Don't Miss!
- Automobiles
XUV400 EV బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా?
- News
Delhi High Court: 24 వారాలు దాటినా అబార్షన్ చేసుకోవచ్చు.. కానీ..
- Finance
Bank Fraud: బయటపడ్డ వేల కోట్ల లోన్ కుంభకోణం.. కంపెనీపై కేసు నమోదు చేసిన సీబీఐ
- Sports
INDvsNZ : తొలి టీ20కి అంతా రెడీ.. వీళ్లే మ్యాచ్ గెలిపిస్తారు!
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
S5 No Exit movie review.. ఏపీ బ్యాక్‌డ్రాప్‌తో పొలిటికల్ థ్రిల్లర్.. 3000 కోట్లతో రాజకీయం
తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్, అవంతిక హరి, సురేశ్ వర్మ, మెహబూబ్, రఘు, ఫిష్ వెంకట్ తదితరుల
దర్శకత్వం: భరత్ కోమలపాటి (సన్నీ కోమలపాటి)
బ్యానర్: శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత: ఆదూరి ప్రతాప్ రెడ్డి
మ్యూజిక్: మణిశర్మ
సినిమాటోగ్రఫి: గరుడవేగ అంజి
ఆర్ట్: నాగేంద్ర
మాటలు, సాహిత్యం: కల్యాణ్ చక్రవర్తి
ఎడిటర్: గ్యారీ బీహెచ్
దర్శకుడు భరత్ కోమలపాటి
రిలీజ్ డేట్: 2022-12-30
అధికార ప్రజాసేవ పార్టీ నాయకుడు, ఏపీ ముఖ్యమంత్రి (సాయికుమార్) రెండోసారి కూడా సీఎం కావాలని ప్లాన్ చేస్తుంటాడు. తన తనయుడు సుబ్బు (తారకరత్న) బర్త్ డే సెలబ్రేషన్స్‌ను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే ట్రైన్‌లో S5 బోగీలో జరుపుకొనేలా ప్లాన్ చేస్తారు. తండ్రి ఏర్పాటు చేసిన S5 బోగీలో తన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుంటాడు. వైజాగ్ వెళ్లే క్రమంలో మధ్యలో సన్నీ (ప్రిన్స్) తన డ్యాన్స్ టీమ్తో అదే బోగీలో ఎక్కుతాడు. అయితే ఆ ప్రయాణంలో సుబు, సన్నీ గొడవలు పడుతుంటాడు. ఇక అదే బోగీలో ప్రయాణిస్తున్న వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మాయం అవుతుంటారు. ఆ క్రమంలో S5 బోగికి మంటలు అంటుకొంటాయి. అయితే ఏదో జరుగుతుందని సుబ్బు, అతడి స్నేహితులు ట్రైన్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకొంటారు.
S5 బోగీలో వ్యక్తుల అదృశ్యాల వెనుక హస్తం ఎవరిది? S5 బోగీలో దెయ్యం ఉందా? సీఎం తన కొడుకు పుట్టిన రోజు వేడుకలను హైద్రాబాద్ నుంచి వైజాగ్‌కు వెళ్లే ట్రైన్‌లో ఎందుకు ఏర్పాటు చేశారు? S5 బోగీలో సన్ని బ్యాచ్ ఎక్కడానికి కారణం ఏమిటి? S5 బోగీలో ఉన్న 3 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి? S5 బోగీకి అంటుకొన్న మంటల్లో 3 వేల కోట్లు ఏమయ్యాయి? సీఎం రెండోసారి పదవి చేపట్టాలనే కోరిక తీరిందా? అనే ప్రశ్నలకు సమాధానమే S5 No Exit సినిమా కథ.

S5 No Exit పాయింట్‌ను క్లుప్తంగా వింటే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కానీ దానిని పూర్తిస్థాయి సస్సెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించే క్రమంలో జరిగే ప్రక్రియలో తడబాటు కనిపించింది. అయితే పరిమితమైన బడ్జెట్ సినిమా మరో రేంజ్ తీసుకుపోవడానికి అడ్డంకిగా మారినట్టు కనిపిస్తుంది. అయినా కథను ఆసక్తికరంగా మలిచేందుకు చిత్ర యూనిట్ దర్శకుడు చేసిన ప్రయత్నం అభినందనీయమే. జ్యోతిలక్ష్మీ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా మారిన భరత్ కోమలపాటి దర్శకుడిగా మారి చేసిన అంటెంప్ట్ బాగుంది.
S5 No Exit చిత్రంలో తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ కీలకమైన పాత్రల్లో కనిపించారు. అయితే తారకరత్న, ఆది సాయి కుమార్ మాత్రమే కథను ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే తారకరత్న స్టైలిష్ లుక్‌లో కొత్తగా కనిపించాడు. సీఎంగా సాయి కుమార్ తన పాత్రకు న్యాయం చేశారు. సునీల్, ప్రిన్స్, ఆలీ తమ పాత్రల పరిధి మేరకు హాస్యాన్ని, ఎమోషన్స్ పండించారు.
ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి అంశాలు సినిమాను రిచ్‌గా మార్చాయి. మణిశర్మ సంగీతం పలు సన్నివేశాలకు బలంగా మారింది. రైలు బోగి సెట్ చాలా బాగుంది. నిజంగా బోగి ట్రైన్‌లో షూట్ చేశారా అనే ఫీలింగ్ కల్పించారు. సినిమాటోగ్రఫి చాలా టఫ్ టాస్క్. గరుడువేగ అంజి సన్నివేశాలను చిత్రీకరించిన తీరు బాగుంది. నాగేంద్ర ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. కల్యాణ్ చక్రవర్తి రాసిన డైలాగ్స్, పాటలు ఆకట్టుకొంటాయి. నిర్మాత ఆదూరి ప్రతాప్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
రాజకీయాలు, కామెడీ, యాక్షన్, సస్పెన్స్ అంశాలతో రూపొందిన S5 No Exit పక్కా పొలిటికల్ థ్రిల్లర్. చిన్న సినిమాల్లో మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో రూపొందింది. పొలిటికల్ థ్రిల్లర్స్ ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది.