Sagileti katha Review రాయలసీమ నేటివిటితో.. సగిలేటి కథ మూవీ ఎలా ఉందంటే?

Rating:
2.5/5

నటీనటులు: రవి మహాదాస్యం, విషికా కోట, నరసింహ ప్రసాద్ పంతగగాని, రాజశేఖర్ అనింగి, రమని, రమేష్, సుదర్శన్, సాయిమోహన్, శ్రీ రమణి తదితరులు
సినిమాటోగ్రఫి, ఎడిటర్, రచయిత, దర్శకత్వం: రాజశేఖర్ సుడ్మూన్
సమర్పణ: నవదీప్
నిర్మాత: అశోక్ మిట్టపల్లి, దేవీ ప్రసాద్ బలివాడ
బ్యానర్: అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్‌టైన్‌మెంట్, సీ స్పేస్
రిలీజ్ డేట్: 2023-10-13

రాయలసీమలోని ఓ గ్రామంలో వర్షాలు పడకపోవడంతో పంటలు పండక ప్రజలు కష్టాల్లో పడిపోతారు. అయితే ఊరిలోని గంగాలమ్మ జాతర జరపకపోవడమే అందుకు కారణమని గ్రామస్థులు భావిస్తారు. ఇదిలా ఉండగా, గ్రామపెద్ద చౌడప్ప (రాజశేఖర్ అనింగి) కొడుకు గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ దొరస్వామి కూతురు కష్ణమ్మ (విషికా కోట) ప్రేమించుకొంటారు. అయితే కృష్ణమ్మ తండ్రి దొరస్వామి అనూహ్యంగా హత్యకు గురవుతాడు. దాంతో వారి ప్రేమకు తండ్రి హత్య అడ్డంకిగా మారుతుంది.

Sagileti Katha Telugu Movie Review

గంగాలమ్మ జాతర విషయంలో ఊరి పెద్దల మధ్య ఎలాంటి వైరం సృష్టించింది? కృష్ణమ్మను ఎలాంటి పరిస్థితుల్లో చూసి కుమార్ ప్రేమలో పడ్డాడు? తన తండ్రి దొరస్వామి హత్య తర్వాత కుమార్‌కు పెట్టిన కండీషన్లు ఏంటి? పెళ్లికి ముందు కుమార్‌కు ఎందుకు కండిషన్లు పెట్టింది? గ్రామంలో జరిగే సంఘటనల్లో రోషం రాజు (నరసింహ ప్రసాద్) పాత్ర ఏమిటి? చికెన్ కూర తినడానికి రోషం రాజు పడిన అవస్థలు ఏమిటి? చివరకు గంగాలమ్మ జాతర జరిగిందా? కృష్ణమ్మ పెట్టిన షరతులను కుమార్ అంగీకరించాడా? కృష్ణమ్మ, కుమార్ పెళ్లి చేసుకొన్నారా? అనే ప్రశ్నలకు సమాధానమే సగిలేటి కథ సినిమా స్టోరి.

సాధారణంగా గ్రామాల్లో ఉంటే వాతావరణం, గ్రూపుల మధ్య ఉండే అధిపత్య పోరాటం లాంటి అంశాలతో రాయలసీమ నేటివిటి టచ్‌తో సినిమా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఏదో రూరల్ నేటివిటి చూడబోతున్నామనే ఫీలింగ్ సెట్ అవుతుంది. కానీ కథ, కథనాలు, పాత్రల డిజైన్ విషయంలో దర్శకుడు తడబాటుకు గురయ్యారనేది తొందర్లోనే అర్ధమవుతుంది. ఈ సినిమాలో పాత్రల డిజైన్ బాగుంది. ఆ పాత్రల మధ్య ఉండే కెమిస్ట్రీ, భావోద్వేగాలను దర్శకుడు కనెక్ట్ చేసి ఉంటే డెఫినెట్‌గా మంచి నెటివిటితో కూడిన ప్రేమకథను చూసిన ఫీలింగ్ అవుతుంది.

