మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ శైలజా కృష్ణమూర్తి

By Staff

{image-18-mr&mrs.jpg telugu.filmibeat.com}-సూర్యప్రకాష్‌.జె
చిత్రం: మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ శైలజా కృష్ణమూర్తి
నటీనటులు: లైలా, శివాజీ, బ్రహ్మానందం, ధర్మవర్పు సుబ్రమణ్యం,
గిరిబాబు, ఎల్బీ శ్రీరాం...
సంగీతం: రోహిత్‌ రాజా
దర్శకత్వం: శివ నాగేశ్వరరావు
నిర్మాత: అట్లూరి పూర్ణచంద్రరావు

ఈ సినిమా పదేళ్ళ క్రితం విడుదలై ఉంటే హిట్‌ అయ్యేది. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అయ్యర్‌ సినిమాలోని స్టోరీ లైన్‌ను కొద్దిగా తీసుకుని 'ఒకరికొకరు' లోని కథనానిని కలిపి 'మనసంతా నువ్వే' ను నావెల్టీకి కలిపితే మన శైలజా కృష్ణమూర్తి సాక్షాత్కరిస్తారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనేది హీరో ఆదర్శంగా ప్రారంభమైన ఈ సినిమాలో హీరో ఏ దశలోనూ ఏ విషయంలోనూ కృషి చేయకపోవడం విశేషం. కష్టపడకుండానే ప్రేమను సాధించుకుంటాడు. అతని కోసం అన్ని దశల్లోనూ మిగితా క్యారెక్టర్లంతా పనులు మానుకుని కష్టపడతారు.

కథ:

హైదరాబాద్‌లో ఉండే కృష్ణమూర్తి ఎన్నో ఇంటర్వ్యూలను ఎదుర్కొని విసిగి వేసారిన దశలో జెమిని ఛానల్‌ వారు ఇంటర్వ్యూ చేయకుండానే మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ గా ఎంపికచేసుకుంటారు. ఇదంతా దేవుడి మహిమేనని అతని పిన్ని నమ్మి నాస్తికుడైన కృష్ణమూర్తిని అన్నవరం తరుముతుంది. ఆ రైలు ప్రయాణంలో సీటు షేర్‌ చేసుకున్న శైలజ పరిచయం అవుతుంది. ఆమెకు దైవ భక్తి ఉంటుంది. అన్నవరంలో ఒక్కరికే కాటేజి ఇవ్వరని మిస్టర్‌ అండ్‌ మిసెస్‌గా రిజిస్టర్‌లో కమిట్‌ అవుతారు. దానిని గుర్తించిన స్ధానిక గైడ్‌(కృష్ణ భగవాన్‌) బ్లాక్‌ మెయిల్‌ చేసి ఏడిపిస్తాడు. దీనితో వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగి నిజంగా ప్రేమలో పడతారు. మరికొందరు భక్తులు కూడా కొత్త దంపతులుగా వీరిని గుర్తించడంతో ఇంటర్వెల్‌ వస్తుంది. వారి ప్రయాణం ప్రేమయాత్రగా మారుతుంది. అడ్రసులను తీసుకోని వారు ఒకరి కోసం ఒకరు అన్వేషణలో పడతారు.

దట్స్‌తెలుగు డాట్‌ కాం రిమార్క్స్‌:

చాలాకాలం తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శివనాగేశ్వరరావు నుంచి ప్రేక్షకులు ఆశించే సస్పెన్స్‌, వినోదం ప్రేక్షకుడికి అందలేదు. టైటిల్‌లో పోయెటిక్‌ టచ్‌ ఉన్నా సినిమాలో ఆ వాతావరణం కన్పించదు. శైలజా కృష్ణమూర్తిని దంపతులు అనుకునే వారెవరూ ఆమె కాళ్ళకు మెట్టెలు, మెడలో మంగళ సూత్రాలు లేవనే విషయం గుర్తించకపోవడం విడ్డూరం.

నలభై ఎపిసోడ్ల వీక్లీ సీరియల్‌ ఎంతకాలం సాగుతుంది? పది నెలలు. శైలజ అమెరికా వెళ్ళడానికి ఆరు నెలలు టైం ఉందంటారు. ఈ లోపు కృష్ణమూర్తి ప్రారంభించిన టెలీ సీరియల్‌ నలభై ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటుంది. ఇది టెక్నికల్‌ మిస్టేక్‌.

సినిమాలో బ్రహ్మానందంను అసలు వాడుకోకపోవడం మరో పెద్ద లోపం. ఏ వర్గం ప్రేక్షకులనూ ఆకట్టుకోని సినిమా ఇది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X