రోటి కపడా రొమాన్స్ రివ్యూ అండ్ రేటింగ్

రేటింగ్: 2.75

నటీనటులు: హర్ష నర్రా, మేఘ లేఖ, నువేక్ష, తరుణ్ పొనుగంటి, సందీప్ సరోజ్, సుప్రజ్ రంగ, సోనియా ఠాకూర్, ఖుష్బూ.
కథ, దర్శకుడు: విక్రమ్ రెడ్డి
నిర్మాతలు: బెక్కం వేణు గోపాల్, సృజన్ కుమార్
సంగీతం: సన్నీ ఎం ఆర్, ఆర్ ఆర్ ధృవన్
సినిమాటోగ్రఫీ: సంతోష్ రెడ్డి
రిలీజ్ డేట్: 28/11/2024

హైదరాబాద్ సిటీలో ఓ నలుగురు ఫ్రెండ్స్ హర్ష(హర్ష నర్రా), రాహుల్(సందీప్ సరోజ్), విక్కీ(సుప్రజ్ రంగ) అలాగే సూర్య(తరుణ్ పొనుగంటి) తమ చిన్న నాటి నుంచే ఓకే హాస్టల్ ద్వారా ప్రాణ స్నేహితులుగా మారి ఎంతో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తారు. వీరిలో విక్కీ మినహా మిగతా అంతా ఒక్కొక్కరు ఒక్కో ప్రొఫిషన్ లో పని చేసుకుంటారు. ఇంతలో ఓ రోజు సూర్య, హర్ష, రాహుల్ లకి అనానిమస్ గా ఓ ఫ్లైట్ టికెట్ వస్తుంది.. దానిని విక్కీ పంపాడు అని తెలుసుకొని అంతా కలిసి గోవా బయల్దేరుతారు.

అక్కడి నుంచి ఒకోకరి లైఫ్‌లో గతం ఒక్కో అమ్మాయితో ప్రేమ కథ స్టార్ట్ అవుతుంది. వీరి నలుగురి జీవితాల్లోకి వచ్చిన నలుగురు అమ్మాయిలు దివ్య(నువేక్ష) సూర్యకి, శ్వేతా(మేఘ లేఖ) విక్కీకి అలాగే ప్రియా(సోనియా ఠాకూర్) రాహుల్ కి ఫైనల్ గా సోనియా (ఖుష్బూ చౌదరి) హర్షకి యాడ్ అవుతారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న వీరి లైఫ్ లోకి వాళ్ళు వచ్చాక ఏం జరిగింది? ఎమోషనల్ గా వాళ్ళు ఎలా డిస్టబ్ అయ్యారు? వీళ్లతో వాళ్ళు కలిసి లైఫ్ ని కొనసాగించారా లేదా? వాళ్ళు వేసుకున్న గోవా ట్రిప్ ఏమవుతుంది? చివరికి విక్కీ ఏం రియలైజ్ అయ్యాడు అనేదే ఈ సినిమా కథ.

roti kapada romance review in telugu youth can connect

ఈ చిత్రంలో దర్శకుడు రొటీన్ అయినప్పటికీ మంచి పాయింట్ ని పట్టుకున్నారని చెప్పొచ్చు. ప్రేమ, స్నేహం అనేవి రెండు మంచి ఎమోషన్స్. వాటిలో ఖచ్చితంగా ప్రతీ ఒకరి లైఫ్ లో ఒక ఎమోషన్ మూలాన ఇంకో ఎమోషన్ కి ఎలా దెబ్బ తగులుతుంది అనే అంశాన్ని ప్రతీ ఒక్కరు ఎక్స్ పీరియన్స్ చేసి ఉంటారు. సరిగ్గా దీనినే దర్శకుడు పట్టుకున్నాడు. కాగా అందుకు తగ్గట్టుగానే సినిమాలో రెండు ఎమోషన్స్ ని దాదాపు బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నం చేయడం హర్షనీయం.

