twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sadha Nannu Nadipe review .. ఆకట్టుకొనే ఎమోషనల్.. లవ్ స్టోరి

    |

    నటీనటులు: ప్రతీక్ ప్రేమ్ క‌ర‌ణ్, వైష్ణవి పట్వర్ధన్, నాగేంద్రబాబు, డిఆర్. శేఖర్, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ, మహేష్ అచంట, సుదర్శన్, నవీన్ తదితరులు
    ద‌ర్శ‌క‌త్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం: ప్రతీక్ ప్రేమ్ క‌ర‌ణ్
    సినిమాటోగ్రఫి: ఎస్‌డీ జాన్ ఆహ్మద్
    ఎడిటర్: ఎస్ఆర్ శేఖర్
    ఫైట్స్: నందు మాస్టర్
    ఆర్ట్: గోవింద్
    బ్యానర్: రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్
    రిలీజ్: 2022-06-24

    Sadha Nannu Nadipe movie review and rating

    స్నేహితులతో సరదాగా జీవితాన్ని ఆస్వాదించే MJ అలియాస్ మైఖేల్ జాక్సన్ (ప్రతీక్ ప్రేమ్ కరణ్) సాహా (వైష్ణవి పట్వర్ధన్)తో ప్రేమలో పడుతాడు. సాహా తండ్రి (రాజీవ్ కనకాల) ఎంజే ప్రేమను రిజెక్ట్ చేసినా వెంటపడి సిన్సియర్‌గా ప్రేమిస్తాడు. చివరకు మైఖేల్ జాక్సన్ ప్రేమను అంగీకరించి.. సాహా పెళ్లి చేసుకొంటుంది. అయితే పెళ్లి తర్వాత భర్తను సాహా దూరంగా పెడుతుంది.

    ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన భర్తను సాహా ఎందుకు దూరం పెట్టింది? భర్తకు సాహా దూరంగా ఉండాలని అనుకోవడం వెనుక కారణం ఏమిటి? సాహ తనను దూరం పెట్టడంతో ఎంజే ఏం చేశాడు? తమ దాంపత్య జీవితంలో ఏర్పడిన సమస్యను సాహా, ఎంజే ఎలా పరిష్కరించుకొన్నారు. చివరికి సాహా, ఎంజే బంధానికి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే సదా నన్ను నడిపే సినిమా కథ.

    బహుముఖ ప్రతిభావంతుడైన ప్రతీక్ ప్రేమ్ కరణ్ దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, హీరోగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని రచయితగా రాసుకొన్న కథను ఫీల్‌గుడ్‌గా తెరకెక్కించడంలో ప్రతీక్ సఫలమయ్యాడు. బలమైన సన్నివేశాలతో ఎమోషన్స్ పర్‌ఫెక్ట్‌గా పండించాడు. బలమైన కథ, కథనాలు ప్రేక్షకుడి ఎంగేజ్‌ చేసేలా ఉండటం సినిమాకు పాజిటివ్ పాయింట్ అని చెప్పవచ్చు. ప్రతీక్ దర్శకత్వ ప్రతిభ కూడా అభినందనీయం.

    నటుడిగా ప్రతీక్ తన పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్లు, యాక్షన్ సన్నివేశాల్లో ఫెర్ఫార్మెన్స్ బాగుంది. సాహాగా వైష్ణవి పట్వర్ధన్ గ్లామర్ పరంగా, ఫెర్ఫార్మెన్స్ పరంగా మెప్పించింది. అందంతో అలరించడంతోనే కాకుండా తన పాత్రకు సంబంధించిన మరో కోణంలో సానుభూతిని కూడా రాబట్టింది. రాజీవ్ కనకాల ఎమోషనల్‌ పాత్రతో మంచి మార్కులే కొట్టేశాడు. లవ్ స్టోరి తర్వాత రాజీవ్ మరో గుర్తుండి పాత్రలో కనిపించారు. నాగబాబు, ఆలీ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

    ప్రతీక్ ప్రేమ్ కరణ్ నటుడిగా, దర్శకుడినే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా తన మార్కును చూపించాడు. అందమైన బాణీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌, కొడైకెనాల్‌, కులుమ‌నాలి తదితర ప్రాంతాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాను రిచ్‌గా మార్చాయి. ఆర్ఎస్ శేఖర్ ఎడిటింగ్ ఫర్‌ఫెక్ట్‌గా ఉంది. ఎమోషన్స్ క్యారీ చేయడంలో ఎడిటర్ తన ప్రతిభను చాటుకొన్నారు. ఎస్‌డీ జాన్ ఆహ్మద్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

    స్వచ్ఛమైన, నిస్వార్దమైన ప్రేమకథగా సదా నన్ను నడిపే చిత్రం తెరకెక్కింది. కథ, కథనాల పరంగా మరింత శ్రద్దపెట్టి ఉంటే.. గీతాంజలి తరహా చిత్రంగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకొనే అవకాశం ఉండేది. ఇటీవల వచ్చిన ప్రేమకథల్లో నిజాయితీగా చేసిన అంటెంప్ట్ అనిపిస్తుంది. ప్రేమకథలను ఆదరించే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

    English summary
    Sadha Nannu Nadipe movie hits the theatres on June 24th. Here is the review and rating from Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X