Rules Ranjann Review కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కెమిస్ట్రీ వర్కవుట్ అయిందా? రూల్స్ రంజన్ సమీక్ష

Rating: 2.75/5

నటీనటులు: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, అన్నూ కపూర్, వెన్నెల కిషోర్, మక్రంద్ దేశ్ పాండే, అజయ్, సుబ్బరాజు, గోపరాజు రమణ, హైపర్ ఆది, సుదర్శన్, వైవా హర్ష, మెహర్ చాహల్ తదితరులు
రచన, దర్శకత్వం: రత్నం కృష్ణ
నిర్మాతలు: దివ్యాంగ్ లావణ్య, వేమూరి మురళీకృష్ణ, రింకు కుక్రేజా
మ్యూజిక్: అమ్రీష్
సినిమాటోగ్రఫి: ఎంఎస్ దిలీప్ కుమార్
రిలీజ్ డేట్: 2023-10-06

రూల్స్ రంజన్ కథ..
తిరుపతికి చెందిన మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ముంబైలోని కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా చేరుతాడు. తాను పనిచేసే కంపెనీలో రూల్స్ పెట్టి బాస్‌ను బుట్టలో వేసుకొంటాడు. ఇదిలా ఉండగా, కాలేజీలో క్లాస్‌మేట్ సన (నేహా శెట్టి) మనసారా ప్రేమిస్తుంటాడు. కానీ తన మనసులో భావాలను చెప్పలేకపోతాడు. అయితే అనుకోకుండా ముంబైకి వచ్చిన సన కొన్ని సమస్యల్లో ఉంటే మనో రంజన్ సహాయ పడుతాడు. దాంతో సస మనసుకు మనో రంజన్‌ దగ్గరవుతాడు.

రూల్స్ రంజన్ మూవీలో ట్విస్టులు
ముంబైలో హిందీ రాని మనో రంజన్‌ ఎలాంటి సమస్యలను అధిగమించాడు? ముంబైలో హిందీ సినిమాలకు పనిచేసే కామేష్‌తో మనో రంజన్‌కు స్నేహం ఎలా ఏర్పడింది? ఉద్యోగం కోసం ముంబైకి వచ్చిన సన మళ్లీ తిరుపతికి ఎందుకు వెళ్లింది? సన కోసం తిరుపతికి మనో రంజన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సన, మనో రంజన్‌ ప్రేమకు హైపర్ ఆది, సుదర్శన్, వైవా హర్ష ఎందుకు అడ్డు తగాలాలని అనుకొన్నారు? సనకు రంజన్ తన మనసులోని ప్రేమను చెప్పాడా? సనకు మరో వ్యక్తి (సుబ్బరాజు)తో పెళ్లి కుదిరితే రంజన్ ఏం చేశాడు? చివరకు ఎలాంటి హైడ్రామా, అడ్డంకుల మధ్య సనను మనో రంజన్ పెళ్లి చేసుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే రూల్స్ రంజన్ సినిమా కథ.

 Rules Ranjann

ఫస్టాఫ్ ఎలా ఉందంటే?
ముంబైకి చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరిన మనో రంజన్‌ అమాయకత్వాన్ని అసరాగా చేసుకొన్ని అక్కడి వారు చీటింగ్ చేసే అంశంతో రూల్స్ రంజన్ కథ మొదలువుతుంది. అయితే హిందీ భాష రాకపోవడం తలెత్తిన సమస్యను తన టెక్నిక్‌తో ఆఫీస్‌లో తన పట్టు సాధించడం అనే విషయాలు రొటీన్, రెగ్యులర్‌గా కథను ముందుకు తీసుకెళ్తుంటాయి. ఇక కామేష్ ఎంట్రీతో కొంత హ్యుమర్ యాడ్ కావడంతో మరి కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక సన క్యారెక్టర్ ఎంట్రీతో కథలో కొంత జోష్ పుట్టినా.. అదే రొటీన్‌‌ వ్యవహారంతో ఫస్టాఫ్ ముగుస్తుంది.

