Saindhav Review చైల్డ్ సెంటిమెంట్‌తో సైంధవ్.. వెంకటేష్ ఆల్ రౌండ్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సైంధవ్ సమీక్ష
Rating: 2.75/5
వెంకటేష్, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, శ్రద్దా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జర్మియా, జిషు సేన్ గుప్తా, ముఖేష్ రిషి, జయప్రకాశ్ తదితరులు
రచన, దర్శకత్వం: శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
సినిమాటోగ్రఫి: ఎస్ మణికందన్
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
మ్యూజిక్: సంతోష్ నారాయణన్
బ్యానర్: నిహరక ఎంటర్‌టైన్‌మెంట్స్
రిలీజ్ డేట్: 2024-01-13
డ్రగ్స్, గన్స్ బిజినెస్ మాఫియాలో పనిచేసి బయటకు వచ్చిన సైంధవ్ (వెంకటేష్) ఇంద్రప్రస్థ అనే ప్రాంతంలోని పోర్టులో క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. భార్య చనిపోవడంతో కూతురు గాయత్రిని కంటికి రెప్పలా చూసుకొంటుంటాడు. భర్త నుంచి దూరమైన మనో (శ్రద్దా శ్రీనాథ్) సైంధవ్, గాయత్రికి దగ్గరవుతుంది. ఈ క్రమంలో గాయత్రి స్పైనల్ మస్కులర్ అట్రోపి (SMA) అనే వ్యాధికి గురవుతుంది. ఆ వ్యాధి ట్రీట్‌మెంట్ కోసం 17 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. దాంతో విశ్వామిత్ర( ముఖేష్ రుషి), వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్దిఖీ)ని చంపడానికి మైఖేల్ (జిషు సేన్ గుప్తా) నుంచి కాంట్రాక్టు కుదుర్చుకొంటాడు.

మాఫియా బిజినెస్ నుంచి సైంధవ్ ఎందుకు బయటకు వచ్చాడు? మనో తన భర్త (గెటప్ శ్రీను) నుంచి ఎందుకు దూరంగా ఉంది? సైంధవ్‌కు ఎలా చేరువైంది? కలిసి వ్యాపారం చేసే విశ్వామిత్ర, మైఖేల్, వికాస్ మాలిక్ ఒకరికొకరు ఎందుకు శత్రుత్వం పెంచుకొన్నారు? కూతురు వైద్యం కోసం సైంధవ్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? వికాస్, విశ్వామిత్రను మైఖేల్ చంపాలనుకొన్నాడు? చివరకు కూతురును సైంధవ్ రక్షించుకొన్నాడా? వికాస్, విశ్వామిత్రను మట్టుపెట్టాడా? అనే ప్రశ్నలకు సమాధానమే సైంధవ్ సినిమా.
డ్రగ్స్, గన్, పిల్లలను అక్రమ, సంఘ విద్రోహ చర్యలకు ఉపయోగించుకొనే కథను బ్యాక్ డ్రాప్‌గా చేసుకొని డాటర్ సెంటిమెంట్‌తో శైలేష్ కొలను రాసుకొన్న కథ బాగుంది. ఫస్టాఫ్‌లో అవసరానికి మించి హింసను జొప్పించి.. ఎమోషన్స్ పక్కన పెట్టాడనే ఫీలింగ్ కలుగుతుంది. సైంధవ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసేందుకు అలా వయోలెన్స్‌ను చూపించాడనుకొన్నాడా? అనే విషయాన్ని సరిపెట్టుకొనే విధంగా కూతురుతో బాండింగ్ ఎమోషనల్ చూపించడం కొంత మేరకు బ్యాలెన్స్ చేసే ప్రయత్నం బాగుంది. ఫస్టాఫ్‌లో ఎమోషన్స్, యాక్షన్ పార్ట్‌ను బ్యాలెన్స్ చేసిన విధానం బాగుంది.

