twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్రమ్ ‘సామి’ మూవీ రివ్యూ, రేటింగ్

    |

    Recommended Video

    Saamy Movie Review సామి సినిమా రివ్యూ

    Rating:
    2.5/5

    దక్షిణాదిన విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ ఎలాంటి పాత్రలోకైనా ఇట్టే దూరిపోగల సామర్థ్యం ఉన్న యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. విక్రమ్ 2003లో నటించిన పోలీస్ డ్రామా 'సామి' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా తమిళంలో 'స్వామి స్కేర్' రూపొందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'సామి' పేరుతో విడుదల చేశారు. సింగం, సింగం 2 , సింగం 3 లాంటి పవర్ ఫుల్ పోలీస్ కథలను తెరకెక్కించిన హరి దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం...

     కథ విషయానికొస్తే...

    కథ విషయానికొస్తే...

    విజయవాడ నగరాన్ని తన రౌడీయిజంతో రావణ బిక్షు(బాబీ సింహ) గడగడలాడిస్తుంటాడు. అతడికి ఇద్దరు అన్నదమ్ములు దేవేంద్ర బిక్షు, మహేంద్ర బిక్షు నుండి ధన బలం, రాజకీయ బలం ఉండటంతో ఎన్ని అరాచకాలకు పాల్పడినా ఎవరూ ఏమీ చేయలేక పోతారు. అదే సమయంలో ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని విజయవాడలో ఎంటరైన రామస్వామి (విక్రమ్) వారికి చుక్కలు చూపిస్తాడు. ముగ్గురు అన్నదమ్ముల అక్రమ వ్యాపారాలను దెబ్బతీయడంతో పాటు... పగబట్టి ఒక్కొక్కరినీ చంపేస్తుంటాడు. రామస్వామికి పోలీస్ వ్యవస్థ సపోర్ట్ కూడా ఉంటుంది. అసలు ఎవరీ రామస్వామి? రావణ బిక్షుకు .... రామస్వామికి ఏమిటి సంబంధం? అనేది తర్వాతి కథ.

     విక్రమ్ పెర్ఫార్మెన్స్

    విక్రమ్ పెర్ఫార్మెన్స్

    పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విక్రమ్ అదరగొట్టాడు. ఏ సీన్లోనూ తగ్గకుండా దడదడలాడించాడు. 52 ఏళ్ల వయసులోనూ విక్రమ్ ముప్పైఏళ్ల యంగ్ హీరోలా దుమ్మురేపాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రకు వందకు వందశాతం న్యాయం చేశాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యాక్షన్ సీన్లు, సెంటిమెంటల్ సీన్స్, రొమాంటిక్ సీన్లలో తనదైన పెర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు.

    కీర్తి సురేస్, ఐశ్వర్యరాజేష్

    కీర్తి సురేస్, ఐశ్వర్యరాజేష్

    విక్రమ్ సరసన కీర్తీ సురేష్ పరిమితమై పాత్రలో కనిపించింది. కేవలం పాటలకే పరిమితమైంది. పెద్దగా పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేని పాత్రే అయినప్పటికీ ఉన్నంతలో ఆకట్టుకుంది. విక్రమ్‌కు తగిన జోడీ అనిపించుకుంది. మరో హీరోయిన్ ఐశ్వర్యరాజేష్ ఒక పాటతో పాటు ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో విక్రమ్‌కు జోడీగా ఆకట్టకుంది. ఆమెది కూడా పరిమితమైన పాత్రే.

    రావణ్ భిక్షుగా బాబీ సింహా

    రావణ్ భిక్షుగా బాబీ సింహా

    హీరో క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవ్వాలంటే...... విలన్ కూడా అంతే పవర్ ఫుల్‌గా ఉండాలి. ఇందులో విలన్ పాత్ర పోషించి తమిళ నటుడు బాబీ సింహా క్రూరత్వానికి మారుపేరుగా పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు. సినిమాలో విక్రమ్ తర్వాత బాగా హైలెట్ అయిన పాత్ర ఇతడిదే అని చెప్పక తప్పదు.

