Saarangadariya Movie Review: సారంగదరియా మూవీ రివ్యూ

Rating:
2.5/5

నటీనటులు: రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహ‌మ‌ద్‌ ,మోహిత్ పేడాడ‌, నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్, తదితరులు
నిర్మాతలు: ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి,
దర్శకత్వం: పద్మారావు అబ్బిశెట్టి (పండు)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అరుణాచల మహేష్
మాటలు: వినయ్ కొట్టి
ఎడిటర్: రాకేష్ రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్: ఎం. ఎబెనెజర్ పాల్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ స్వయంభు
పాటలు: రాంబాబు గోశాల, కడలి స‌త్య‌నారాయ‌ణ‌
అడిషనల్ రైటర్: రఘు రామ్ తేజ్.కె
బ్యానర్: సాయిజా క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2024-07-12

రాజా రవీంద్ర మెయిన్ లీడ్‌గా మోయిన్, మోహిత్, యశస్విని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సారంగదరియా. సాయిజా క్రియేషన్స్ మీద పండు తీసిన ఈ చిత్రం జూలై 12న థియేటర్లోకి వచ్చింది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూస్తే ఈ మూవీ ఫుల్ ఎమోషనల్ రైడ్‌గా ఉంటుందని అందరికీ అర్థమైంది. ఈ సినిమా కథ, కథనాలు ఏంటి? ఎలా ఉంది? ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించింది? అన్నది చూద్దాం.

Saarangadariya Movie Review in Telugu  Raja Ravindra s matured Family Drama

కథ
మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేస్తున్న కృష్ణ కుమార్‌(రాజా రవీంద్ర) లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. పెద్ద కొడుకు అర్జున్‌(మోయిన్‌) ప్రేమలో విఫలమై చెడు వ్యసనాల బారిన పడతాడు. ఇంటి గురించి గానీ, కుటుంబం గురించి కానీ ధ్యాసే ఉండదు. కూతురు అను(యశస్విని) వంటింటి కుందేలులా ఇంటికే పరిమితమై ఉంటుంది.ఆమెని కాలేజ్‌లో రాజ్‌(శివచందు) అనే వ్యక్తి ప్రేమ పేరుతో వెంటపడుతుంటాడు. చిన్నవాడు సాయి(మోహిత్‌) ప్లే బాయ్ టైపు. అమ్మాయిలతో ఫ్లర్టింగ్ చేసి రొమాంటిక్‌ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను ఫాతిమా(మధులత) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. చిన్నోడు అమ్మాయిల విషయంలో దొరికిపోతూ కృష్ణకి మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు.

స్టోరీలో ట్విస్టులు
సాయి పెద్ద కొడుకు బ్రేకప్ వ్యవహారం ఏమైంది? చిన్న కూతురు ప్రపంచాన్ని చూడగలిగిందా? చిన్న కొడుకు సాయి ప్రేబాయ్ వ్యవహారం కృష్ణకుమార్‌కు ఎంత మేరకు తలనొప్పులు తెచ్చింది? బయటపడిన కూతురు విషయం ఏంటి? మోడల్‌గా రాణించాలనుకునే అనుకి వచ్చిన సమస్య ఏంటి? అర్జున్‌ లవ్‌ ఫెయిల్యూర్‌ లవ్‌ స్టోరీ ఏంటి? సాయికి ఫాతిమా దక్కిందా? ఈ సమస్యల నుంచి కృష్ణ కుమార్‌ ఎలా బయటపడ్డాడు అన్నది కథ.

