Saaree Twitter Review : శారీ మూవీ ట్విట్టర్ రివ్యూ .. రామ్ గోపాల్ వర్మ హిట్ కొట్టారా?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో తెరకెక్కిన మూవీ శారీ. కోలీవుడ్ భామ ఆరాధ్య దేవి లీడ్ రోల్ పోషించగా గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు. ఆర్జీవీ స్వయంగా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఆరాధ్య అందాల ఆరబోత, ఫోటోలు, టీజర్, ట్రైలర్‌లతో మంచి హైప్ తెచ్చుకుంది ఈ సినిమా. సత్య యదు, సాహిల్ సంభ్యాల్, అప్పాజీ అంబరీష్, కల్పలతలు కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 4వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ సైకో కిల్లర్ చేసిన హత్యలు, నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రీమియర్ షో తర్వాత ఈ సినిమా గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో వెల్లడించిన రివ్యూలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే?

రామ్ గోపాల్ వర్మ కథ , స్క్రీన్ ప్లే అందించగా గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో తెరకెక్కిన శారీ సినిమాకు పబ్లిసిటీ డిజైనర్‌గా పనిచేయడం థ్రిల్లింగ్‌గా అనిపించిందని కృష్ణ కార్తీక్ ట్వీట్ చేశారు. క్రియేటివ్ సైకో నుంచి శారీ చిత్ర యూనిట్‌కు, మై బాస్ ఆర్జీవీకి బిగ్ థ్యాంక్స్ అని కార్తీక్ పోస్ట్ చేశారు.
ఇప్పుడే శారీ మూవీ చూసేందుకు థియేటర్‌లో కూర్చొన్నానని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. లాగే టైటిల్ కార్డ్స్, ఆరాధ్య దేవి ఫోటోలు స్క్రీన్‌పై ఉండగా ఆ పిక్ షేర్ చేశాడు.
భయం, ప్రమాదం.. శారీ చిత్రం మీకు వెన్నులో వణుకు పుట్టించే ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ అని ఓ యూజర్ పోస్ట్ పెట్టాడు. మీ టికెట్లను ఇప్పుడే బుక్ చేసుకుని ఆ బీభత్సాన్ని వీక్షించండి అంటూ అతను ఆ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
సోషల్ మీడియా మిమ్మల్ని భయంకరమైన దానిలోకి లాగితే ఏం చేయాలి అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచే థ్రిల్లర్ తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో విడుదలవుతోందని రాసుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











