twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఋషి’ మూవీ రివ్యూ...

    By Bojja Kumar
    |

    సంస్థ: ప్రసాద్ ప్రొడక్షన్స్ ప్రై.లి
    కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: రాజ్ మాదిరాజు
    నిర్మాత: రమేష్ ప్రసాద్
    సంగీతం: డాన్ చంద్రన్
    లిరిక్స్: స్నిగ్దా
    సినిమాటో గ్రఫీ: త్రిభువన్ బాబు
    ఎడిటింగ్: శేఖర్ ప్రసాద్
    తారాగణం: అరవింద్ కృష్ణ, శైలజ సుప్రియ, రవి ప్రకాష్, మాస్టర్ గౌరవ్ తదితరులు
    విడుదల: ఫిబ్రవరి 10, 2012

    ఇది వరకు వచ్చిన 'ఇట్స్ మై లవ్ స్టోరీ' సినిమా ద్వారా హీరోగా మంచి మార్కులు కొట్టేసిన అరవింద్ కృష్ణ తాజాగా 'ఋషి' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇందులో మెడికల్ విద్యార్థి పాత్ర పోషించాడు. సినిమా విశేషాల్లోకి వెళితే...

    కథ: ఋషి(అరవింద్ కృష్ణ) డాక్టర్ విద్య అభ్యసిస్తుంటాడు. ఎప్పుడూ ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంటాడు. ముక్కుసూటి వ్యక్తిత్వం. తన క్లాస్‌మేట్ పూజ(శైలజా సుప్రియా) ప్రేమలో పడతాడు. మొదట్లో పూజ అతని ప్రేమను తిరస్కరించినా తర్వాత తను కూడా ప్రేమించడం మొదలు పెడుతుంది. ఇలా మొదటి భాగం కాలేజీ బ్యాక్ డ్రాప్‌తో పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది.

    ఈ క్రమంలో కార్తీక్(గౌరవ్) అనే కుర్రాడు గుండె జబ్బుతో కారణంగా జీవితంతో పోరాడుతుంటాడు. అతడు బ్రతకాలంటే గుండె మార్పిడి చేయాలి. అయితే అప్పటికి రిషి ట్రీట్ మెంట్ చేయడాకికి అర్హుడు కాదు. ఎలాగైనా ఆ బాలుడికి కాపాడాలనే ఉద్దేశ్యంతో హృదయ దాతల(బ్రెయిన్ డెడ్, యాక్సిడెంట్స్‌ అయివారు) కోసం వెతుకుతుంటారు ఋషి, అతని స్నేహితులు. ఈ క్రమంలో సినిమాలో ఆసక్తికర ట్విస్ట్ ఉంటుంది. అదేమిటో తెరపై చూడాల్సిందే.

    పెర్ఫార్మెన్స్: అరవింద్ కృష్ణ గతంలో కంటే పరిణితి చెందిన పెర్ఫార్మెన్స్ తో బాగా నటించాడు. మంచి ఫిజిక్ తో హాండ్సమ్ గా కనిపించాడు. కొన్ని ఎమోషన్స్ ను డిఫరెంట్ గా పండించాడు. హీరోయిన్ సుప్రియ శైలజ గుడ్ లుక్‌తో హీరోకి తగిన జోడీగా, ఓకే అనిపించేలా నటించింది. గౌరవ్ లుక్స్ క్యూట్. ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేరకు రాణించారు.

    టెక్నికల్: కెమెరామెన్ పనితనం, ఎడిటింగ్ జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి. డాన్ చంద్రన్ అందించిన సంగీతం, సిగ్న అందించిన మెలోడియస్ లిరిక్స్ బాగానే ఉన్నప్పటికీ 11 పాటలతో సంగీతం డోసు ఎక్కువ కావడంతో విసుగు చెందిన ప్రేక్షకులు టీలకు, సిగరెట్లకు వెల్లడం కనిపించింది. దర్శకుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమా సబ్జెక్టు బాగుంది. తొలి సగ భాగం ఫీల్ గుడ్ గా సాగిన మూవీ, రెండో భాగంలో ప్రేక్షకులను సీట్లకు కట్టి పడేస్తుంది.

    మొత్త మీద 'ఋషి' సినిమా మంచి థీమ్‌తో ఆకట్టుకుంటుంది. రోటీన్ సినిమాలకు భిన్నంగా మంచి అనుభూతిని ఇవ్వడమే కాదు, అర్థవంతమైన ఆలోచనలు రేకెత్తిస్తుంది.

    English summary
    No doubt, Rushi has a good theme and has been also tackled effectively and worth appreciation. It is a different from routine film. The film leaves to the audiences some meaningful thoughts. Watch the film if you are really looking for a different flick with a touch of entertainment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X