సదా మీసేవలో... నవ్వాలో ఏడ్వాలో

By Staff

Sadaa mee seevaloo
-జోశ్యుల సూర్యప్రకాష్‌
సినిమా: సదా మీ సేవలో
నటీనటులు: వేణు, శ్రీయ, మల్లిఖార్జునరావు, సునీల్‌,
నూతన్‌ ప్రసాద్‌, విజయ్‌చందర్‌, సుబ్బరాజు,
అనంత్‌, శకుంతల, రజిత తదితరులు
కెమెరా: కె. ప్రసాద్‌
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌
పాటలు: సిరివెన్నెల, చైతన్యప్రసాద్‌, కందికొండ
కళ: కెవి రమణ
నృత్యాలు: స్వర్ణ
నిర్మాత: వెంకట శ్యామ్‌ ప్రసాద్‌
కథ-మాటలు- స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: నీలకంఠ

షో, మిస్సమ్మ చిత్రాలకు గాను ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డు పొందిన దర్శకుడు నీలకంఠ వేణు హీరోగా 'సదా మీసేవలో' చిత్రం తీశారు. సమాజ సేవ ముఖ్యమా? కుటుంబ అనుబంధం ముఖ్యమా? అనే విశ్లేషణతో సా...గి...న... సినిమా ఇది. సమాజ హితానికి అంకితమైన తిలక్‌ అనే యువకుడు కథ ఇది. తాతగారి స్ఫూర్తితో హీరో 'సదా మీ సేవలో' అనే లీగల్‌ కన్సల్టెన్సీ ప్రారంభిస్తాడు. అతనికి తోడు లాయర్‌గా సునీల్‌, రిటైర్డ్‌ కానిస్టేబుల్‌గా మల్లిఖార్జునరావు ఉంటారు. సూర్యకాంతం (శ్రీయ) అనే ఆధునిక భావాలు గల యువతితో అతనికి పెళ్ళవుతుంది. శోభనం రోజు హీరోను పోలీసులు పట్టుకెళతారు. అతని కన్సల్టెన్సీకి సంబంధించిన కేసు అది. మరో రోజు రిసెప్షన్‌ పెట్టుకుంటే మరో కేసు గొడవ పీకల వరకు వస్తుంది. ప్రశాంతంగా బతకాలనుకున్న శ్రీయకు ఇవి ఇష్టం ఉండవు. లీగల్‌ కన్సల్టెన్సీను మూసుకోమంటుంది. సదా ఎవరి సేవలో ఉండాలో వేణు నిర్ణయించుకుంటాడో తెర మీద చూడాల్సిందే.

ఈ సినిమా ద్వారా సందేశాన్ని ఇద్దామనుకున్న దర్శకుడు అయోమయంలో పడినట్టు అన్పిస్తుంది. 'మిస్సమ్మ' చిత్రంలో లాగానే ఒక క్యారక్టర్‌నే హైలైట్‌ చేయడం వల్ల మిగితా పాత్రల ప్రాధాన్యం తగ్గించేశారు. పాత్రల మధ్య సంఘర్షణ లేకపోవడం సినిమాలోని పెద్ద లోపం. సినిమా స్క్రీన్‌ప్లేకి అతి ముఖ్యమైన 'ఏకతా సూత్రం'ను ఈ సినిమాలో పాటించలేదు. స్క్రీన్‌ప్లే రహస్యాలు తెలిసిన నీలకంఠ యాక్ట్‌త్రీని గంద్రగోళం చేసి సినిమాను చావు దెబ్బకొట్టాడు. కామెడీకి ప్రత్యేక ట్రాక్‌ పెట్టడం నీలకంఠ చేయాల్సిన పనికాదు.

థట్స్‌ తెలుగు రిమార్క్‌: ఈ సినిమాను కొన్ని నెలల తర్వాత హాయిగా టీవీలో చూసుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X