For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR first Review: ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో.. రాంచరణ్ టెర్రిఫిక్.. బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్!

  |

  ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారే కాకుండా ఇతర భాషల సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న చిత్రం RRR. బాహుబలి ద్వారా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడం, ఆ చిత్రం ద్వారా ఎస్ఎస్ రాజమౌళిపై ఊహించని ప్రేక్షకదారణ ఏర్పడటంతో ప్రస్తుతం RRR చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో దుబాయ్‌కి చెందిన సినీ క్రిటిక్ ఉమేర్ సంధూ తన తొలి రివ్యూను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. RRR ఫస్ట్ రివ్యూ విషయానికి వస్తే..

  దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్స్

  దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్స్

  దేశ సినీ పరిశ్రమలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా RRR చిత్రం గురించి మాట్లాడని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. కర్ణాటక, ఢిల్లీ, అమృత్ సర్ ఇప్పటికే నిర్వహించిన ప్రమోషనల్ కార్యక్రమాలకు జనం భారీగా పోటెత్తారు. సోమవారం అంటే.. మార్చి 21వ తేదీన వారణాసిలో ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో సినీ క్రిటిక్ ఉమేర్ సంధూ ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు.

  దుబాయ్‌లో సెన్సార్ స్క్రీనింగ్ పూర్తి

  దుబాయ్‌లో సెన్సార్ స్క్రీనింగ్ పూర్తి


  దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్, భీమ్ పాత్రల్లో ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన RRR చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ సెన్సార్ స్క్రీనింగ్ దుబాయ్‌లో పూర్తి అయింది. 2022 సంవత్సరంలో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాన్ని చూసిన తర్వాత నాకు కలిగిన ఎక్సైట్‌మెంట్ మాటల్లో చెప్పలేను అంటూ ఉమేర్ సంధూ తన ట్వీట్‌లో తెలిపాడు.

  అరుదైన మల్టీస్టారర్ మూవీగా RRR

  అరుదైన మల్టీస్టారర్ మూవీగా RRR


  ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమాలు రావడం ఇటీవల కాలంలో అరుదుగా మారాయి. అలాంటి అరుదైన కలయికను ఎన్టీఆర్, తారక్ రూపంలో తెరమీద ఆవిష్కరించారు. RRR సినిమా ప్రస్తుత సంవత్సరంలో అతిపెద్ద చిత్రంగా కీర్తించబడుతున్నది. RRR చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడం ఖాయం. ఈ చిత్రంలోని నటీనటులు ఫెర్ఫార్మెన్స్ మైలురాళ్లుగా నిలిచిపోతాయి అని ఉమేర్ సంధూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

  ఎన్టీఆర్ రోల్ అలా.. రాంచరణ్ పాత్ర ఇలా..

  ఎన్టీఆర్ రోల్ అలా.. రాంచరణ్ పాత్ర ఇలా..

  RRR చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఆత్మలాంటింది. ఈ సినిమాలో ఆయన వన్ మ్యాన్ ఆర్మీ రోల్. తన పాత్రతో మరోసారి ప్రేక్షకలకు మరింత చేరువ అవుతారు. ఇక రాంచరణ్ రోల్ మరింత అద్భుతంగా ఉంటుంది. తన నటనతో చెర్రీ టెర్రిఫిక్‌గా కనిపిస్తారు. ఈ ఇద్దరితోపాటు రాజమౌళితొ డెడ్లీ కాంబో అద్భుతంగా ఆవిష్క‌ృతం కాబోతున్నది. బాక్సాఫీస్‌లో కలెక్షన్ల మంటలు చెలరేగడం ఖాయం అని ఉమేర్ సంధూ అన్నాడు.

   దర్శకుడి గొప్ప కలకు ప్రతీ రూపం

  దర్శకుడి గొప్ప కలకు ప్రతీ రూపం


  RRR సినిమా చూసిన తర్వాత భారతీయ ప్రేక్షకులందరూ గర్వంగా ఫీలవుతారు. వెండితెరపై ఓ దర్శకుడు కలలకు RRR ప్రతి రూపం. ఈ సినిమాను ప్రేక్షకులు మిస్ చేసుకోవద్దు. ప్రస్తుతం బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్. కానీ భవిష్యత్‌లో ఓ క్లాసిక్ సినిమా అవుతుంది అని ఉమేర్ సంధూ తన ట్వీట్‌లో పేర్కన్నారు.

  ఇలాంటి సినిమాను చూసి ఉండరు..

  ఇలాంటి సినిమాను చూసి ఉండరు..


  RRR సినిమా జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కెరీర్‌లోనే బెస్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి ఫెర్ఫార్మెన్స్ చూసి ఉండరని గ్యారెంటీగా చెబుతున్నాను. వారిద్దరిని స్క్రీన్ మీద చూడటానికి రెండు కళ్లు చాలవు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ పాత్ర సర్‌ప్రైజ్‌గా ఉంటుంది అని ఉమేర్ సంధూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

  Recommended Video

  RRR Review: NTR, Ram Charan కెరీర్‌లో ది బెస్ట్ SS Rajamouli అంకితభావం | Filmibeat Telugu
  ఉమేర్ సంధూ రివ్యూలపై అనుమానం?

  ఉమేర్ సంధూ రివ్యూలపై అనుమానం?


  అయితే ఉమేర్ సంధూ ఇచ్చిన రివ్యూలపై నెటిజన్లలో డివైడ్ టాక్ ఉంది. గతంలో గొప్పగా ఉంటాయని చెప్పిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే గత చిత్రాలతో పోల్చుకొంటే RRR సినిమా డిఫరెంట్. ఈ సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డులు నమోదు కావడం ఖాయం. అయితే RRR చిత్రం ఎలాంటి మార్క్‌ను ప్రపంచ బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

  English summary
  RRR movie first review by Critic Umair Sandhu: JrNTR is the Soul of RRR. He Stole the Show all the way. RamCharan is in Terrific Form. What a Deadly Combo in RRR by SSRajamouli. Aag Laga di Dono na.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X