For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Witness Review పారిశుద్ధ్య కార్మికుల కన్నీటీ కథతో హార్ట్ టచింగ్ గా 'విట్ నెస్'.. హైలెట్ ట్విస్ట్ తో క్లైమాక్స్

  |

  రేటింగ్: 2.75/5

  టైటిల్: విట్ నెస్ (తమిళ డబ్బింగ్)
  నటీనటులు: రోహిణి, శ్రద్ధా శ్రీనాథ్, తమిళరసన్, షణ్ముగరాజన్, అళగం పెరుమాల్ తదితరులు
  సినిమాటోగ్రఫీ: దీపక్
  దర్శకత్వం: దీపక్
  సంగీతం: రమేష్ తమిళమణి
  నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
  విడుదల తేది: డిసెంబర్ 9, 2022
  ఓటీటీ వేదిక: సోనీ లివ్

  ఒకప్పుడు హీరోయిన్ గా, ఇప్పుడు అనేక సినిమాల్లో సపోర్టింగ్ పాత్రలతో అలరిస్తున్న నటి రోహిణి. ఎక్కువగా హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. అలా మొదలైంది, ఇష్క్, బాహుబలి, నేను శైలజ, రంగస్థలం, ఆ, అంటే సుందరానికి వంటి తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకులు మన్ననలు పొందారు. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్.. నాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమాతో టాలీవుడ్ లో పాపులర్ అయింది. విక్రమ్ వేద, మారా, కృష్ణ అండ్ హిజ్ లీల, ఆది సాయి కుమార్ జోడి చిత్రాలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరు కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే విట్ నెస్. సామాజిక అంశాలతో ఓటీటీ తెరపైకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!

  కథ

  కథ

  ఇందిర (రోహిణి) ఒక పారిశుద్ధ్య కార్మికురాలు. భర్త చనిపోయిన ఆమెకు పార్తిబన్ (తమిళరసన్) అనే ఒక కొడుకు ఉంటాడు. అతన్ని బాగా చదివించి గొప్పోడిని చేయాలని కోరుకునే సగటు తల్లి. అలాగే పార్తిబన్ కూడా బాగా చదివి, డిగ్రీ పట్టా సాధించి తల్లిని బాగా చూసుకోవాలనుకుంటాడు. కానీ, ఓరోజు ఉదయం పనికి వెళ్లివచ్చిన ఇందిరకు హాస్పిటల్ కు రమ్మని పార్తిబన్ ఫ్రెండ్ కాల్ చేసి చెబుతాడు. అక్కడికి వెళ్లి చూశాక తన కొడుకు చనిపోయాడని పోలీసులు చెబుతారు. అసలు తన కుమారుడు ఎలా చనిపోయాడు? అందుకు కారణం ఎవరు? వాళ్లపై ఇందిర ఎలాంటి పోరాటం చేసింది? ఈ క్రమంలో ఆమె ఎదుర్కున్న సమస్యలు, సంఘటనలు ఏంటి? ఇందులో పార్వతి (శ్రద్ధా శ్రీనాథ్) ఏంటి? వంటి తదితర ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ విట్ నెస్ ను చూడాల్సిందే.

  విశ్లేషణ:

  విశ్లేషణ:

  సినిమా అనేది ఒక ఎంటర్టైన్ మెంట్ కోసం చూసేది. కానీ, అన్ని సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే తెరకెక్కించట్లేదు. చాలా మంది దర్శకులు నేటి సమాజంలో మనుషులు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షత వంటి పలు సామాజిక అంశాలపై తరకకెక్కిస్తున్నారు. అలాంటి వారిలో డైరెక్టర్ దీపక్ ఒకరు అని చెప్పవచ్చు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు, కుల వివక్షత వంటి పలు అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. మనం న్యూస్ ఛానెల్స్ లో ఎన్నో వార్తలు వింటుంటా. సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజీలో పడి కార్మికులు చనిపోయారనే వార్తలు చూస్తుంటాం. ఇదే ప్రధాన అంశంగా చాలా రియలిస్ట్ గా ఈ సినిమాను తెరక్కించారు డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్ దీపక్.

  విషవాయువుల బారిన పడి..

  విషవాయువుల బారిన పడి..

