twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫర్వాలేని..రన్‌

    By Staff
    |

    Run
    -జలపతి
    చిత్రం: రన్‌
    నటీనటులు: మాధవన్‌, మీరా జాస్మిన్‌, సునీల్‌, రఘువరన్‌, అతుల్‌ కులకర్ణి
    సంగీతం: విద్యాసాగర్‌
    నిర్మాత: ఎ.ఎం.రత్నం
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ఎన్‌.లింగుస్వామి

    తమిళంలో గత ఏడాది సూపర్‌ హిట్‌ అయిన్‌ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో డబ్‌ చేసిన ఈ చిత్రం గురించి ఒక్క మాటల్లో చెప్పాలంటే ఫర్వలేదనే చిత్రం. ఈ సినిమా వచ్చేంతవరకు మాధవన్‌ కు 'మాస్‌ హీరో', 'యాక్షన్‌ హీరో' ఇమేజ్‌ లేదు. దాంతో ఆ తరహాలో రూపొందించడంతో అక్కడి ప్రజలకు బాగా నచ్చింది. అయితే, తెలుగులో ఆ పరిస్థితి వేరు. ఇందులో సగం సీన్లు..అవీ ఒక్కడు వంటి చిత్రంలో రావడంతో తెలుగువారికి పెద్దగా ఆకట్టుకోదు. అన్నింటికన్నా ముఖ్యం ఈ సినిమాలో సాగతీత అధికం. ఫస్ట్‌ హాఫ్‌ అంతా సాగతీతే. ఇంటర్వెల్‌ కు కొద్ది నిమిషాల ముందు 'అసలు సినిమా' ప్రారంభమవుతుంది.

    ఇక అక్కడ్నుంచి క్లైమాక్స్‌ వరకు సినిమా వేగంగా నడుస్తుంది. కథలో పట్టు, స్క్రీన్‌ ప్లే బిగువు అంతా సెకాండ్‌ హాఫ్‌ లోనే బాగుంది. మాధవన్‌ నటనలో పరిణితి చిత్రం చిత్రానికి పెరుగుతోంది. మాధవన్‌, అతుల్‌ కులకర్ణి, మీరా జాస్మిన్‌ అందం సినిమాకు అందమైతే, అర్థంపర్థం లేని, సినిమాకు సంబందంలేని సునీల్‌ కామెడీ, కథలో అతకని పాటలు పెద్ద అడ్డంకి. సునీల్‌ తో పూర్తిగా సినిమా ఆసాంతం ఒక కామెడీ ట్రాక్‌ పెట్టారు. కొన్ని సార్లు నవ్వు తెప్పించినా, చాలా సందర్భాల్లో అది తమిళ నటుడు వివేక్‌ ను దృష్టిలో పెట్టుకొని అల్లిన కామెడీ సీన్లు. తెలుగులో పెద్దగా ఆకట్టుకోవు. దర్శకుడు లింగుస్వామి టేకింగ్‌ చాలా బాగుంది. ఇక జీవా ఫోటోగ్రఫీ, కళాదర్శకుడు తోటతరణిల ప్రతిభ వల్ల సినిమా చాలా సహజంగా కనపడుతుంది.

    మాధవన్‌ ఊరి నుంచి హైదరాబాద్‌ వస్తాడు. బస్సులో ప్రయాణిస్తుండగా హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ ను చూసి మనసు పారేసుకుంటాడు. ఆ అమ్మాయి తొలుత చూడకున్నా..తర్వాత తిరిగి చూస్తుంది. దీంతో మాధవన్‌ ఆమె వెంటపడుతాడు. కానీ మీరా అన్న అతుల్‌ పెద్ద రౌడీ. ఆమె చెల్లెలు వెంటపడ్డ వాడి ఎవడి ప్రాణాలకైనా ముప్పే. మాధవన్‌ ను కూడా వాళ్ళు అలానే కొడుతారు. అతుల్‌ రౌడీయిజం కెరీర్‌ లో మాధవన్‌ ఒక్కడే తిరగబడిన వాడు. అతని రౌడీలను చితకబాదుతాడు. దీంతో మీరా మనసు పారేసుకుంటుంది. ఇక అతుల్‌ ను చాలెంజ్‌ చేసి, తన ప్రియురాలిని ఎలా తీసుకెళుతాడు అనేది క్లైమాక్స్‌.

    యాక్షన్‌ సన్నివేశాలు ఉత్కంఠగా ఉన్నాయి. మాధవన్‌ అతుల్‌ ను తొలిసారి బెదరించే సీన్లు, క్లైమాక్స్‌ సినిమాకు ప్రాణం. పాటలు వినడానికి బాగున్నా, సినిమాకు పెద్దగా అతకలేదు. మాధవన్‌ సినిమా ఆసాంతం రఫ్‌ గా కన్పిస్తాడు. అతని నవ్వు, నోరును రకరకాలుగా తిప్పే స్టైలే బహుశా అమ్మాయిలను 'పడేస్తుంది' కాబోలు. విలన్‌ గా నటించిన అతుల్‌ శారీరకంగా బలహీనమైనవాడైనప్పటికీ కేవలం హాహభావాలతో, నటనతో 'విలనిజం' ప్రదర్శించడం విశేషం. 'నటన' అంటే ఇలా ఎక్స్‌ ట్రాలు లేకుండా ఉండాలని మిగతా నటులు నేర్చుకుంటే బాగుంటుంది. అందగత్తె మీరా కూడా చక్కగా నటించింది. చూడదగ్గ సినిమానే కానీ..ఇంటర్వెల్‌ ముందు థియేటర్‌ లోకి వెళ్ళండి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X