Sabdham Movie Review: శబ్దం మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మూవీ: శబ్దం (Sabdham)
నటీనటులు: ఆది, లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా, రెడిన్ కింగ్‌స్లే, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మీనన్, వివేక్ ప్రసన్న తదితరులు
దర్శకత్వం: అరివాల్గన్
నిర్మాత: 7జీ శివ
సహ నిర్మాత: ఎస్ భానుప్రియ శివ
మ్యూజిక్: థమన్ ఎస్
ఎడిటర్: సాబు జోసెఫ్ వీజే
సినిమాటోగ్రఫి: అరుణ్ బ్రహ్మనాభన్
ఆర్ట్ డైరెక్టర్: మనోజ్ కుమార్
స్టంట్స్: స్టన్నర్ సామ్
లిరిక్స్: వివేకా
బ్యానర్: 7G ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2025-02-28
ఓ కాలేజీలో వరుస ఆత్మహత్యలు, మరణాలు, అదృశ్యాలు జరుగుతుంటాయి. శృతి అనే స్టూడెంట్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తుంది. అనుమానాస్పద మరణాల వెనుక గుట్టు విప్పడానికి ఘోస్ట్ హంటర్ (Para Normal Investigator) వ్యూమా వైద్యలింగ అలియాస్ వైద్య లింగం ఆ కాలేజీలో అడుగుపెడుతాడు. ఆ కాలేజీలో లెక్చరర్ అవంతిక (లక్ష్మీ మీనన్) కదలికలు అనుమానాస్పదంగా ఉంటాయి. వైద్యలింగం పరిశోధనలో డయానా (సిమ్రాన్) గురించిన ఎమోషనల్ విషయాలు తెలుస్తాయి.

కాలేజీలో మరణాలకు గబ్బిలాల శబ్దానికి సంబంధం ఏమిటి? అవంతిక ఎందుకు అనుమానాస్పద బిహేవియర్‌తో కనిపిస్తుంది? వైద్యలింగం ఇన్వెస్టిగేషన్‌కు ఎలాంటి అడ్డంకులు, సమస్యలు ఎదురయ్యాయి? కాలేజీలో మరణాలకు కారణం ఏమిటి? కాలేజీలో మెడికల్ సైంటిస్ట్ (లైలా)కు ఈ మరణాలకు ఏమైనా సంబంధం ఉందా? ఈ మరణాల వెనుక గుట్టును వైద్యలింగం ఎలా విప్పాడు? మరణాలకు కారణమైన వారికి ఎలాంటి శిక్ష పడిందనే ప్రశ్నలకు సమాధానమే శబ్దం సినిమా కథ.
వైశాలి సినిమాతో ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకొన్న దర్శకుడు అరివాల్గన్ మరోసారి డిఫరెంట్ ఫాయింట్‌తో కథను ఎంచుకోన్నారు. స్టోరి పాయింట్‌ను బ్రిల్లియెంట్ టెక్నికల్ అంశాలతో గ్రిప్పింగ్‌గా కథను చెప్పేందుకు ప్రయత్నించిన తీరు బాగుంది. కాకపోతే కథను, కథలోని అంశాలు సరళీకృతం చేసి.. సాధారణ ఆడియెన్స్‌కు అర్ధమయ్యేలా చెప్పి ఉంటే కథ మరింత ఎమోషనల్‌గా, సినిమాకు ఎక్కువ కనెక్టివిటీగా ఉండేదనిపిస్తుంది. ఫస్టాఫ్‌ను చాలా గ్రిప్పింగ్‌గా చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా బాగుండటమే కాకుండా ఆడియెన్స్‌ను థ్రిల్లింగ్‌కు గురి చేస్తుంది.
సెకండాఫ్ విషయానికి వస్తే.. భావోద్వేగంగా సాగుతుంది. ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ స్టోరీలో పాత్రలను జొప్పించిన విధానం, ఆ పాత్రల డిజైన్ బాగుంది. ఆది పినిశెట్టి, సిమ్రాన్, లైలా పాత్రలను తీర్చి దిద్దిన విధానం బాగుంది. కానీ సెకండాఫ్‌లో కొంత పార్ట్ సాగదీసినట్టుగా ఉంటుంది. కథా స్వభావరీత్యా, టెక్నికల్ వాల్యూస్‌తో ఆడియెన్స్‌ను థ్రిల్లింగ్ చేయడానికి చేసిన ప్రయత్నం వల్ల అలాంటి ల్యాగ్ అనిపిస్తుంది. హైలీ టెక్నికల్, సైంటిఫిక్ జోనర్ కాన్సెప్ట్‌ను దర్శకుడు సులభంగా చెప్పి ఉంటే బాగుండేదనిపిస్తుంది.