ముఖ్యంగా ఈ చిత్రంలోని కామెడీ సీన్స్ జనాల్లోకి బాగా వెళతాయి. నలుగురు ఫ్రెండ్స్ అంటే ఉండే సరదా ఏ లెవెల్లో ఉంటుందో తెలిసిందే కదా. అదే రీతిలో మంచి పంచ్ లు, కామెడీ టైమింగ్స్ తో ఫుల్ ఎంజాయ్ చేసేలా సీన్స్ ఉంటాయి. ఇక సినిమాలో కొన్ని పాత్రలు అయితే మిడిల్ క్లాస్ కుర్రాళ్ళకి అలా అటాచ్ అయిపోవచ్చని చెప్పాలి. ముఖ్యంగా విక్కీ రోల్ తనతో ట్రావెల్ అయ్యే శ్వేతా అయితే సినిమాలో బాగా గుర్తుంటారు. వీళ్ళ ట్రాక్ లో ఒక సీన్ అయితే యువతతో విజిల్ కొట్టే లెవెల్లో కనిపిస్తుంది.

వీళ్ళతో పాటుగా సూర్య, దివ్య ట్రాక్ కూడా చాలా నాచురల్ గా సినిమాలో కనిపిస్తుంది. అప్పుడే లవ్, దాని నుంచి అమ్మాయిలు ఎలా సింపుల్ గా బ్రేకప్ చెప్పేసి పట్టించుకోకుండా ఉండిపోతారు అనేవి దర్శకుడు ఇలాంటి విషయాల్లో సునిశితంగా ఏ తరహాలో ఆలోచించాడో అర్ధం అవుతుంది. వీరి ట్రాక్ కూడా బాగుంది. ఇంకా హర్ష అండ్ సోనియా ట్రాక్ అయితే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. సినిమా ఎలాగో ఏ సర్టిఫికెట్ కాబట్టి వీరి ట్రాక్ లో లిప్ లాక్ సీన్స్ అవీ ఓకే అని చెప్పొచ్చు.

roti kapada romance review in telugu youth can connect

మరో ట్రాక్ రాహుల్, ప్రియా లది మాత్రం కొంచెం క్లంజీగా అనిపిస్తుంది. రెండు పాత్రల్లో కూడా ఒక క్లారిటీ ఉండదు . చాలా సిల్లీ అండ్ బోరింగ్ గా అనిపిస్తుంది. ఇవే కాకుండా సినిమాలో చాలా చోట్ల సన్నివేశాలు ఏమంత ఇంట్రెస్ట్ గా సాగవు. ఇంకా క్లైమాక్స్ కూడా మరీ అంత ఎఫెక్టీవ్ అండ్ ఎమోషనల్ గా అనిపించదు అని చెప్పొచ్చు. వీటిని దర్శకుడు అందరి ట్రాక్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ చేసి ఉంటే బాగుండేది.

అలానే విక్కీ, శ్వేతా ట్రాక్ సినిమాలో మంచి ఎమోషనల్ అండ్ హిట్టింగ్ గా ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో తన రోల్ సింపుల్ గా రియలైజ్ అయ్యిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇంకా రాహుల్, ప్రియా ఎండింగ్ అయితే చాలా రొటీన్ గా అనిపిస్తుంది. సినిమా చూస్తున్నపుడే సగటు ప్రేక్షకుడు సినిమాలో నెక్స్ట్ సీన్ ఏంటో పసిగట్టేసేలా స్క్రీన్ ప్లే ఉంటుంది. సినిమాలో కొంచెం హైలైట్ ఏమన్నా ఉంది అంటే ఫ్రెండ్షిప్ కోణం అని చెప్పుకోవచ్చు. దీనిని దర్శకుడు బాగా తెరకెక్కించారు. ఇది మినహా మిగతా సినిమా చాలా ఫ్లాట్ గా సాగుతుంది.

