Sabari Movie Review అమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్ మెప్పించిందా? శబరి మూవీ ఎలా ఉందంటే?

Rating: 2.75/5

నటీనటులు: వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్ కాట్జ్
నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల,
మ్యూజిక్: గోపి సుందర్
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి ,
రచనా సహకారం: సన్నీ నాగబాబు,
పాటలు: రహమాన్, మిట్టపల్లి సురేందర్
సమర్పణ: మహర్షి కూండ్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల
రిలీజ్ డేట్: 2024-05-03

సంజన (వరలక్ష్మీ శరత్ కుమార్) తన తల్లిదండ్రులను ఎదురించి అరవింద్ (గణేష్ వెంట్రామన్)ను వివాహం చేసుకొంటుంది. వారిద్దరికి రియా (బేబీ నివేక్ష) పుట్టిన తర్వాత విడిపోతారు. అయితే రియాను. సంజనను చంపడానికి సూర్య (మైమ్ గోపి) ప్రయత్నిస్తుంటాడు. అయితే భర్త అరవింద్ నుంచి విడిపోయిన తర్వాత తన పాపను రక్షించుకోవడానికి తన స్నేహితుడు లాయర్ రాహుల్ (శశాంక్) సహాయం తీసుకొంటుంది.

Sabari Telugu Movie Review  Varalaxmi Sarathkumar pulls off with her performance

ప్రేమించి పెళ్లి చేసుకొన్న అరవింద్‌ నుంచి సంజన ఎందుకు విడిపోయింది? కూతురు విషయంలో వారిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరిగింది? సంజనను సూర్య ఎందుకు టార్గెట్ చేస్తాడు? సంజనకు ఉన్న మెంటల్ డిజార్డర్ ఏమిటి? తనకు ఉన్న మానసిక లోపం వల్ల ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టాయి? సూర్య నుంచి రియాను, తనను ఎలా కాపాడుకొన్నది? అరవింద్‌తో బంధానికి ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే శబరి సినిమా కథ.

దర్శకుడు అనిల్ కాట్జ్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కానీ కథలో రకరకాల లోపాలు, ఫస్టాఫ్‌లో స్క్రీన్ ప్లే పరంగా కొన్ని సమస్యలు ఉండటం వల్ల మొదటి భాగం కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్‌కు ముందు 15 నిమిషాల ముందు ఓ ట్విస్టుతో కథ మరో జోన్‌లోకి వెళ్తుంది. సెకండాఫ్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమింట్స్ కథపై ఆసక్తిని పెంచుతాయి. అయితే కథను డిఫరెంట్‌గా చెప్పడానికి స్కోప్ ఉన్నప్పటికీ.. ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదనే స్పష్టంగా కనిపిస్తుంది.

Sabari Telugu Movie Review  Varalaxmi Sarathkumar pulls off with her performance

ఇక యాంగ్రీ యంగ్ ఉమెన్ పాత్రలతో ఆకట్టుకొంటున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. తనకు ఉన్న ఇమేజ్‌ నుంచి పక్కకు వచ్చి.. పూర్తిగా ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న సినిమాను చేసిందనే చెప్పాలి. సినిమా భారాన్ని మొత్తంగా తన భుజాలపై నడిపించగల సత్తా ఉందని ఈ సినిమాతో ఆమె చెప్పకనే చెప్పింది. శబరి అంటే మాతృత్వం.. ఆ లాంటి మంచి భావన ఉన్న పాత్రలో ఒదిగిపోయింది. కథలో వేరియేషన్స్ లేకపోవడం వల్ల తన పాత్ర పరిధి మేరకు పూర్తిగా న్యాయం చేసింది.

మిగితా పాత్రల విషయానికి వస్తే.. గణేష్ వెంకట్రామన్ గెస్టుగానే కనిపిస్తారు. కానీ పాత్ర మాత్రం కథకు బలంగా ఉండేదనే చెప్పాలి. ఇక మైమ్ గోపి నెగిటివ్ షేడ్‌లో ఆకట్టుకొన్నారు. మధు నందన్, సునయన, బేబీ నివేక్ష తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు.

Sabari Telugu Movie Review  Varalaxmi Sarathkumar pulls off with her performance

ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫస్టాప్‌లో కొన్ని సీన్లపై కత్తెర పడి ఉంటే.. ఇంకా బెటర్ ఫీలింగ్ క్రియేట్ అయి ఉండేదనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ ప్లస్ పాయింట్స్. ఇండస్ట్రీకి కొత్తగా పరిచయమైనప్పటికీ. నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే.. ఇంకా బెటర్‌గా ఉండేదనిపిస్తుంది.

మదర్ సెంటిమెంట్‌తో సాగే.. సైకాలజికల్ థ్రిల్లర్ శబరి. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమా ప్లస్ అయితే.. కథలో వేరియేషన్ లేకపోవడం.. ఒకే పాయింట్‌ మీద సినిమా సాగడం వల్ల కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపించదు. కానీ చాలా సన్నివేశాల్లో ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. వరలక్ష్మీ శరత్ కుమార్ అభిమానులు, ఆమె నటనను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X