సాయిరాం శంకర్ 'వాడే కావాలి' (రివ్యూ)

By Srikanya
Vaade Kavali
Rating
-జోశ్యుల సూర్య ప్రకాష్
బ్యానర్: సద్గురు సినిమా
నటీనటులు: సాయిరామ్ శంకర్, సుహాని, హేమ, వేణుమాధవ్,
రఘుబాబు, నరేష్, రవి ప్రకాష్, తదితరులు..
కెమెరా: కళ్యాణ సామి
ఎడిటింగ్: కె.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: రఘునాధ్ సోగి, కాసాని వీరేష్ బాబు
కథ,మాటలు: ప్రకాష్.టి
స్క్రీన్ ప్లే,దర్శకత్వం: రాజేంద్ర దర్శన్
రిలీజ్ తేది: డిసెంబర్ 11,2009

ఆపరేషన్ సక్సెస్..పేషెంట్ డెడ్ అన్న పరిస్ధితి వాడే కావాలి ఎదుర్కొంటోంది. ఎప్పుడో రెండున్నర ఏళ్ళ క్రిందట పూర్తయిన ఈ చిత్రం ఇన్నాళ్ళకు రిలీజ్ అవటం ఆనందపరిచే విషయం అయితే రిలీజైన మార్నింగ్ షో కే ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవటం విచారకరం. అలాగే అప్పట్లో రిలీజైన ఉల్లాసంగా..ఉత్సాహంగా(కరుణాకరన్) చిత్రం కథను పూర్తి స్ధాయిలో పోలివుండటం మరో మైనస్. అలా తెలిసున్న కథకు, నీరసమైన స్క్రీన్ ప్లే జతచేసి అంతకన్నా దారుణమైన దర్శకత్వం చేసి వదిలిన ఈ చిత్రం ఏం ఆశించి తీసారో రూపకర్తలుకే తెలియాలి.

డబ్బుండి..భాద్యతలు లేని సరదా కుర్రాడు ఆనంద్ (సాయిరాం శంకర్). లైఫంటే ఎంజాయ్ చేయటమే అని నమ్మిఆచరిస్తూ..పనిలో పనిగా మనస్సుకు నచ్చే అమ్మాయి కోసం వెతుకుతూంటాడు. అఫ్ కోర్స్ అతని తండ్రి ఆనందరావు (నరేష్)కూడా కొడుకు ఎప్పుడన్నా ప్రేమలో పడ్డాను నాన్నా అంటే ఎగిరిగంతేద్దామని ఎదురుచూస్తూంటాడు. ఈ లోగా ఆ ఆనంద క్షణాలు రానే వస్తాయి. వైజాగ్ బీచ్ లో లత (సుహాసి) తారసపడుతుంది. పడిందే తడువుగా మనవాడు ఉత్సాహంగా ఆమె వెనకపడతాడు. ఓ పెళ్లికి వెళ్ళి మాటా మంచి కలుపుతాడు. అయితే ఆమెకు మనసంతా నువ్వే ప్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆమె చిన్నప్పుడు తనకు ఉంగరం ఇచ్చి విడిపోయిన అభిరామ్ కోసం ఎదురుచూస్తూంటుంది. అప్పుడు మన హీరో తెలివితేటలతో ఆ అభిరామ్ ని నేనే అని చెప్పేసి ఆమె చేయి పట్టుకోవాలని చూస్తాడు. అయితే ఈలోగా ఆమెకు అసలు విషయం తెలిసి పోయి అబద్దమాడటమంటే..నాకు అసహ్యం అని విడిపోతుంది. ఇది చాలదన్నట్లు అసలు అభిరామ్ రంగంలోకి దూకేస్తాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో హీరో ఆమెను ఎలా దక్కించుకున్నాడు.అభిరామ్ ఏమయ్యాడు అనేది మిగతా కథ.