నటీనటుల్లో అయితే ఒక్క సందీప్ సరోజ్ మినహా మిగతా వాళ్ళు అంతా కొత్త వారిలానే చాలా మందికి అనిపించవచ్చు. కానీ ఇంట్రెస్టింగ్ గా మెయిన్ కాస్ట్ అంతా అదరగొట్టేశారని చెప్పొచ్చు. కేవలం తమ లుక్స్ లోనే కాకుండా ఎమోషనల్ సీన్స్‌లోనూ ఈ యువ నటీనటులు చేసేయడం విశేషం. అమ్మాయిల్లో అయితే నువేక్ష తన రోల్ కి అలా సెట్ అయ్యిపోయింది. ఒక పాష్ అమ్మాయిలా లుక్స్‌తో పాటు బోల్డ్ షోతో బాగా చేసింది.

ఇంకొన్ని పాత్రలు అయితే సినిమాలో మనకి చూసేకొద్దీ వాటిలో మనల్ని లీనం అయ్యేలా చేస్తాయి. అలాంటి రోల్ మేఘ లేఖ చేసింది. డెఫినెట్ గా ఈమె రోల్ ని అయితే అసహ్యించుకోకుండా ఉండలేరు అంటే అంత నాచురల్ గా ఆ రోల్ డిజైన్ కానీ అందులో ఆమె ఇమిడిపోవడం కానీ జరిగింది . ఇంకా హిందీ అమ్మాయిలా ఖుష్బూ చౌదరి క్యూట్ మాటలతో బాగా చేసింది, తన ఫ్రెండ్ రోల్ చేసిన అమ్మాయి కూడా బాగుంది. కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటాయి. ఇక మేల్ లీడ్స్ లో కమిటీ కుర్రోళ్ళు ఫేమ్ సందీప్ సరోజ్ బాగా చేసాడు . ఆర్ జె గా తరుణ్ లుక్స్ తన ఎమోషనల్ పెర్ఫామెన్స్ లు బాగున్నాయి. ఇంకా సుప్రజ్ ఇంప్రెస్ చేస్తాడు. అలాగే హర్ష కూడా పర్వాలేదు.

roti kapada romance review in telugu youth can connect

సాంకేతిక విభాగం పని తీరుకి వస్తే.. ఇది చిన్న సినిమా అన్నట్టుగా ఎక్కడా అనిపించదు. చాలా గ్రాండియర్ గా మంచి రిచ్ వాల్యూస్ తో నిర్మాతలు పెట్టిన డబ్బులు కనిపిస్తాయి. యూఎస్, కొన్ని కాస్ట్లీ కార్లు ఇలా పలు విజువల్స్ బట్టి చెప్పొచ్చు ప్రొడ్యూసర్స్ వెనుకాడలేదు అని. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి కానీ ఒక సాంగ్ మాత్రం కథనంలో బోర్ కొట్టిస్తుంది. సినిమాటోగ్రఫీ ఫైన్, ఎడిటింగ్ జస్ట్ ఓకే, డైలాగ్స్ బావున్నాయి.

ఫైనల్ గా ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ సినిమా కోసం చెప్పొచ్చేది ఏమిటంటే. సినిమాలో లీడ్ యాక్టర్స్ అంతా బాగా చేశారు అనేకంటే నిజానికి తమ పాత్రల్లో జీవించారు అని చెప్పొచ్చు. కొన్ని పాత్రలు అయితే బాగా టచ్ అవుతాయి. వాటిని మనం ప్రేమిస్తాం, ద్వేషిస్తాం కూడా. ఇంకా కామెడీ సీన్స్ అండ్ కొన్ని లవ్ ట్రాక్స్ కూడా ఓకే. కానీ ఈ రోటి కపడా రొమాన్స్ లో ఉన్న సమస్య ఏంటంటే ఒక ఫ్లాట్ నరేషన్ కనిపిస్తుంది. ఇది కానీ కొంచెం బెటర్ గా ఉండుంటే ఫలితం ఇంకోలా ఉండేది. అయినప్పటికీ ఓ బ్యాచ్ ఫ్రెండ్స్, లవ్ ఫెయిల్యూర్స్ లాంటి వారికి సినిమా కనెక్ట్ అవ్వొచ్చు. సో ఒకసారికి ట్రై అయితే చేయొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X