రాకెట్రీ సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యూజిక్, స్పెషల్ ఎఫెక్ట్ వెన్నెముక అని చెప్పవచ్చు. సైబీరియా, విదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. రీరికార్డింగ్ అద్బుతంగా ఉండటమే కాకుండా సన్నివేశాలను హైలెట్ చేశాయి. స్పెషల్ ఎఫెక్ట్స్ అనుభూతి తెరమీద చూస్తే వాటి ప్రాధాన్యత అర్ధమవుతుంది. ఈ సినిమాకు ఆర్ మాధవన్, ఆయన భార్య సరితా నిర్మాతలుగా వ్యవహరించారు. కథను అద్భుతంగా తెరకెక్కించడానికి ఎక్కడా రాజీ పడలేదనే విషయం ప్రతి సందర్భంలో స్పష్టమవుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  రాజకీయ శక్తులు, ఇస్రోలోని కొందరు పన్నిన కుట్రలకు దేశం గర్వించదగిన అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణ్ ఎలా బలయ్యాడు. దేశద్రోహిగా ముద్ర వేసుకొని మళ్లీ నిర్దోషిగా మారడానికి నంబి పడిన కష్టాలతో కూడిన జర్నీ రాకెట్రీ. ఇటీవల కాలంలో వచ్చిన బయోపిక్స్‌లో రాకెట్రీ ముందు వరుసలో నిలుస్తుంది. బలమైన స్క్రిప్టు, భావోద్వేగానికి గురిచేసే సన్నివేశాలు, అద్భుతమైన నిర్మాణ, సాంకేతిక విలువలు ఈ సినిమాను ఉత్తమంగా తీర్చిదిద్దాయి. దేశ చరిత్రలో సంచలనం రేపిన ఈ కేసు జర్నీని తెరపైనే ప్రతీ ఒక్కరు చూడాల్సిందే. అంతరిక్ష పరిశోధనలో భారత్‌ను అగ్రదేశాల మధ్య నిలబెట్టిన నిజమైన దేశభక్తుడి గొప్ప ట్రిబ్యూట్ రాకెట్టీ: ది నంబి ఎఫెక్ట్ అని చెప్పవచ్చు.

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: ఆర్ మాధవన్, సిమ్రాన్, సూర్య, గుల్షన్ గ్రోవర్, రవి రాఘవేంద్ర తదితరులు
  రచన, డైలాగ్స్, దర్శకత్వం, నిర్మాత: ఆర్ మాధవన్
  నిర్మాతలు: సరితా మాధవన్, ఆర్ మాధవన్, వర్గీస్ ములాన్, విజయ్ ములాన్
  సినిమాటోగ్రఫి: సిర్షా రే
  ఎడిటింగ్: బిజిత్ బాలా
  మ్యూజిక్: సామ్ సీఎస్
  బ్యానర్స్: ట్రైకలర్ ఫిల్మ్స్, వర్గీస్ మూలన్ పిక్చర్స్, 27th ఎంటర్‌టైన్‌మెంట్
  రిలీజ్ డేట్: 2022-07-01

  English summary
  ISRO scientist Nambi Narayanan's biopic Rocketry: The Nambi Effect is set release on July 1st. Here is the Telugu filmibeat exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X