ఘోస్ట్ హంటర్‌గా వైద్యలింగం పాత్రలో ఆది పినిశెట్టి చక్కగా ఒదిగిపోయాడు. స్టైలిష్ లుక్, పాత్రకు తగినట్టుగా బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నారు. కీలక సన్నివేశాల్లో హావభావాలను అద్బుతంగా పలికించాడు. గత సినిమాలతో పోల్చితే ఆది మరింత మెచ్యురిటీతో సినిమాను తన భుజాన మోశారు. ఇక డయానాగా సిమ్రాన్ మరోసారి భావోద్వేగమైన పాత్రలో కనిపించడమే కాకుండా మెప్పించారు. తన పాత్ర చుట్టు తిరిగే కథను ఆదితోపాటు ఆమె కూడా మోశారు. ఇక లైలా క్యారెక్టర్ స్పెషల్ ఎట్రాక్షన్. సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో ఆమె నటించిన విధానం, పెర్ఫార్మ్ చేసిన విధానం ఈ సినిమాకు హైలెట్‌గా మారింది. సీరియస్ సన్నివేశాలను కూడా రెడిన్ కింగ్ స్లే తన కామెడీతో ఫీల్‌గుడ్‌గా మార్చారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమా యాక్టర్ల ఫెర్ఫార్మెన్స్‌ను కూడా టెక్నికల్ అంశాలు డామినేట్ చేశాయనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ బ్రిల్లియెంట్‌గా ఉండటమే కాకుండా ప్రతీ సన్నివేశానికి ప్రాణం పోసిందా? అనిపించేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించారు. కొన్ని సన్నివేశాలకు తమన్ అందించిన బీజీఎం కేక పెట్టించిందనే చెప్పాలి. తమన్ చేసిన సౌండింగ్ అదరగొట్టిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఈ సినిమా ఆర్ట్ విభాగం పనితీరు అద్బుతంగా ఉంది. ఆర్ట్ వర్క్ చాలా క్లాసీగా ఉండటంతో సినిమాటోగ్రాఫర్ తన కెమెరాకు మరింత పని చెప్పాడు. ప్రతీ సన్నివేశాన్ని హాలీవుడ్ స్టాయిలో పిక్చరైజ్ చేసిన ఫీలింగ్ కల్పించాడు. 7జీ ఫిల్మ్స్ అనుసరించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. 7జీ శివ, ఎస్ భానుప్రియ శివ ఖర్చుకు వెనుకాడకుండా క్వాలిటీతో సినిమాను అందించారు.
హారర్, హ్యుమన్ ఎమోషన్స్ అంశాలను కలిపి మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్‌తో రూపొందించిన సూపర్ నేచురల్ మూవీ శబ్దం. టెక్నికల్‌గా బ్రిల్లియెంట్‌గా కనిపిస్తుంది. కంటెంట్ పరంగా కొంత మేరకు వీక్‌గా అనిపిస్తుంది. ఈ సినిమా కంటెంట్ క్లాస్, ఎడ్యుకేటేడ్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. బీ,సీ సెంటర్ల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అయితే మంచి ఫలితాన్ని, విజయాన్ని అందుకొనే అవకాశం ఉంది. తమన్ బీజీఎం, అరుణ్ బ్రహ్మనాభన్, మనోజ్ కుమార్ ఆర్ట్ వర్క్ ఈ సినిమాను రిచ్‌గా, ఆడియెన్స్ ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి. హారర్, థ్రిల్లర్, సూపర్ నేచురల్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ వారం హారర్, థ్రిల్లర్ జోనర్ ఫ్యాన్స్‌కు శబ్దం కేరాఫ్ అడ్రస్.


Click it and Unblock the Notifications











