Saiyaara Movie Review: సైయారా హిందీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.5/5

నటీనటులు: ఆహాన్ పాండే, అనీత్ పడ్డా తదితరులు
దర్శకత్వం: మోహిత్ సూరి
నిర్మాత: ఆదిత్య చోప్రా
మ్యూజిక్: ఫాహీమ్ అబ్దుల్లా, తనిష్క్ బాగ్చీ, రిషబ్ కాంత్, అర్సలాన్ నిజామీ,మిథున్ శర్మ, సచతె టాండన్, పరంపర థాకూర్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జాన్ స్టీవార్డ్ ఎడూరి
సినిమాటోగ్రఫి: వికాస్ శివరామన్
ఎడిటింగ్: రోహిత్ మక్వానా, దేవేంద్ర మర్దేశ్వర్
బ్యానర్: యష్ రాజ్ ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2025-07-18

మహేష్ అనే యువకుడిని ప్రేమించి మోసానికి గురైన యువ జర్నలిస్టు, సినీ గేయరచయిత, కవి వాణి బాత్రా (అనీత్ పడ్డా). చాలాకాలం డిప్రెషన్‌లో ఉండి మళ్లీ ఉద్యోగం వేటను కొనసాగిస్తుంటుంది. సంగీత ప్రపంచంలో తనకంటూ తిరుగులేని స్థానం సంపాదించుకోవాలనుకొనే సింగర్, కంపోజర్ క్రిష్ కపూర్ (ఆహాన్ పాండే)కు దూకుడు స్వభావం ఎక్కువ. దేనికి తలవంచడు, రాజీ పడడు. అలాంటి యువకుడిని చూసి మరోసారి ప్రేమలో పడుతుంది. కానీ ఓ మానసిక సమస్య ఆమెను వెంటాడుతుంది. ఆ సమయంలో మాజీ ప్రియుడు మహేష్ ఆమె జీవితంలోకి వస్తాడు.

Saiyaara Hindi Movie Review

వాణి బాత్రాను మహేష్ ఎందుకు మోసగించాడు? డిప్రెషన్ నుంచి బయటపడిన తర్వాత క్రిష్ కపూర్‌తో ఎలా ప్రేమలో పడింది? క్రిష్, వాణి మధ్య ప్రేమ ప్రయాణం ఎలా సాగింది? వాణికి తలెత్తిన మానసిక సమస్య ఏమిటి? ఆ సమస్య వారి ప్రేమపై ఎలాంటి ప్రభావం చూపింది? మహేష్‌‌తో ఉన్న మెమోరీస్‌ వాణిని ఎలా ఉక్కిరి బిక్కిరి చేశాయి? వాణి జీవితంలోకి మహేష్ రావడంతో క్రిష్ పరిస్థితి ఏమిటి? చివరకు వాణి జీవితానికి ఎలాంటి ముగింపు లభించింది? వాణిని క్రిష్ దక్కించుకొనే ప్రయత్నం సక్సెస్ అయ్యిందా? అనే ప్రశ్నలకు సమాధానం సైయారా సినిమా కథ.

దర్శకుడు మోహిత్ సూరికి ప్రేమ కథలతో తెర మీద మ్యాజిక్ చేయడం కొత్తేమీ కాదు. తనకు అత్యంత ఇష్టమైన ప్రేమ కథతోనే సైయారా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇద్దరి ప్రేమ కథ, వారి ప్రయాణంలోకి అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వారు ఎదుర్కొన్న అగ్ని పరీక్ష ఏమిటి? అనే పాయింట్స్‌కు ఫ్యామిలీ ఎమోషన్స్ జొప్పించి ఈసారి కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. పిల్లల కోసం తల్లిదండ్రుల పడే వేదన, పేరెంట్స్ కోసం పిల్లలు పడే తపన లాంటి సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేసేలా తెరకెక్కించారు. ఇలాంటి లవ్ స్టోరి కావాల్సిన మ్యూజిక్, పాటలను మరోసారి చక్కగా జొప్పించారు. అనుక్షణం ఎమోషన్స్‌కు గురి చేసే మంచి ప్రేమ కథ సైయారా.

