twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాక్ష్యం మూవీ రివ్యూ: ఎమోషనల్ రివేంజ్ డ్రామా

    By Rajababu
    |

    Recommended Video

    Saakshyam Movie Review సాక్ష్యం మూవీ రివ్యూ

    Rating:
    2.5/5
    Star Cast: బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతి బాబు
    Director: శ్రీవాసు

    ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా అల్లుడు శీనుతో తెలుగు చిత్రసీమలో హీరోగా అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా, సినిమాకు పరిణతి చెందుతున్నాడు. నాలుగైదు సినిమాలు చేసిన పెద్దగా కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయడు. కానీ ఆయన నటించిన జయ జానకి నాయక చిత్రం మంచి విజయాన్ని అందుకొన్నది. తాజాగా శ్రీవాసు దర్శకత్వంలో సాక్ష్యం అనే విభిన్నమైన కథతో శ్రీనువాస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందాల భామ పూజా హెగ్డే ఈ చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌గా మార్చడానికి తీవ్రంగా కృషి చేశామని చిత్ర యూనిట్ చెప్పింది. అయితే ఈ చిత్రం శ్రీనివాస్‌కు కమర్షియల్ సక్సెస్ అందించిందా? పూజా హెగ్డే అందాలు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయా? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    సాక్ష్యం స్టోరి

    సాక్ష్యం స్టోరి

    విశ్వాజ్ఞ (బెల్లంకొండ శ్రీనివాస్ వీడియో గేమ్ డెవలపర్. అమెరికాలో సంపన్న బిజినెస్ మ్యాన్ శివ ప్రకాశ్ (జయప్రకాశ్) పెంపుడు కుమారుడు. చిన్నతనంలోనే మునిస్వామి (జగపతిబాబు) తన తల్లిదండ్రుల (శరత్ కుమార్, మీనా)ను, మొత్తం ఫ్యామిలీని చంపేస్తుంది. కానీ ఆ విషయం విశ్వాజ్ఞ‌కు తెలియదు. అయితే వారి హత్యలకు ఓ సాక్ష్యం మిగులుతుంది. ఈ క్రమంలో ప్రవచనాలు చెప్పే సౌందర్య లహరి (పూజా హెగ్డే)తో ప్రేమలో పడుతాడు. ఓ చిన్న కారణంగా వారిద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకొంటాయి. తనకు చెప్పకుండా ఇండియాకు వచ్చిన ప్రేయసికి సారీ చెప్పడానికి తన కూడా అక్కడికి చేరుకొంటాడు. అయితే అక్రమాలకు, అన్యాయానికి పాల్పడే దుష్టులు (జగపతిబాబు, అశుతోష్ రాణా, రవి కిషన్, మధు గురుస్వామి, కబీర్) ఒక్కొక్కరిని కారణం తెలియకుండా పంచభూతాల సహాయంతో చంపేస్తుంటాడు.

     ట్విస్టులు ఇలా

    ట్విస్టులు ఇలా

    తన తల్లిదండ్రులను మునిస్వామి ఎందుకు చంపాడు? తన కుటుంబాన్ని చంపిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? ఐదుగురు విలన్లను విశ్వాజ్ఞ ఎలా మట్టుపెట్టాడు. విలన్ల అకృత్యాలకు ఎలా ముగింపు పలికాడు. తాను రూపొందించే వీడియో గేమ్‌లోని సన్నివేశాల మాదిరిగానే హత్యలు ఎలా జరిగాయి? అలిగి ఇండియాకు వచ్చిన ప్రేయసిని ఎలా సొంతం చేసుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే సాక్ష్యం చిత్ర కథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    సాక్ష్యం కథ హీరో చిన్నతనంలోని సన్నివేశాలతో ప్రారంభమతుంది. హీరో తండ్రి కబేళాకు వెళే ఆవులను రక్షించి, అలాంటి బిజినెస్‌ సాగిస్తున్న గురుస్వామి ఎదుర్కోవడమనే సీన్లు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. తలిదండ్రుల మరణం తర్వాత పసిపాప అయిన హీరోను ఆవుదూడ తీసుకెళ్లడం చాలా బాగుంటుంది. ఇలాంటి సన్నివేశాలతో బాగానే వెళ్తుంది అనుకొంటాం. అక్కడ కట్ చేసి పెరిగి పెద్దైన హీరో ఎపిసోడ్‌ను దుబాయ్‌లో తెరలేపడంతో రెగ్యులర్‌గా మారిపోతుంది. అక్కడ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ చాలా రొటీన్‌గా నడుస్తుంటుంది. ఎమోషనల్ ఉండే ప్రేక్షకులకు పాటలు చికాకు పెడుతాయి. కానీ ఇంటర్వెల్ సీన్‌తో సినిమా మరోస్థాయికి లేచినట్టు కనిపిస్తుంది.

     సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత సినిమా మరింత ఎమోషనల్‌గా సాగుతుంది. కాశీ ఎపిసోడ్, ఆ తర్వాత అనాథలను రక్షించే సీన్ సినిమాకు హైలెట్‌గా ఉంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి శుభం కార్డు వరకు చాలా రొడ్డకొట్టుడుగా ఉంటుంది. కథలో కొన్ని లాజిక్కులు మిస్ అయ్యాడనిపిస్తుంది. గ్రాఫిక్స్, యాక్షన్ సీన్లపై దృష్టిపెట్టడం, కథ, కథనాలను గాలికి వదిలేసిన ఫీలింగ్ కలుగుతుంది.

    డైరెక్టర్ టేకింగ్

    డైరెక్టర్ టేకింగ్

    పంచభూతాల కాన్సెప్ట్‌ను ఆలోచించిన తీరుకు ముందుగా దర్శకుడు శ్రీవాస్‌కు హ్యాట్సాఫ్. మంచి దమ్మును కథకు యాక్షన్ ఎపిసోడ్లనే నమ్ముకోవడం కూడా కరెక్టే. కానీ మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్లపైనే సరిగా విజన్ పెట్టలేకపోవడంతో కథ తేలిపోయినట్టు కనిపిస్తుంది. పూజా హెగ్డే లాంటి గ్లామరస్, హాట్ అమ్మాయి, శ్రీనివాస్‌తో ఫీల్ గుడ్ లవ్ ట్రాక్‌ను చేసుకోకపోవడం కొంత నిరాశను కలిగిస్తుంది. ప్రధానంగా అనంత్ శ్రీరాం‌ (వాల్మికీ)ను కీలకమైన పాత్రకు ఎంచుకోవడం పెద్ద పొరపాటే. భారమైన, భావోద్వేగాన్ని పండించే పాత్రను పోషించలేక స్క్రీన్ మీద అనంత్ శ్రీరాం చతికిలపడ్డాడనే చెప్పవచ్చు. దర్శకుడి ఆలోచనలో ఉండే భావోద్వేగం ఆ ఒక్క పాత్ర తినేసిందనే ఫీలింగ్ కలుగుతుంది.

    శ్రీనివాస్ ఫెర్ఫార్మెన్స్

    శ్రీనివాస్ ఫెర్ఫార్మెన్స్

    విశ్వాజ్ఞ‌ పాత్ర కోసం బెల్లంకొండ శ్రీనివాస్ తన శక్తికి మించి కష్టపడ్డాడనే భావన కలుగుతుంది. ఓ మాస్ హీరోలో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ చక్కగా ఉన్నాయి. పాటలు, ఫైట్స్‌లో ఇరుగదీశాడు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. నటనపరంగా, డైలాగ్స్ పరంగా మరింత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎమోషన్ సీన్లలో ఇంకా రాటుదేల్సాలి ఉంది.

    పూజా హెగ్డే గ్లామర్

    పూజా హెగ్డే గ్లామర్

    టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. డీజే, రంగస్థలం(ఐటెం)లో గ్లామర్‌తో ఆకట్టుకొన్నది. ఈ చిత్రంలో ఓ సంప్రదాయ అమ్మాయి పాత్రలో కనిపించింది. కానీ తెర మీద మరీ చిక్కిపోయి డీ గ్లామర్‌గా కనిపించింది. ముఖంలో మెరుపు కనుమరుగైంది. మిగితా సినిమాలతో పోల్చుకొంటే ఇందులో కొంత యాక్టింగ్‌కు స్కోప్ ఉండే పాత్ర దొరికింది. అయితే అంతగా ఆ పాత్రను సద్వినియోగం చేసుకొన్నట్టు కనిపించదు.

    శరత్ కుమార్, మీనా రోల్స్

    శరత్ కుమార్, మీనా రోల్స్

    హీరోకు తల్లిదండ్రులగా నటించి శరత్ కుమార్, మీనా అతిథి పాత్రలే. సినిమా ఆరంభంలో పది నిమిషాలు మాత్రమే కనిపిస్తారు. కాబట్టి వారి నటన, పాత్రలు కీలకమైనప్పటీకి.. ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోనవసరం లేదు. ఇక పవిత్రా లోకేష్, జయప్రకాశ్‌ రొటీన్ ఫాదర్, మదర్ పాత్రలే మాదిరిగానే ఉంటాయి. కొంతలో రావు రమేష్ క్యారెక్టర్ ఆకట్టుకొంటుంది. కానీ మధ్యలోనే ఆ క్యారెక్టర్‌ను వదిలేయడంతో రావు రమేష్ పాత్ర ప్రభావం తగ్గిపోతుంది.

    ప్రతినాయకులుగా

    ప్రతినాయకులుగా

    ప్రతి నాయకుల పాత్రల బలంపైనే సాక్ష్యం చిత్రం నిలబడుతుంది. కథ పరిధికి తగినట్టుగానే జగపతిబాబు, అశుతోష్ రాణా, రవి కిషన్ పాత్రలను పవర్‌ఫుల్‌గా రూపొందించారు. వారి పాత్రలకు తగినట్టేగానే తమ పాత్రల్లో జీవించారు. ముగ్గురి పాత్రలు రెగ్యులర్ విలన్ పాత్రలే. గెటప్స్ మాత్రం కొత్తగా ఉంటాయి. అంతకంటే పెద్దగా తేడా ఉండవు. రివేంజ్ డ్రామా కావడంతో రక్తంలో తడిసి ముద్దవడం స్పెషల్ ఎట్రాక్షన్.