     ఇతర నటీనటులు

    ఇతర నటీనటులు

    కేంద్ర మంత్రి పాత్రలో ప్రభు, దేవంద్ర బిక్షు పాత్రలో జాన్ విజయ్, మహేంద్ర బిక్ష పాత్రలో సుందర్, కమెడియన్ సూరి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

    టెక్నికల్ అంశాల పరంగా

    టెక్నికల్ అంశాల పరంగా

    ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పాటలు ఫర్వాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల కాస్త డిస్ట్రబెన్స్‌లా అనిపించింది. వెంకటేష్ అంగురాజ్ అందించిన సినిమాటోగ్రఫీ బావుంది. వి.టి. విజయన్, టిఎస్ జయ్ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బావుండేది. అయితే టెక్నికల్ పరంగా అంతగొప్పగా చెప్పునేది అంశాలు కనిపించలేదు.

    ఫస్టాఫ్ ఎలా ఉంది

    ఫస్టాఫ్ ఎలా ఉంది

    సినిమా ఫస్టాఫ్ అంతా పెద్దగా పోలీస్ గోల లేకుండా.... హీరో, హీరోయిన్ మధ్య జరిగే లవ్ ట్రాక్‍‌‌, ఇతర సీన్లతో సాగుతుంది. ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న హీరో చివరి నిమిషంలో ఐపీఎస్ ఎంచుకుంటాడు. ఆ తర్వాత తన తన ఫ్లాష్‌బ్యాక్ గురించి తెలియడంతో పగతో రగలిపోతాడు...దాంతో ఇంటర్వల్ పడుతుంది.

    సెకండాఫ్....

    సెకండాఫ్....

    సెకండాఫ్.... అంతా ఫుల్ పోలీస్ డ్రామాతో సాగుతుంది. తన తల్లిదండ్రులను చంపిన రావణ్ భిక్షు అండ్ గ్యాంగ్ మీద సామి ప్రతీకారం తీర్చుకునే అంశాలు, ఎత్తులకు పైఎత్తులతో సినిమా సింగం సిరీస్ చిత్రాలను గుర్తుకు తెస్తుంది.

    ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    విక్రమ్ పెర్ఫార్మెన్స్

    బాబీ సింహా విలనిజం

    మైనస్ పాయింట్స్

    రోటీన్ రివేంజ్ డ్రామా
    వయొలెన్స్ కాస్త ఎక్కువగా ఉండటం
    కథలో కొత్తదనం లేక పోవడం

     దర్శకుడి పని తీరు

    దర్శకుడి పని తీరు

    ఇంతకు ముందు సింగం, సింగం 2, సింగం 3 సినిమాలను తీసిన దర్శకుడు హరి..... ‘స్వామి' సినిమాలో కాస్త కాన్సెప్టును, హీరో హీరోయిన్లను, ఇతర నటీనటులను మార్చినట్లు ఉందే తప్ప కొత్తదనం చూపించలేదు. పోలీస్ డ్రామాలు కూడా కొత్తతరహాలో ఉంటేనే తప్ప ప్రేక్షకులు మెప్పుపొందడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇంకా పాతకాలం నాటి స్క్రీన్ ప్లే, డైలాగులను మళ్లీ మళ్లీ రిపీట్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది.

    చివరగా...

    చివరగా...

    ‘సామి' మూవీ రోటీన్ రివేంజ్ పోలీస్ డ్రామా. కథలో కొత్తదనం లేక పోయినా యాక్షన్, కామెడీ పర్వాలేదనిపిస్తుంది. ‘సింగం' సిరీస్ తరహాలో మరో పోలీస్ డ్రామా చూడాలనుకుంటే వెళ్లొచ్చు.

    నటీనటులు

    నటీనటులు

    తారాగణం : విక్రమ్, కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్, బాబీ సింహ, సూరి తదితరులు.

    సంగీతం: దేవిశ్రీప్రసాద్
    సినిమాటోగ్రఫీ: వెంకటేష్ అంగురాజ్
    ఎడిటర్: వి. టి. విజయన్, టి ఎస్. జయ్,
    కథ-డైరెక్షన్: హరి
    విడుదల తేదీ: సెప్టెంబర్ 21, 2018

    English summary
    In 2003, actor Vikram gave a strong proof of his acting abilities when the cop-drama Saamy opened to a thunderous response at the box office and clicked with the mass audience in a big way. The film's success helped the star continue his rise to stardom and expand his fan base. Now, nearly 15 years later, 'Chiyaan' is back with the film's sequel Saamy Square and the fans have high expectations from it. So, does the sequel live up to these expectations? Let's find out!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X