Her Telugu Movie Review మర్డర్ మిస్టరీతో సాగే సస్సెన్స్ థ్రిల్లర్.. రుహానీ శర్మ మెప్పించిందా?
నటీనటులు: రుహానీ శర్మ, వికాస్ వశిష్ట, సంజయ్ స్వరూప్, ప్రదీప్ రుద్ర, వినోద్ వర్మ, జీవన్, రవి వర్మ తదితరులు
దర్శకత్వం: శ్రీధర్ స్వరాఘవ్
నిర్మాతలు: రఘు సంకురాత్రి, దీప సంకురాత్రి
మ్యూజిక్: పవన్
సినిమాటోగ్రఫి: విష్ణు బేసి
ఎడిటర్: చాణక్య రెడ్డి తూర్పు
రిలీజ్ డేట్: 2023-07-21
పోలీస్ శాఖలో అర్చన ప్రసాద్ (రుహానీ శర్మ) సిన్సియర్ ఆఫీసర్. ఓ కారణంగా ఆమె సస్సెన్షన్‌కు గురవుతుంది. ఆ సమయంలోనే విశాల్ పసుపులేటి, స్వాతి అనే వ్యక్తుల సీరియల్ మర్డర్స్ జరుగుతాయి. సస్సెన్షన్ ఎత్తివేసిన తర్వాత అర్చన విధుల్లో చేరిన వెంటనే సీరియల్ హత్య కేసు ఆమెకు అప్పగిస్తారు. ఓ కేసులో కరడుగట్టిన నేరస్థుడి (కేశవ్)ని పట్టుకొనే క్రమంలో అర్చనకు తన లైఫ్‌లో చేదు అనుభవం ఎదురవుతుంది. అలాంటి నేరస్థుడికి జంట హత్యల కేసుకు సంబంధముందనే విషయం స్పష్టమవుతుంది.

సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అర్చన ప్రసాద్ ఎందుకు సస్పెన్షన్‌కు గురైంది? క్రిమినల్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆమెకు ఎదురైన చేదు అనుభవం ఏమిటి? జంట హత్యల వెనుక ఎవరి హస్తం ఉంది? జంట హత్యల కేసుతో క్రిమినల్ (కేశవ్)కు సంబంధం ఉందా? విశాల్, స్వాతి సీరియల్ మర్డర్ కేసులో అర్చన దర్యాప్తు ఎలా సాగింది? క్రిమినల్ కేశవ్ క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ ఏమిటి? మర్డర్స్ కేసు దర్యాప్తును ఎలా ముగించింది అనే ప్రశ్నలకు సమాధానమే HER సినిమా కథ.
HER మూవీ సినిమా ఎమోషనల్, సీరియస్ ఎలిమెంట్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా మొదలవుతుంది. కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా డిటైలిటీ ఎక్కువైందనే ఫీలింగ్ కలుగుతుంది. గతంలో పోషించిన పాత్రలను బట్టి చూస్తే.. రుహానీ శర్మ క్యారెక్టర్‌ను దర్శకుడు శ్రీధర్ స్వరాఘవ్ రాసిన విధానం, ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు బాగుంది. ఇన్వెస్టిగేషన్ సీన్ల రాసుకొన్న తీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. కొన్ని సీన్లను సాగదీసినట్టు అనిపించినా.. విసుగు మాత్రం పుట్టించకుండా స్క్రిప్టు పరంగా చాలా జాగ్రత్తలు తీసుకొన్నాడని చెప్పవచ్చు.
Her మూవీలో ఫొరెన్సిక్ ఆఫీసర్ పాత్రలో రుహానీ శర్మ చక్కగా ఒదిగిపోయారు. ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటించి తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేశారనిపిస్తుంది. చాలా సన్నివేశాల్లో సహజసిద్దంగా తన పాత్రను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. కంటెంట్ ప్రధానంగా సాగే క్యారెక్టర్ లభిస్తే.. తానే ఏ రేంజ్ ఫెర్ఫార్మెన్స్ ఇస్తానో చెప్పకనే చెప్పారు. వినోద్ వర్మ, రవి వర్మ, జీవన్, చిత్రం శ్రీను, సంజయ్ స్వరూప్, ప్రదీప్ రుద్ర తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. పవన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు కథ, కథనాలను ఎలివేట్ చేసింది. విష్ణు బేసి సినిమాటోగ్రఫి బాగుంది. ఈ సినిమా కోసం ఎంచుకొన్న లొకేషన్లు సినిమాను మరింత రిచ్‌గా, ఆహ్లాదకరంగా మార్చాయి. ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ బ్రహ్మండంగా ఉన్నాయి.
జంట హత్యల కేసును గురించి ఫొరెన్సిక్ ఆఫీసర్ చేసిన ఇన్వెస్టిగేటివ్ మూవీ HER. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన కథగా ఈ సినిమా రూపొందింది. కానీ కథను రొటీన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా చెప్పే ప్రయత్నం కొంత ప్రేక్షకులకు నిరాశను కలిగించేలా ఉంటుంది. ఆ లోపాన్ని సెకండాఫ్‌లో కవర్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ సినిమాపై ప్రేక్షకులు స్పందించే తీరు, బీ, సీ సెంటర్లలో వచ్చే స్పందన బట్టే Her మూవీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది.


Click it and Unblock the Notifications