    సినిమాటోగ్రఫీ

    సినిమాటోగ్రఫీ

    సాక్ష్యం సినిమాకు అత్యంత ప్రాణంగా నిలిచింది ఆర్థర్ విల్సన్ సినిమాటోగ్రఫి. ఈ సినిమా చూస్తూ ప్రేక్షకుడు థ్రిల్ అయ్యేలా సీన్లను తెరకెక్కించిన తీరు అభినందనీయం. విల్సన్ ప్రతిభకు కూడా ముకుట అందించిన గ్రాఫిక్స్‌తో యాక్షన్ సీన్లు మరింత ఆకర్షణగా మారాయి. సాంకేతికంగా ఈ రెండు విభాగాల పనితీరు సాక్ష్యానికి వెన్నముక అని చెప్పవచ్చు. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ పనితీరు బాగుంది. బుర్రాసాయి మాధవ్ అందించిన డైలాగ్స్ అదనపు ఆకర్షణ. నీతి పద్యాలు విలన్ చేత చెప్పించడం కొత్తగా ఉంది. కీలక సన్నివేశాల్లో డైలాగులు బ్రహ్మండంగా పేలాయి.

    మ్యూజిక్ అండ్ ఎడిటింగ్

    మ్యూజిక్ అండ్ ఎడిటింగ్

    టాలీవుడ్‌లో సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు ఇటీవల కాలంలో బాగానే వినిపిస్తున్నది. సాక్ష్యం చిత్రాన్ని తెర మీద ఎమోషనల్‌గా ఉందనే ఫీలింగ్ కలుగడానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోరు దోహదపడింది. పాటలు పెద్దగా ఆకట్టుకొనే విధంగా, లేదా హమ్మింగ్ చేసుకొనే విధంగా లేకపోయాయి. ఈ సినిమాకు ప్రస్తావించ దగిన ప్రతికూలత నిడివి. కోటగిరి వెంకటేశ్వరరావు తన వంతు ప్రయత్నం చేశారని గ్యారెంటీగా అనిపిస్తుంది. కానీ ఇంకా ఆయన కత్తెరకు పదును పెట్టాల్సిన అవసరం ఉంది.

    ప్రొడక్షన్ వాల్యూస్

    ప్రొడక్షన్ వాల్యూస్

    అభిషేక్ నామా రూపొందించిన సాక్ష్యం చిత్రం స్విల్వర్ స్క్రీన్‌పై చాలా రిచ్‌గా ఉంది. సాంకేతిక విభాగాల ఎంపిక బాగుంది. పెట్టిన ప్రతీ పైసాకు తెరపైన విలువ కనిపిస్తుంది. లోకేషన్ల ఎంపిక, పాటలకు అవసరమైన సెట్టింగులు రాయల్‌గా ఉంటాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    పంచభూతాలు అనే మంచి కాన్సెప్ట్‌తో కథను రూపొందిన రివేంజ్ డ్రామా సాక్ష్యం. కాకపోతే కమర్షియల్ హంగుల మాటున ఎమోషనల్ స్టోరీ మరుగునపడిపోయింది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంది. రక్తపాతం మోతాదు కాస్త ఎక్కువగానే అయింది. క్లాస్ ఆడియెన్స్, మల్టిప్లెక్స్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే వసూళ్లపరంగా మంచి ఫలితాన్ని రాబట్టే అవకాశం ఉంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    కాన్సెప్ట్
    డైరెక్టర్ టేకింగ్
    సినిమాటోగ్రఫి
    బ్యాక్ గ్రౌండ్ స్కోర్
    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    మైనస్ పాయింట్స్
    రొటీన్ సన్నివేశాలు
    భావోద్వేగం లోపించడం
    కామెడీ

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, జగపతిబాబు, మీనా, పవిత్ర లోకేష్, జయప్రకాశ్, రవికిషన్, అశుతోష్ రాణా తదితరులు
    దర్శకుడు: శ్రీవాస్
    నిర్మాతలు: అభిషేక్ నామా, వివేఖ్ కూచిబొట్ల
    సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
    సినిమాటోగ్రఫి: అర్థర్ విల్సన్
    ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
    రిలీజ్ డేట్: 2018-07-27

    English summary
    Saakshyam is an upcoming Telugu action fantasy thriller film produced by Abhishek Nama on Abhishek Pictures banner and directed by Sriwass. Starring Bellamkonda Sreenivas, Pooja Hegde in the lead roles with Sarath Kumar, Meena and Jagapathi Babu in supporting roles and with music composed by Harshavardhan Rameshwar. This movie set to release on July, 27th. So Telugu Filmibeat brings review exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X