twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్చ్.. రొటీనే ('రొటీన్‌ లవ్‌స్టోరీ' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5
    నిజానికి తెలుగులో రొమాంటిక్ కామెడీ జెనర్ లో వచ్చే చిత్రాలు సంఖ్య బాగా తక్కువ. కొత్తగా వస్తున్న యువ దర్శకులు ఎవరైనా ట్రై చేసినా అవి మిక్సెడ్ గా అంటే మిగతా మశాలాలు అన్ని కలుపుకుని దిగుతూంటాయి. అన్ని వర్గాల వారని ఆకర్షించాలనే ప్రయత్నంలో ఏ వర్గానికీ చేరక అవి చతికిలపడుతూంటాయి. అయితే అప్పుడప్పూడూ ప్రత్యేకంగా యూత్ నే టార్గెట్ చేస్తూ వస్తున్న చిత్రాలు తమకంటూ ప్రేక్షకులను తయారుచేసుకుని కొంతమేరకు సక్సెస్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో మేం అందరిలా రొటీన్ కాదంటూ చెప్తూ వచ్చిన 'రొటీన్ లవ్‌స్టోరి'లో పెద్ద వైవిద్యమేమీలేదు. అలాగే స్లోగా నడుస్తూ కొంతమేర విసుగు కూడా రప్పించింది.

    సంస్థ: వర్కింగ్‌ డ్రీమ్‌
    నటీనటులు: సందీప్‌ కిషన్‌, రెజీనా, వెన్నెల కిషోర్‌, చంద్రమోహన్‌, హేమ, కృష్ణుడు, జయప్రకాష్‌రెడ్డి, ఝాన్సీ, తాగుబోతు రమేష్‌ తదితరులు.
    సంగీతం: మిక్కీ జె.మేయర్‌
    పాటలు: కృష్ణచిన్ని మాదినేని,
    సినిమాటోగ్రఫీ: సురేశ్/చోటా కె. నాయుడు,
    కూర్పు: ధర్మేంద్ర,
    ఆర్ట్: ఉపేంద్ర,
    కాస్ట్యూం డిజైనర్: శాంతి,
    నిర్మాత: చాణిక్య భూనేటి,
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.
    విడుదల: శుక్రవారం.

    సంజూ (సందీప్‌ కిషన్‌) చాలా సరదాగా జీవితం ఎంజాయ్ చేస్తున్న ఫస్ట్ ఇయిర్ ఇంజినీరింగ్ స్టూడెంట్. అతను ఆ వయస్సులో అందరిలాగే తన క్లాస్ మేట్ తన్వి (రెజీనా) ప్రేమలో పడతాడు. మొదటి వీరిద్దరూ మంచి స్నేహితుల్లా కొంత కాలం సరదాగా గడుపుతారు. అ తర్వాత ఓ రోజు సంజూ ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు ఆమె తనకు కొంత సమయం కావాలని,ఇద్దరం మరింతగా అర్దం చేసుకోవటానికి ఆ సమయం ఉపయోగిస్తుందని అంటుంది. ఇద్దరిలోనూ పాజిటివ్,నెగిటివ్ లు ఉంటాయి. దాంతో ఆరిలేషన్ షిప్ లో వీరిద్దరూ దగ్గరయ్యారా..లేక వేరు వేరు భావాలతో విడిపోయారా అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    రొమాంటిక్ కామెడీ కథలో కొత్తగా చెప్పేదేమీ ఉండదు. ఇద్దరు ఎలా తమ సమస్యలను అధిగమించి దగ్గరయ్యారు అనే విషయం చుట్టూనే కథ తిరిగుతుంది. అయితే కొత్త జనరేషన్, కొత్త ఆలోచనలు, కొత్త దర్శకులు అంటూ వస్తున్న చిత్రాల వరసలో ఎంతో కొంత వైవిద్యం ప్రదర్శించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. చాలా సార్లు ఇద్దరూ ప్రేమించుకొంటారు. చూసేవాళ్లకు మాత్రం ఇద్దరూ బద్ద శత్రువులేమో అనిపిస్తుంది. కొట్టుకొంటారు.. మళ్లీ కలిసిపోతారు ఆ సీన్స్ బాగానే వర్కవుట్ చేసాడు. అయితే చాలా సీన్స్ కన్వీసింగ్ గా లేవు. ప్రధానపాత్రల మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ లో ఎమోషన్ వర్కవుట్ కాలేదు. ఇక కామెడీ విషయంలో ఈ చిత్రం చాలా పూర్. త్రాగుబోతు రమేష్, ఎమ్ ఎస్ నారాయణ ఫారెస్ట్ ఎపిసోడ్ అయితే అసలు పేలలేదు. ఆ సీన్స్ తొలిగిస్తే బావుండును అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా వీక్ గా ఉంది. సినిమా ప్రాణంగా ఉండాల్సిన క్లైమాక్స్ సీన్స్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. నటీనటుల్లో సందీప్‌ కిషన్ బాగా చేసాడు. రెజీగా కూడా తన పాత్రకు న్యాయం చేసింది. కెమెరా వర్క్ బాగుంది. పాటలు ఓకే అనిపిస్తాయి. ఎడిటింగ్ బాగుంది.

    యూత్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రం వారిని కూడా పెద్దగా ఆకట్టుకునేటట్లు కనపడటం లేదు. స్క్రిప్టుపై మరింత కసరత్తు చేసి,కాస్త కథనంలో స్పీడు పెంచితే బాగుండేది. మల్టిప్లెక్స్ లు, ఎ సెంటర్లల ప్రేక్షకుల నుంచి మౌత్ టాక్ పుడితేనే ఈ సినిమా నిలబడుతుంది. ముఖ్యంగా పేలని కామెడీ సన్నివేశాలు తొలిగించటం మేలు.

    English summary
    Routine Love Story, which has been directed by Praveen Sattaru, is a romantic comedy movie and Sundeep Kishan's energetic performance is the main highlight of the film. Routine Love Story is a simple love story about how a guy tries to understand the character of an immature girl whom he is fallen in love with. There are a few interesting songs, comedy and action sequences, which keep you engaged in the first half of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X