Saaree Movie Review: శారీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
1.0/5

నటీనటులు: ఆరాధ్య దేవీ, సత్య యాదు, సాహిల్ సంభాల్, అప్పాజీ అంబరీష్, కల్పలత తదితరులు
దర్శకత్వం: గిరి కృష్ణ కమల్
సమర్పణ: రాంగోపాల్ వర్మ
మ్యూజిక్: ఆనంద్ రాగ్
నిర్మాత: రవి శంకర్ వర్మ
సినిమాటోగ్రఫి: శబరి
ఎడిటర్: రాజేశ్ పేరంపల్లి
బ్యానర్: ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పీ
రిలీజ్ డేట్: 2025-04-04

సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఆరాధ్య దేవి (ఆరాధ్య దేవీ) తనకంటూ ఓ ప్రపంచాన్ని ఏర్పరుచుకొని జీవిస్తుంటుంది. ఆరాధ్య దేవీ చీరకట్టు, గ్లామర్‌ను చూసి కిట్టు (సత్య యాదు) అనే ఫోటోగ్రాఫర్ మనసు పారేసుకొంటాడు. ఆమెకు తెలియకుండా సీక్రెట్‌గా వెంటాడుతుంటాడు. చివరికి వారి మధ్య ఏర్పడిన పరిచయం తప్పుదారి పట్టేలా కిట్టూ చేస్తాడు. తాను ప్రేమిస్తున్నాను.. నీవు లేనిదే బతకలేనని వేధింపులకు గురి చేస్తాడు. దాంతో ఆరాధ్య దేవి ఫ్యామిలీ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేస్తారు.

Saaree Movie Review

సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఆరాధ్య దేవీ లైఫ్ ఎలా సాగింది? ఆరాధ్యదేవి అందానికి ఫిదా అయిన కిట్టూ తనకు ఎలా దగ్గరయ్యారు. వారి మధ్య కెమిస్ట్రీ ఎలా సాగింది? ఆరాధ్యను వేధించే పరిస్థితులు ఎలా వచ్చాయి? తన ప్రేమను రుజువు చేసుకోవడానికి కిట్టూ తన ప్రేమించే ఆరాధ్యను కిడ్నాప్ చేసిన తర్వాత ఏం జరిగింది? కిట్టూ ఉన్మాదం నుంచి ఆరాధ్య ఎలా తప్పించుకొన్నది? అనే ప్రశ్నలకు సమాధానమే శారీ మూవీ కథ.

సమాజంలో ప్రధానంగా సోషల్ మీడియా సొసైటీలో జరుగుతున్న అనర్థాలు, రకరకలా మోసాలు, వేధింపులు నేపథ్యంగా దర్శకుడు గిరి శంకర్ కమల్ కథను ఎంచుకోవడం బాగుంది. శారీ సినిమా పాయింట్ వరకు బాగుంటుంది. కథను విస్తరించి ఆసక్తికరంగా చెప్పడంలో దారుణంగా విఫలమయ్యారు. వర్మ మార్కు ఈ సినిమాలో పాటల్లో తప్ప.. ఎక్కడా కనిపించదు. నాసిరకమైన సన్నివేశాలు, పేలవంగా కథ, కథనం .. వెరసి ఎలాంటి ఆసక్తిని కలిగించని చిత్రంగా శారీ కనిపిస్తుంది. కిట్టూ ఉన్మాదానికి తోడు.. మితి మీరిన హింస, రక్త ప్రవాహం లాంటి చూడలేని విధంగా ఉంటాయి. మొత్తంగా చీరకట్టు పట్టు జారిందనే చెప్పాలి.

రాంగోపాల్ వర్మ మోహించినట్టుగా ఆరాధ్య దేవీ తెర మీద అందంగా కనిపించారు. తొలి సినిమా అయినప్పటికీ.. ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా ఫెర్ఫార్మెన్స్ అందించేందుకు ప్రయత్నం చేసింది. చీరకట్టులో కనిపించి సినిమా టైటిల్‌కు జస్టిఫికేషన్ చేసింది. కిట్టూగా సత్య యాదు పాత్రకు కావాల్సిన దాని కంటే.. ఎక్కువగా చేశాడు. పాత్ర పరిధిలో కాకుండా అత్యుత్సాహంగా విలనిజాన్ని పండించే ప్రయత్నం చేశాడు. మిగితా పాత్రల్లో కనిపించిన వారంతా ఒకే అనిపిస్తారు.

Saaree Movie Review

టెక్నికల్ విషయాలకు వస్తే.. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుందనిపించింది. ఆ తర్వాత ఆర్ట్ వర్క్, లొకేషన్లు సినిమాకు ప్లస్ పాయింట్స్, సినిమాటోగ్రఫి టీమ్ కూడా అక్కడక్కడ మంచి విజువల్స్ అందించారు. ఎడిటింగ్ విభాగం పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది. ప్రొడక్షన్స్ వాల్యూస్ సినిమా డెప్త్ మేరకు ఒకేలా ఉన్నాయి.

ఓవరాల్‌గా శారీ సినిమా విషయానికి వస్తే.. ఎలాంటి కొత్తదనం లేని క్రైమ్, యాక్షన్ మూవీ. కథపరంగా, స్క్రీన్ ప్లే పరంగా పరమ రొటీన్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో రక్తాన్ని వరదలా పారించాడు. అవసరం లేకున్నా అతిగా క్రైమ్ సీన్లను బలవంతంగా రుద్దే ప్రయత్నం కనిపిస్తుంది. వర్మ బ్రాండ్ గురించి మాట్లాడుకొంటే.. ఆయన కెరీర్ వచ్చిన మరో నాసిరకమైన సినిమా. థియేటర్‌కు పరిగెత్తుకొంటూ చూడాల్సిన అంశాలు ఏమీ లేవు. ఓటీటీ వరకు వెయిట్ చేయండి. అప్పుడు ఈ సినిమా ఏంటో మీకు అర్ధమవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X