ఆకట్టుకొనే సెకండాఫ్
రొటీన్‌గా రూల్స్ రంజన్ ఫస్టాఫ్ ముగిసిన తర్వాత సెకండాఫ్‌లోనైనా కథ, కథనాలు ఊపందుకొంటాయా అని వేచి చూసిన ప్రేక్షకుడు ప్రీ క్లైమాక్స్ ముందు వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఇంటర్వెల్ తర్వాత నుంచి చివర వరకు దర్శకుడు రత్నం కృష్ణ కథను హ్యాండిల్ చేసిన విధానంగా బాగుంది. సెకండాఫ్‌లో హైపర్ ఆది, సుదర్శన్, వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ వర్కవుట్ కావడంతో కథ వేగంగా సాగుతుంది. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్‌లో డ్రామాను గ్రిప్పింగ్‌గా, ఫన్ ఎలిమెంట్స్‌ను జోడించి ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చడంతో రూల్స్ రంజన్ ఫీల్‌గుడ్‌గా ముగుస్తుంది.

 Rules Ranjann review

కిరణ్, నేహా శెట్టి కెమిస్ట్రీ
మనో రంజన్, రూల్స్ రంజన్, పబ్ రంజన్ లాంటి మూడు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్‌లో కిరణ్ అబ్బవరం ఒదిగిపోయాడు. అమాయకుడిగా, కార్పోరేట్ పాలిటిక్స్ ఎదురించిన యువకుడిగా, కాలేజీ రోజుల్లో ప్రేమించిన అమ్మాయి మనసు గెలుచుకొనే ప్రేమికుడిగా తనదైన శైలిలో నటించడమే కాకుండా సినిమా భారాన్నంతా భుజాన మోశాడు. కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసిన పాత్రతో ఆకట్టుకొన్నాడు. నేహా శెట్టి మరింత గ్లామరస్‌గా కనిపించింది. కిరణ్, నేహా మధ్య కెమిస్ట్రీ డిఫరెంట్‌గా ఉందనిపిస్తుంది. సమ్మోహనుడా సాంగ్‌లో నేహా ఫుల్లుగా అందాలను పంచేసింది. హైపర్ ఆది, సుదర్శన్, వైవా హర్ష, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, అజయ్, గోపరాజు రమణ తదితరులు సినిమాకు సపోర్టింగ్‌గా నిలిచారు.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి
రూల్స్ రంజన్ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. అమ్మీష్ అందించిన పాటలు ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించేలా చేశాయి. ఆడియోపరంగానే కాకుండా విజువల్ పరంగా పాటలను సినిమాటోగ్రాఫర్ దిలీప్ కుమార్ ఫీల్‌గుడ్‌గా చిత్రీకరించాడు. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 Kiran Abbavaram, Neha Sshetty chemistry

రూల్స్ రంజన్ ఫైనల్‌గా ఎలా ఉందంటే..
రూల్స్ రంజన్ ఓవరాల్‌గా.. కామెడీ, లవ్ ట్రాక్‌తో సరదాగా సాగిపోయే సినిమా. ఫస్టాఫ్‌‌ చాలా రొటీన్‌గా, రెగ్యులర్‌గా అనిపించినప్పటికీ.. వెన్నెల కిషోర్ కామెడీతో ఫన్‌గా సాగిపోతుంది. జబర్దస్త్ తరహా కాకుండా మంచి కామెడీ ట్రాక్ బలంగా రాసుకొని ఉంటే డెఫినెట్‌గా భారీ సక్సెస్ అందుకొనే అవకాశం ఉండేది. సెకండాఫ్‌ రకరకాల ట్విస్టులు, డ్రామా ఆసక్తికరంగా సాగుతాయి. నేహా శెట్టి గ్లామర్, కిరణ్ అబ్బవరం ఫెర్ఫార్మెన్స్, వెన్నెల కిషోర్, ఆది పంచ్ కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ప్రేమ, పెళ్లి తరహా కథలతో వచ్చే కామెడీ టచ్ ఉన్న సినిమాలకు ఆదరించే వారికి రూల్స్ రంజన్ నచ్చే అవకాశం ఉంది.

ట్యాగ్ లైన్: మాస్ కామెడీతో సాగే ఎంటర్‌టైనర్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X