Sagileti Katha Movie Review

సెకండాఫ్‌లోనే కథ వేగంగా సాగుతుందని భావించిన ప్రేక్షకులకు రొటీన్, రెగ్యులర్ అంశాలు రిపీట్ అవ్వడం కొంత నిరాశకు గురిచేస్తుంది. సినిమా మొత్తంలో పాత్రలు మూవ్ అవుతుంటాయి. కానీ కథ కదలడం కనిపించదు. అక్కడక్కడ కొన్ని మంచి సీన్లు ఉన్నప్పటికీ.. కథ మాత్రం సాదాసీగా అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులతో దర్శకుడు తన ప్రతిభకు సాన పెట్టి ఫర్వాలేదనిపించే పరిస్థితిని కల్పించాడని చెప్పవచ్చు.

సగిలేటి మూవీలో పాత్రల్లో డెప్త్ కనిపిస్తుంది. కానీ కథను ఎలివేట్ చేసి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌ను క్రియేట్ చేయడంలో గాడి తప్పిన ఫీలింగ్ కలుగుతుంది. నూతన నటీనటులైనప్పటికీ.. ప్రతీ ఒక్కరు మంచి ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాను నిలబెట్టాలనే తపన, నిజాయితీ కనిపిస్తుంది. రవి మహాదాస్యం, విషికా కోట ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. విషికా శెట్టి గ్లామర్ పరంగానే కాకుండా ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొన్నదని చెప్పవచ్చు. రోషమ్ రాజు క్యారెక్టర్‌ బాగుంది కానీ.. కథతోపాటు బలంగా ట్రావెల్ అయితే బాగుండేదనిపిస్తుంది. రోషమ్ రాజు తనదైన కామెడీతో ఆకట్టుకొన్నాడు. రాజశేఖర్ అనింగి భారమైన పాత్రతో తన ప్రతిభను నిరూపించుకొనే ప్రయత్నం చేశారు. రమణి, రమేష్, సుదర్శన్, సాయి మోహన్, శ్రీమణి‌తోపాటు మిగితా వారందరూ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

Sagileti-Katha

దర్శకుడు రాజశేఖర్ మల్టీ టాస్కింగ్ చేసిన తీరు బాగుంది. ఎడిటర్‌గా, రచయితగా, సినిమాటోగ్రాఫర్‌గా తన పాత్రను సమర్ధవంతంగా పోషించాడు. కథ, కథనాలపై మరింత దృష్టి పెట్టి ఉండాల్సింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథ, సన్నివేశాలను ఎలివేట్ చేసేందుకు దోహదపడింది. రాయలసీమ గ్రామీణ వాతావారణాన్ని రాజశేఖర్ చక్కగా చిత్రీకరించారు. అశోక్, దేవీ ప్రసాద్ నిర్మాతలుగా అనుసరించిన విలువలు బాగున్నాయి.

తెలుగు సినిమా పరిశ్రమలో పల్లె వాతావరణంతో వచ్చే కథలు ప్రేక్షకులపై బలంగా ముద్ర వేస్తాయి. ఈ సినిమాలో కథ, కథనాలను సరిగా వర్కవుట్ చేసి ఉంటే సగిలేటి కథ ఫీల్‌గుడ్ నేటివిటీ మూవీ అయి ఉండేది. ఇంకా భారమైన పాత్రలను సీనియర్ నటులతో చేసి ఉంటే ఇంకాస్త బెటర్ అవుట్‌పుట్, ఫీల్ వచ్చి ఉండేదనిపిస్తుంది. ప్రేక్షకులకు సరిగా పరిచయం లేని నూతన నటీనటులు భారమైన పాత్రలను మోయలేకపోయారనేది తెర మీద కనిపిస్తుంది. ఓవరాల్‌గా కొత్త నటీనటులతో ఫీల్‌తో ఉండే సినిమాను చూపిద్దామని చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. అంచనాలు లేకుండా రూరల్ నేటివిటి సినిమాలను ఇష్టపడే వారికి నచ్చే అవకాశం ఉంది. మీకు సగిలేటి కథను చూడాలనుకొంటే థియేటర్లకు వెళ్లి కొత్త అనుభూతిని పొందండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X