ప్రేమ కథలకు కొత్త నటీనటులే న్యాయం చేస్తారనేది ఇప్పటి ట్రెండ్ కాదు. గతంలో మరో చరిత్ర నుంచి ఎన్నో ప్రేమ కథలకు నూతన నటీనటులే ప్రాణం పోశారు. అయితే హీరో, హీరోయిన్లు టాలెంటెడ్ అయితేనే పూర్తిగా వర్కవుట్ అవుతుంది. అయితే ఎమోషనల్ లవ్ స్టోరికి ఆహానా పాండే, అనీత పడ్డా ప్రాణం పోశారు. నటనకు కొత్తవారైనా తమ పాత్రల్లో పూర్తిగా జీవించారు. వాణి, క్రిష్ పాత్రలకు వారు తప్పా మరొకరు న్యాయం చేయరేమో అనే ఫీలింగ్‌ను కల్పించారు. బాలీవుడ్‌లో కొత్త హీరో, హీరోయిన్లు పుట్టారు అనే టాక్ రప్పించేలా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్ ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తింది. ఈ సినిమాకు చాలా మంది పాటలు అందించారు. కానీ జాన్ స్టీవార్డ్ ఎడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేక పెట్టిస్తుంది. ప్రతీ సన్నివేశాన్ని ఎమోషనల్‌గా మార్చడంలో తన సత్తాను చాటారు. ఇక వికాస్ శివరామన్ సినిమాటోగ్రఫి సినిమాను అందమైన పెయింటింగ్‌గా మార్చింది. ఎడిటింగ్, ఆర్ట్, ఇతర విభాగాలు అద్బుతంగా పనిచేశాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ స్టాండర్డ్‌కు ఏ మాత్రం తీసిపోకుండా నిర్మాణ విలువలు అనుసరించి మూవీని రిచ్‌గా మార్చారు.

తాను నమ్ముకొన్న, ఎంచుకొన్న వృత్తిలో యువకుడి ప్రయాణానికి ప్రేమ పెట్టిన పరీక్షను ఎలా నెగ్గాడు? ఒకరిని ప్రేమించి మోసపోయిన అమ్మాయికి మరోసారి ప్రేమలో పడితే విధి ఎలా పరీక్ష పెట్టింది? అనే పాయింట్లతో ఎమోషనల్‌గా రూపొందిన చిత్రం సైయారా. కుటుంబ బంధాలు, అనుబంధాలతో భావోద్వేగంగా సాగే చిత్రంలో నటినటులు, సాంకేతిక నిపుణల పనితనం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. సెకండాఫ్‌లో కొంత సాగదీసినట్టు అానిపిస్తుంది. కొన్ని చోట్ల కథలో, పాత్రల డిజైన్ మధ్య క్లారిటీ మిస్ అయిందా? అనిపిస్తుంది. కానీ చివర్లలో కమల్ హాసన్, శ్రీదేవీ వసంత కోకిల క్లైమాక్స్‌ను టచ్ చేసి సినిమాను ముగించిన విధానం బాగుంది. యూత్, లవ్ స్టోరీలను ఇష్టపడేవారికి నచ్చదు అనే అనడానికి ఎలా కారణాలు లేవు. ఫ్యామిలీ ఆడియెన్స్ మెప్పించే సన్నివేశాలు ఉన్నాయి. మ్యూజిక్ లవర్స్‌కు పండగలాంటి సినిమా. కాబట్టి ఈ మూవీని మిస్ చేసుకోవద్దు. తప్పకుండా థియేటర్లలోనే చూడండి. మంచి ఫీలింగ్, ఎమోషన్స్‌తో బయటకు వస్తారు.

More from Filmibeat

Read more about: Saiyaara Ahaan Panday Aneet Padda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X