Rudram Kota Review ఊహించని పాత్రలో జయలలిత.. రుద్రం కోట మూవీ రివ్యూ!

నటీనటులు: జయలలిత, అనిల్ ఆర్కా కండవల్లి, విభీష, అలేఖ్య తదితరులు
దర్శకత్వం: రాము కోన
నిర్మాత: అనిల్ ఆర్కా కండవల్లి
మ్యూజిక్: సుభాష్ ఆనంద్, నిరంజన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: కోటి
సినిమాటోగ్రఫి: ఆదిమల్ల సంజీవ్
ఎడిటర్: ఆవుల వెంకటేష్
రిలీజ్ డేట్: 2023-09-22

రుద్రంకోట గ్రామానికి కోటమ్మ (జయలలిత) పెద్ద దిక్కు. ఆ గ్రామ ప్రజలకు కోటమ్మ చెప్పిందే వేదం.. చేసిందే శాసనం. తప్పు చేస్తే మహిళలను కూడా శిక్షించడానికి వెనుకాడదు. అదే గ్రామానికి చెందిన రుద్ర (అనిల్ ఆర్కా) ను సొంత కొడుకు కంటే ఎక్కువగా ప్రేమగా కోటమ్మ చూసుకొంటుంది. ఊరికి కాపాలదారుడిగా వ్యవహరిస్తూ.. శ్మశానంలో జీవిస్తుంటాడు. అలాంటి రుద్రపై శక్తి (విభీష) అనే యువతి మనసు పారేసుకొంటుంది. మహిళలంటే అసహ్యించుకొనే రుద్రను చూసిన కోటమ్మ మనవరాలు ధృతి (ఆలేఖ్య) అతడిని కామిస్తుంది.

Rudram Kota Movie Review and Rating

రుద్రంకోట గ్రామానికి కోటమ్మ పెద్ద దిక్కుగా ఎలా మారింది? అక్రమ సంబంధాలంటే కోటమ్మకు ఎందుకు సహించదు? ఫ్యామిలీ, ప్రేమ, మనుషులకు దూరంగా ఉంటూ శ్మశానంలోనే రుద్ర ఎందుకు బతుకుతుంటాడు? స్త్రీ జాతి అంటే సహించని రుద్రను ప్రేమించిన శక్తికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. రుద్ర ఆకారాన్ని చూసి కామించిన ధృతి తన కోరికను తీర్చుకొందా? రుద్ర మనసును శక్తి, ధృతిలో ఎవరు గెలుచుకొన్నారు? కోటమ్మ, రుద్ర జీవితాల్లో జరిగిన సంఘటనలు ఏమిటి? మనవరాలు ధృతి చేసిన తప్పుకు ఎలాంటి శిక్ష లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే రుద్రం కోట సినిమా కథ.

రుద్రంకోట పక్కాగా గ్రామీణ నేపథ్యం, వాతావారణం, మూలాల ఆధారంగా రూపొందిన కథ. పాయింట్‌గా చూస్తే ఎమోషన్ కంటెంట్ అనిపిస్తుంది. కానీ పూర్తిస్థాయి కథగా విస్తరించడం, బలమైన సన్నివేశాల ద్వారా స్టోరిని కనెక్ట్ చేయడంలో దర్శకుడు రాము కొన తడబాటు పడినట్టు కనిపిస్తుంది. టెలివిజన్ రంగంలో 5, 6 వేల ఎపిసోడ్స్‌కు దర్శకత్వం వహించిన రాము ఆ ప్రభావం నుంచి బయటకు రాలేదా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ కొంత సాగదీసినట్టు కథ చెప్పారనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో ఉండే ఇంటెన్స్ స్టోరి కోసం క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడానికి కథను నెమ్మదిగా చెప్పి ఉంటారేమో అనే ఫీలింగ్ కలిగింది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌ను రాము కోన డీల్ చేసిన విధానం బాగుంది.

Actress Jayalalitha seen in Promising Role

తెలుగు సినిమా పరిశ్రమలో జయలలితకు ఉన్న ఇమేజ్ డిఫరెంట్. అయితే రుద్రం కోట సినిమాలో చేసిన పాత్రను చూసిన తర్వాత ఆమెలో మంచి నటిని మిస్ చేసుకొన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. వ్యాంప్ పాత్రలతో నెట్టుకొచ్చిన జయలలిత భారమైన పాత్రలను ఎమోషనల్‌గా మెప్పించగలరి కోటమ్మ పాత్ర ద్వారా తెలియజెప్పారు. కొన్ని సన్నివేశాల్లో హుందాగా, గౌరవప్రదంగా, పరిణతితో కూడా ఫెర్ఫార్మెన్స్‌తో జయలలిత మెప్పించారు. రుద్రగా అనిల్, శక్తిగా విభీష, ధృతిగా అలేఖ్య తమ పాత్రల పరిధి మేరకు రాణించారు. రుద్ర పాత్రపై కాంతారాలో రిషబ్ శెట్టి ప్రభావం పడిందా అనిపిస్తుంది.

రుద్రంకోట సినిమా సాంకేతిక విషయాలకు వస్తే.. ఆదిమల్ల సంజీవ్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. పల్లె అందాలను చక్కగా కెమెరాలో బంధించారు. కోటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటర్ ఆవుల వెంకటేష్ తన నైపుణ్యం, అనుభవంతో సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చారు. హీరోగానే కాకుండా అనిల్ నిర్మాతగా కూడా ఈ సినిమా ద్వారా తన తపన, అనుభూతిని చూపించుకొనే ప్రయత్నం చేశారు. అనిల్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

Rudram Kota Movie Review and Rating

తెలుగు నేటివిటి, మూలాలు ఉన్న ఓ ఎమోషనల్ కథ. తమ జీవితాల్లో జరిగిన చేదు అనుభవాల కారణంగా కొందరు వ్యక్తుల పడే మానసిక సంఘర్షణను కథగా మలిచి తెరకెక్కించిన చిత్రంగా కనిపిస్తుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్య అంశాలు చాలా ఉన్నాయి. బీ, సీ సెంటర్లలో ఈ సినిమా ఆదరణకు గురైతే మంచి సక్సెస్ అందుకొనే ఛాన్స్ కూడా ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X