Rocky Aur Rani Kii Prem Kahaani Review:ఆలియా,రణ్‌వీర్ కెమిస్ట్రీ అదుర్స్..రాకీ ఔర్ రాణి కి ప్రేమ కహాని రివ్యూ
Rating: 3/5
నటీనటులు: రణ్‌వీర్ సింగ్, ఆలియాభట్, జయబచ్చన్, ధర్మేంద్ర, షబానా ఆజ్మీ, టాటా రాయ్ చౌదరీ, భారతీ సింగ్, వరుణ్ ధావన్, అనన్య పాండే, సారా ఆలీ ఖాన్, జాన్వీ కపూర్ తదితరులు
దర్శకత్వం: కరణ్ జోహర్
రచన: ఇషితా మోయిత్రా, శశాంక్ ఖైతాన్, సుమిత్ రాయ్
నిర్మాతలు: హిరూ యష్ జోహర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా
సినిమాటోగ్రఫి: మనుష్ నందన్
ఎడిటింగ్: నితిన్ బెయిద్
మ్యూజిక్: ప్రీతమ్
బ్యానర్ం ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్18 స్టూడియోస్
రిలీజ్ డేట్: 2023-07-28
ఢిల్లీలో భారీ మిఠాయి కంపెనీని నడిపే పంజాబీ కుటుంబానికి చెందిన వారసుడు రాకీ రాంధ్వా (రణ్‌వీర్ సింగ్). స్టైలిష్ లుక్‌తో విలాసవంతమైన జీవితాన్ని గడిపే రాకీకి ధనలక్ష్మీ ( జయ బచ్చన్), కన్వల్ (ధర్మేంద్ర) అనే తాత, అమ్మమ్మలు ఉంటారు. అయితే తన తాత మనసుకు దగ్గరైన జమిని ఛటర్జీ (షబానా ఆజ్మీ)ని కలిపేందుకు ముందుకు వెళ్తాడు. ఆ క్రమంలో జమిని ఛటర్జీ మనవరాలు రాణి ఛటర్జీ (ఆలియాభట్)తో తొలి చూపులోనే ప్రేమలో పడుతాడు. అయితే రాణి, రాకీ ప్రేమకు ఇరు కుటుంబాలు అభ్యంతరం చెబుతాయి.

బెంగాలీకి చెందిన రాణి జర్నలిస్టుగా ఏం చేయాలనుకొన్నది? పక్కా పంజాబీ యువకుడైనా రాకీ తన జీవితాన్ని ఎలా లీడ్ చేయాలనుకొంటాడు? ఈ కథకు ధనలక్ష్మీ, కన్వల్, జమిని ఛటర్జీ పాత్రల లింక్ ఏమిటి? రాణి, రాకీ ప్రేమకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి? తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవడానికి రాకీ, రాణి ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సినిమా కథ.
రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సినిమా దర్శకుడు కరణ్ జోహర్ స్టయిల్‌లో సాగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. పాటలు, డ్యాన్సులు, ఊహకందని భావోద్వేగాలతో సరదాగా సాగుతుంది. రెండు కుటుంబాలు, రాణి, రాకీ ప్రేమ కథలో రొటీన్‌గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఏం జరుగుతందో ఊహించవచ్చు. క్లైమాక్స్ రాకీతో రాణి పెళ్లి విషయంలో ధనలక్ష్మీ కుటుంబ ఇచ్చే చిన్న ట్విస్టు ఫీల్‌గుడ్‌గా అనిపిస్తుంది.

స్వీట్ వ్యాపారం నిర్వహించే కుటుంబానికి చెందిన పంజాబీ యువకుడిగా రణ్‌వీర్ సింగ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అర్బన్ యువకుడి మాదిరిగా స్టైల్, లుక్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకొంటాడు. జర్నలిస్టుగా రాణి క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. అవినీతి నేతలను బండారం బయటపెట్టాలనుకొనే యువతి పాత్రలో ఆకట్టుకొన్నది. సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్లలో ఆలియా భట్ పెర్ఫార్మెన్స్ బాగుంది.
మిగితా పాత్రల విషయానికి వస్తే..ధర్మేంద్ర, జయబచ్చన్, షాబానా ఆజ్మీ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వరుణ్ ధావన్, అనన్య పాండే, సారా ఆలీ ఖాన్, జాన్వీ కపూర్ అతిథి పాత్రల్లో చిన్న మ్యాజిక్ మాదిరిగా మెరుస్తారు. ఇతర పాత్రలో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే. ప్రీతమ్ మ్యూజిక్ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ష్, భజారే, తుమ్ క్యా మిలే, దోలా రే డోలా పాటలు తెరపైన క్రేజీగా ఉంటాయి. మనుష్ నందన్ సినిమాటోగ్రఫి బాగుంది. సంపన్న వర్గాల ఇంటి సెటప్‌లో సాగే ఫ్యామిలీ డ్రామాను, ప్రతీ సన్నివేశాన్ని రిచ్‌గా చిత్రీకరించారు. ఇషితా మోయిత్రా రాసిన డైలాగ్స్ ఎమోషనల్‌గాను, ఫన్, కామెడీని బాగా పండించాయి. సినిమాలో ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా కనిపిస్తూ గ్రాండియర్‌గా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ హై క్లాస్‌గా అనిపిస్తాయి.

దర్శకుడు కరణ్ జోహర్ రూపొందించిన కభీ కుషీ కభీ ఘమ్ సినిమా తరహాలో సాగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఆలియాభట్, రణ్‌వీర్ సింగ్ లవ్ ట్రాక్, రొమాన్స్, కెమిస్ట్రీ ప్లస్ పాయింట్స్. ధర్మేంద్ర, జయబచ్చన్, షబానా ఆజ్మీ మరోసారి మంచి పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు.కాకపోతే ఈ తరం రిలేషన్‌షిప్స్, ట్రోలింగ్ తరహా కామెడీతో రొటీన్, రెగ్యులర్ ఫ్మామిలీ డ్రామా అనిపిస్తుంది. కరణ్ జోహర్ సినిమాను ఇష్టపడే వారికి రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