తాను ప్రేమించిన అమ్మాయికి ప్రియుడుని వెతకి,సెట్ చేసి పెట్టడమనే కార్యక్రమం రెగ్యులర్ గా మన హీరోలు చాలా కాలంగా చేస్తున్నదే..మనమూ క్రమం తప్పకుండా చూస్తున్నదే. దాంతో కథలో ఏదన్నా ఊహించని ట్విస్టు..లేదా ట్రీట్ మెంట్ కొత్తగా అయినా ఉండాలని కోరుకుంటారు. వాడే కావాలి అటువంటి సెంటిమెంట్స్ ఏమీ పెట్టుకోలేదు. ఆ తరహా ఎలిమెంట్స్ ఏమీ లేకుండా సాదా సీదాగా సాగుతూంటుంది. ఫీల్ అనుకుని వర్కవుట్ చేసిన సీన్స్ మనం ఈ సినిమాకు ఎందుకు వచ్చామో అన్న ఫీల్ ని కలగచేస్తూంటాయి. అలాగే ఫస్టాఫ్ లో హీరోయిన్ జాతక సంభందిత పుస్తకాలు చదవటం, హీరో తండ్రి(నరేష్) కూడా అదే పుస్తకం చదువుతూ పరిచయం కావటం చూసి ముందు ముందు కథలో ఈ జాతకాల అంశంపై ఏదో ఉండే ఉంటుంది అన్న విపరీతమైన ఆసక్తి కలుగుతుంది. అయితే మన ఊహకు అందకుండా దర్శక,రచయితలు అసలు ఆ సీన్స్ గురించి తర్వాత అస్సలు మాట్లాడరు. ఇక కథ ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రాన్ని పోలి ఉన్నా అక్కడ వర్కవుట్ అయింది ఎంటర్టైన్మెంట్..వాడే కావాలి లో మిస్సయింది అదే.

అలాగే సెకెండాఫ్ లో హీరోయిన్ ప్రేమించిన కుర్రాడు పెద్ద బిల్డప్ తో రంగంలోకి దూకుతాడు. అయితే ఆశ్చర్యంగా అస్సలు ఏమీ చేయడు.కథకు సంభందం లేనట్లుగా తన పని తిరుగుతూంటాడు. అయితే హీరోనే అతనితో ఆమెను కలపాలని మలేషియా తీసుకుపోతాడు కదా. పోనీ ఆర్య చిత్రంలోలాగ ఈ జర్నీలో వారిమధ్యన ఏమన్నా కెమిస్ట్రీ వర్కవుట్ చేస్తారని ఆశిస్తాం. అదీ లేదు...ఇన్ని లేదుల మధ్య నాకు నచ్చింది ఒకటే అదే..నవ్వింది మల్లెచెండు పాట రీమిక్స్. చిరంజీవి,రాధిక ఆ రోజుల్లో చేసిన ఆ పాట సంచలనం గుర్తుకు వచ్చింది. ఇక దర్శకత్వ విభాగంలాగానే డైలాగులు డల్ గానే ఉన్నాయి. మిగతా టెక్నికల్ విషయాలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సాయిరామ్ శంకర్ నటన, హీరోయిన్ అందం ఒకేలాగ ఉన్నాయి.రఘుబాబు,వేణుమాధవ్ కామెడీ రిలీజ్ ముందు చుట్టినట్లున్నారు..నవ్విద్దామా..వద్దా అన్నట్లుంది. ఉన్నంతలో ఆలీ..క్యాబ్ డ్రైవర్ గా 'ఆలీ..ఐ యామ్ జాలీ' అంటూ కొద్దిగా కితకితలు పెట్టాడు. అలాగే మరో విషయం ఈ చిత్రానికి ఆర్.పి.పట్నాయిక్ సంగీతం. ఆయన కథ విని ఇలాంటి సినిమాకు ఇంతోటి మ్యూజిక్ చాలు అని ఫిక్సయి ఇచ్చినట్లుగా స్పష్టంగా తెలుస్తూంటుది.

ఫైనల్ గా నేను ఓ పదినిముషాలు సినిమాకు లేటుగా వెళ్ళాను. ఆ సమయమే నాకు సేవ్ అయిన ఫీలింగ్ వచ్చింది. బంపర్ ఆఫర్ రిలీజైన 50 రోజున వచ్చిన ఈ చిత్రం ఆ మాత్రం కూడా ఆడుతుందా అంటే సందేహమే. ఏదైమైనా సాయిరామ్ శంకర్ తనను తాను మార్చుకోవటమే కాక ఎంచుకునే కథల తీరు కూడా మార్చుకోవాల్సి ఉంది. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X