ఇక సెకండాఫ్‌కు వస్తే స్పైనల్ మస్కులర్ అట్రోపి వ్యాధికి గురైన 300 మందికిపైగా పిల్లల అంశాన్ని హైలెట్ చేస్తూ కథను నడిపిన విధానం బాగుంది. కానీ చాలా రెగ్యులర్, రొటీన్ డ్రామా డీల్ చేసిన తీరుపై అసంతృప్తి ఉంటుంది. అలాంటి లోపాన్ని సెంటిమెంట్‌తో సవరించే ప్రయత్నం చేయడం పర్వాలేదనిపిస్తుంది. ఇంద్రప్రస్థ పట్టణం చుట్టూ తిరిగే కథపై మరింత వర్క్ చేసి ఉంటే మరింత బాగుండేదనిపిస్తుంది. యాక్షన్ కాస్త తగ్గించి ఎమోషనల్ కంటెంట్‌పై మరింత దృష్టి పెట్టాల్సి ఉందనే ఫీలింగ్ వెంటాడుతుంది.
రానా నాయుడులో మాస్, యాక్షన్ హీరోగా కనిపించిన వెంకటేష్ సైంధవ్ మూవీలో కూడా ఆ తరహా క్యారెక్టర్‌లో కనిపించాడు. నాయుడు క్యారెక్టర్‌కు ఎక్స్‌టెన్షన్‌గా ఉండే క్యారెక్టర్‌తో తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఇంటెన్స్, ఎమోషనల్, యాక్షన్ సీన్లలో కొత్తగా కనిపించాడు. ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందించారనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక శ్రద్దా శ్రీనాథ్ ఎమోషనల్ క్యారెక్టర్‌లో అందం, అభినయంతో ఆకట్టుకొన్నది. ఆమె లుక్, క్యారెక్టర్ తగినట్టుగా చూపించిన యాటిట్యూడ్ బాగుంది. జాస్మిన్ క్యారెక్టర్‌లో అండ్రియా జెరిమియా, డాక్టర్ రేణుగా రుహాని శర్మకు కథకు సపోర్టుగా నిలిచింది.

తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నవాజుద్దీన్ సిద్దిఖి డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, దక్కన్ లాంగ్వేజ్‌తో చెప్పిన డైలాగ్స్ కొత్తగా ఉన్నాయి. ఇప్పటి వరకు చూడని కొత్త నవాజ్‌ను చూసే అవకాశం కలిగింది. ఓ స్టయిల్, స్వాగ్‌తో నవాజ్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన విధానం నచ్చేలా ఉంది. మానస్‌గా ఆర్య, విశ్వామిత్రగా ముఖేష్ రుషి, కస్టమ్స్ ఆఫీసర్‌గా జయప్రకాశ్, గెటప్ శ్రీను తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.
టెక్నికల్ విషయానికి వస్తే.. సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథకు తగినట్టుగా ఉంది. చైల్డ్ సెంటిమెంట్‌తోసాగే పాట బాగుంది. ఇంద్రప్రస్థ యూనివర్స్ డిజైన్ బాగుంది. మణికందన్ సినిమాటోగ్రఫి బాగుంది. వెంకట్ బోయనపల్లి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇతర విభాగాల పనితీరు క్వాలిటీగా ఉంది.

యాక్షన్,చైల్డ్ సెంటిమెంట్, ఫాదర్, డాటర్ బాండింగ్‌తో సాగే చిత్రం సైంధవ్. అయితే యాక్షన్ బ్యాక్ డ్రాప్‌గా కాకుండా డాటర్ సెంటిమెంట్ చుట్టూ కథను డీల్ చేసి ఉంటే ఇంకా బెటర్‌గా ఉండేదనిపిస్తుంది. ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయ్యే ఎమోషన్స్‌ను నమ్ముకోకుండా యాక్షన్‌కు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. యాక్షన్ డ్రామాను, చైల్డ్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే సినిమాలను ఇష్టపడే వారికి సైంధవ్ నచ్చుతుంది. ఆ ఫీల్‌ను పొందాలంటే థియేట్రికల్ వాచ్ వల్లే వీలవుతుంది.


Click it and Unblock the Notifications