  క్లోజ్డ్ సెప్టింక్ ట్యాంక్స్, డ్రైనేజీల్లో మనుషులు దిగి పనిచేయవద్దని ప్రభుత్వం చెప్పినా సరే పలువురు కాంట్రాక్టులు డబ్బులకు కక్కుర్తి పడి రోజువారీ కూలీలతో పని చేయిస్తుంటారు. అందులో కొందరు చేయమని చెప్పినా కుల వివక్షత పేరుతో, వాళ్లే చేయాలన్నట్లుగా బలవంతంగా చేయిస్తుంటారు. ఇలా సెప్టింక్ ట్యాంక్స్, డ్రైనేజీల్లో విషవాయువులు బారిన పడి ఎంతో మంది చనిపోయారు. కానీ ప్రభుత్వం లెక్కల్లో ఒక్కరూ కూడా మరణించినట్లు ఉండదు. అందుకు కారణం వాళ్లు కాంట్రాక్ట్ కార్మికులు కావడమే. గత ఐదేళ్లలో చెన్నైలో సుమారు 340 మంది కార్మికులు చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇదే అంశాన్ని తీసుకుని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు దర్శకుడు దీపక్.

  ఊహించని విధంగా క్లైమాక్స్..

  ఊహించని విధంగా క్లైమాక్స్..

  సినిమా చాలా సింపుల్ గా స్లోగా సాగిన పార్తిబన్ మరణంతో ఆసక్తిగా ముందుకు సాగుతుంది. నేరేషన్ అంతా స్లోగా, చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది వినోదం కోసం కాదు కాబట్టి దాదాపు ఇలాంటి సినిమాలు అన్ని ఈ తరహాలోనే సాగుతాయి. కొడుకు మరణంపై ఇందిర చేసే పోరాటం, కోర్టులో సాగే విషయాలు, వాయిదాలు, ఇప్పటికీ చూసే కుల వివక్షత, పారిశుద్ధ్య కార్మికులను సూపర్ వైజర్లు, కాంట్రాక్టర్లు, వారి నిర్లక్ష్యం, అగ్రవర్ణాల వారి వైఖరి, ప్రభుత్వ ఉద్యోగులు చూసే తీరు, పోలీసు వ్యవస్థ వంటి తదితర అంశాలను చూపించే ప్రయత్నం చేశారు.

  అయితే అన్ని అంశాలను సరిగ్గా చూపించలేదనే ఫీలింగ్ కొంతవరకు కలుగుతుంది. దర్శకుడు తాను చెప్పాలనుకున్న కొన్ని పాయింట్స్ ను మరింత క్లియర్ గా చెప్పలేకపోయారనిపిస్తుంది. ఇక ఇలాంటి సినిమాల్లో క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించగలం. కానీ మనం ఊహించినదానికి పూర్తి భిన్నంగా, చాలా రియలిస్టిక్ గా, షాకింగ్ గా ఉంటుంది. ఎందుకంటే నిజ జీవితంలో జరిగేది అదే అని స్పష్టంగా చూపించారు. అదే ఈ సినిమాలో హైలెట్ ట్విస్ట్ గా ఉంటుంది.

  ఎవరెలా చేశారంటే

  ఎవరెలా చేశారంటే

  అనేక పాత్రల్లో ఒదిగిపోయి నటించే నటీమణుల్లో రోహిణి ఒకరు. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆశలు పెట్టుకున్న కొడుకు చనిపోవటం, అందుకోసం పోరాటం చేసే తల్లి పాత్రలో ఆమె జీవించేశారు. పార్వతి అనే పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఆకట్టుకున్నారు. సినిమా మొత్తం రోహిణి పాత్రపైనే సాగుతుంది. శ్రద్ధా శ్రీనాథ్ ది కీ రోల్ అయినప్పటికీ అంతగా ప్రభావం చూపించదు. ఇక మిగిలిన పాత్రల్లో అందరూ చక్కగా చేశారు. తెలుగు డబ్బింగ్ పర్వాలేదనిపించిన పాటల డబ్బింగ్ అస్సలు కుదరలేదు. నేపథ్య సంగీతం బాగుంది. ఆ మూడ్ కి తీసుకువెళ్లేలా ఉంది. సినిమాటోగ్రాఫర్ కూడా దర్శకుడే కావడంతో విజువల్ గా కూడా బాగుంది.

  ఫైనల్ గా చెప్పాలంటే..

  ఫైనల్ గా చెప్పాలంటే..

  పారిశుద్ధ్య కార్మికులపై తీసుకున్న పాయింట్ ను సరిగ్గా చూపించినా కొన్ని చోట్లు స్టోరీని డెప్త్ గా చూపించలేకపోయారు. కొన్ని చోట్ల డబ్బింగ్ సెట్ కాకపోయిన చాలా వరకు హార్ట్ హిట్టింగ్ గా చూపించారు. రియలిస్టిక్ సినిమా చూసేవాళ్లకు ఊహించని క్లైమాక్స్ తో ఈ విట్ నెస్ ఎంతో నచ్చుతుంది.

  English summary
  Rohini Shraddha Srinath Starrer Social Element Drama Witness 2022 Movie Review And Rating In Telugu
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X