రొటీన్ కమర్షియల్ డ్రామా (రఫ్ మూవీ రివ్యూ)

By Bojja Kumar

Rating:
1.5/5
హైదరాబాద్ : ఈ మధ్య కాలంలో హీరో ఆది చాలా వెనక బడిపోయాడు. ఈ సారి ఎలాగైనా ఫాంలోకి రావాలని ‘రఫ్'తో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆది రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ద్వారా సుబ్బారెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మొదటిసారి మణిశర్మ ఆది సినిమాకి సంగీతం అందించాడు. సినిమా విశేషాలేమిటో చూద్దాం.

కథలోకి వెళితే...చందు (ఆది)కు ప్రేమంటే చాలా నమ్మకం. కడుపు చేసి మోసం చెయ్యడం కాదు పెళ్లి చేసుకొని కలకాలం జీవించడం అని నమ్మే వ్యక్తి. అలాంటి చందు నందిని(రకుల్ ప్రీత్ సింగ్) ప్రేమలో పడతాను. ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. చందు అనాద. పెళ్లి ఎలాగైనా నందిని ఇంట్లో వాళ్లని ఒప్పించి చేసుకోవాలనుకుంటాడు. అందుకే తన ప్రేమ గురించి ముందు నందిని కంటే, తన అన్నయ్య అయిన సిద్దార్థ్(శ్రీ హరి)కి ముందు చెప్పి ఒప్పించాలనుకుంటాడు. ఈ క్రమంలో చందు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనేది తెరపై చూడాల్సిందే.

పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే... హీరో ఆది పెర్ఫార్మెన్స్ ఫర్వాలేదు. అయితే సిక్స్ ప్యాక్ చేసి బాగానే కష్టపడ్డాడు. డాన్స్, ఫైట్స్ బాగున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ నటన అంతంత మాత్రమే అయినా అందాల ఆరబోతతో ఆకట్టుకుంది. శ్రీహరి బ్రతికున్నపుడు చేసిన సినిమా ఇది. తన పాత్రకు న్యాయం చేసాడు. ఇతర నటీనటులు తమ పాత్రల మేరకు రాణించారు.

Rough Movie Review

దర్శకుడి పని తీరు విషయానికొస్తే...ఆదిని ఈ సినిమాలో ఫుల్ మాస్ లుక్ లో చూపించే ప్రయత్నం చేసాడు. అయితే దర్శకుడి ప్రయత్నం ఫలించలేదు. కథ రొటీన్‌గా ఉంది. కమర్షియల్ అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాడే తప్ప ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాను తెరకెక్కించడంలో పూర్తి స్థాయిలో సఫలం కాలేదు.

టెక్నికల్ అంశాలు పరిశీలిస్తే సెంథిల్ కుమార్, అరుణ కుమార్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. మణిశర్మ అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. డైలాగులు కొన్ని ఆది ఇమేజ్‌కి తగిన విధంగా లేవు. ఎడిటింగ్ కూడా అంతంత మాత్రమే. నిర్మాణ విలువలు ఫర్వాలేదు.

చివరగా చెప్పేదేమంటే.....‘రఫ్' సినిమాలో రొటీన్ కమర్షియల్ అంశాలే తప్పలే ప్రేక్షకులను ఆకట్టుకునే కొత్త విషయం ఏమీ లేదు.

బ్యానర్ :శ్రీదేవి ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నటీనటులు:ఆది, రకుల్‌ప్రీత్ సింగ్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, రవిప్రకాశ్, రాజా రవీంద్ర, నాగినీడు, పవిత్రా లోకేష్, సామ్రాట్ శివారెడ్డి, అదర్స్ రఘు, పృధ్వి, ధన్‌రాజ్, కాట్రాజు తదితరులు
సంగీతం:మణిశర్మ
మాటలు:మరుధూరి రాజా
కెమెరా:కె.కె.సెంథిల్‌కుమార్
ఫైట్స్:గణేశ్
ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్
పాటలు: భాస్కరభట్ల
నిర్మాత:మాధవరం అభిలాష్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సిహెచ్.సుబ్బారెడ్డి
విడుదల తేదీ: 28 నవంబర్, 2014

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X