నటీనటులు
కృష్ణ కుమార్‌ పాత్రలో రాజా రవీంద్ర మెప్పిస్తాడు. ఇంత వరకు విలన్‌గా, నెగెటివ్ రోల్స్‌లో కనిపించిన రాజా రవీంద్ర.. మొదటి సారి ఇలా మంచి రోల్‌లో మిడిల్ క్లాస్ తండ్రిగా నటించి మెప్పించాడు. సినిమాని ఒంటి చేత్తో నడిపించారు. అర్జున్‌ పాత్రలో మెయిన్‌, సాయి పాత్రలో మోహిత్‌ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. అను పాత్రలో యశస్విని మెప్పించింది. క్లైమాక్స్ లో సినిమా మొత్తాన్ని తనవైపు టర్న్ తీసుకుని ఆకట్టుకుంది. ఫాతిమాగా మధులత ఓకే అనిపించింది. రాజ్‌ పాత్రలో శివ పర్వాలేదనిపించాడు. కృష్ణకుమార్‌ భార్యగా నీల ప్రియ ఆకట్టుకుంది. మిగిలిన పాత్రలు వాటి పరిధి మేరకు మెప్పిస్తారు.

Saarangadariya Movie Review in Telugu  Raja Ravindra s matured Family Drama

విశ్లేషణ
సారంగదరియా కథ.. ప్రతీ ఒక్కరి ఇంట్లో జరిగేదే. ప్రతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలాంటి సమస్యలే ఉంటాయి. ఇందులో మతం, కులం, ఆర్థిక స్థోమత, సమాజంలోని అసమానతలు ఇలా అన్ని కోణాల్ని అద్భుతంగా స్పృశించాడు దర్శకుడు. లింగమార్పిడి ప్రస్తావన.. అమ్మాయిలకు స్పూర్తిగా నిలిచే కథ..తల్లిదండ్రుల ఆవేదన ఇలా చాలా ఉన్నాయి. చాలా లేయర్లుగా ఈ కథను చాలా యాంగిల్స్‌లో చూపించాడు దర్శకుడు. అన్ని కథలు మనసుకి హత్తుకునేలా ఉండటంతో ప్రేక్షకుడు కథలో లీనమైపోతాడు. సినిమాను కన్నార్పకుండా చూస్తాడు.

పాత్రలను పరిచయంచేయడం, కృష్ణకుమార్‌ ఫ్యామిలీ పరిస్థితిని చూపించడం.. ఒక్కో కథను మెల్లిగా ఓపెన్ చేయడం.. పెద్దోడి కథతో ఎమోషనల్‌గా సాగితే.. చిన్నోడి కథతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అలా పడుతూ లేస్తూ ముందుకు సాగుతూ ఎమోషనల్‌గా ప్రేక్షకుడిని కట్టి పడేస్తుంది. సెకండాఫ్ పూర్తి ఎమోషనల్‌గా సాగుతూ ప్రేక్షకుడిని ప్రతీ పాత్రతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.

ఎమోషన్స్‌కి పెద్ద పీఠ వేస్తూ, అంతర్లీనంగా మంచి సందేశాన్ని ఇవ్వడం కలిసి వచ్చింది. ఎమోషనల్ పార్ట్ వర్కౌట్ అవ్వడంతో ఆ సందేశం కూడా క్లాస్ పీకినట్టు అనిపించదు. అరెరె నిజమే కదా? అని ఆలోచించేలా చేస్తుంది. అక్కడే దర్శకుడు పూర్తిగా సఫలం అయ్యాడు. తన కథకు, కారెక్టర్లకు తగ్గ నటీనటులు దొరికారు. అంతే కాకుండా తన టెక్నికల్ టీం తనకు బలమని అర్థం అవుతుంది. ఎం ఎబెనెజర్ పాల్ మ్యూజిక్‌ బాగా కుదిరింది. సిద్ధార్థ స్వయంభు కెమెరా వర్క్ సహజంగా ఉంది. నిర్మాతలు రాజీపడకుండా నిర్మించారని అర్థమవుతుంది. మంచి కథని చెప్పడంలో నిర్మాతల సహకారం కనిపిస్తుంది.

More from Filmibeat

Read more about: raja ravindra sarangadariya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X