Saraswathi First Review: సరస్వతి మూవీ ఫస్ట్ రివ్యూ

టాలెంటెడ్ యాక్టర్ వరలక్ష్మి శరత్‌కుమార్ దర్శకురాలిగా మారి నటించిన చిత్రం సరస్వతి. దోశా డైరీస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై ఈ సినిమాను పూజా శరత్ కుమార్, వరలక్ష్మీ శరత్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి ఆంటోని ప్రవీణ్ డేనియల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ చిత్రంలో ప్రియమణి, రాధిక శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, కిషోర్, నాజర్, తులసి, సప్తగిరి, శ్రీకాంత్ అయ్యంగార్, మైమ్ గోపి, హరీష్ పెరాడీ, రఘుబాబు, గెటప్ శ్రీను, నివేష్క తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక నిపుణుల వివరాల్లోకి వెళితే.. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, ఏఎం ఎడ్విన్ సాకే సినిమాటోగ్రాఫర్‌గా, వెంకట్ రాజన్ ఎడిటర్‌గా, శ్రీధర్ మాచర్ల ఆర్ట్ డైరెక్టర్‌గా, బృందా మాస్టర్ కొరియోగ్రఫి, నందూ మాస్టర్ స్టంట్స్ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఈ సినిమా మార్చి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోన్నది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) జారీ చేసిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమాపై సెన్సార్ అధికారులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

S Saraswathi Review by Censor Board

సరస్వతి అనే 12 ఏళ్ల కూతురు అంటే తల్లి (వరలక్ష్మి శరత్ కుమార్)కు పంచ ప్రాణాలు. అల్లారుముద్దుగా పెంచిన కూతురు స్కూల్‌కు వెళ్లి అదృశ్యమవుతుంది. తన కూతురు తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. తన పాపను వెతికపెట్టమని పోలీసులను సహాయం కోరుతుంది. అయితే కూతురు మిస్సింగ్ కేసులో భారీ ట్విస్టు రివీల్ అవుతుంది. అయితే ఆ ట్విస్ట్ ఏమిటి? కూతురు మిస్పింగ్ వెనుక హస్తం ఎవరిది? చివరకు కూతుర్ని క్షేమంగా దక్కించుకొన్నదా? అనే ప్రశ్నలకు సమాధానమే ఎస్ సరస్వతి సినిమా కథ.

హ్యూమన్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో కూడిన ఈ కథను తెరపైకి అత్ంత భావోద్వేగంగా తీసుకొచ్చేందుకు వరలక్ష్మీ శరత్ కుమార్ దర్శకురాలిగా మారారు. అయితే ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు రివ్యూ చేసింది. ఈ సినిమాకు పెద్దగా అభ్యంతరాలు తెలియజేయకుండానే క్లీన్ సర్టిఫికెట్‌ను అందించింది. వారు సూచించిన స్వల్ప మార్పులు, చేర్పులను చిత్ర యూనిట్‌ సానుకూలంగా స్పందించడంతో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రావడానికి మార్గం సుగమమైంది.

ఇక ఈ సినిమాలోని ఫ్యామిలీ ఎలిమెంట్స్‌, మదర్, డాటర్ సెంటిమెంట్‌పై సెన్సార్ బోర్డు అధికారులు, ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు యూఏ (UA16+) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్‌ను అనుసరించి 16 ఏళ్లకుపై బడిన వారు ఈ సినిమాను చూడటానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుందని సెన్సార్ జారీ చేసిన సర్టిఫికెట్‌ ద్వారా వెల్లడించారు.

కంటెంట్ డిమాండ్ మేరకు ఈ చిత్రాన్ని చాలా బ్యాలెన్స్‌డ్‌గా రన్‌టైమ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా కథను, సన్నివేశాలను సాగదీయకుండా క్రిస్పీగా ఎడిట్ చేశారు. దాంతో ఈ సినిమా నిడివి సుమారుగా 2 గంటల 1 నిమిషం అంటే 121 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాపై సెన్సార్ బోర్డు ఫీడ్‌బ్యాక్ పాజిటివ్‌గా ఉంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఆడియెన్స్ నుంచి ఎలాంటి స్పందనను సంపాదిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమా గురించిన అప్ డేట్స్, ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్ ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X