Saiyaara First Review: సైయారా హిందీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆషికి 2 ఫేమ్ మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సైయారా. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే సోదరుడు ఆహాన్ పాండే, సలాం వెంకీ ఫేమ్ అనీత్ పడ్డా జంటగా రూపొందిన ఈ సినిమా పాటలు ఇప్పటికే పాపురల్ అయ్యాయి. ఆదిత్య చోప్రా సమర్పకుడిగా, అక్షయ్ విధాని నిర్మాతగా రూపొందిన ఈ సినిమా జూలై 18వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో దుబాయ్‌కి చెందిన క్రిటిక్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో తన రివ్యూను పోస్టు చేశారు. ఆ రివ్యూలో తాను వెల్లడించిన అభిప్రాయం, ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే..
సైయారా సినిమాకు ఫాహీమ్ అబ్దుల్లా, తనిష్క్ బాగ్చీ, రిషబ్ కాంత్, అర్సలాన్ నిజామీ,మిథున్ శర్మ, సచతె టాండడన్, పరంపర థాకూర్ పాటలు అందించారు. జాన్ స్టీవార్డ్ ఎడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాకు వికాస్ శివరామన్ సినిమాటోగ్రఫిని, రోహిత్ మక్వానా, దేవేంద్ర మర్దేశ్వర్ ఎడిటర్లుగా వ్యవ్యహరించారు. ఈ సినిమాలోని పాటలు ట్రెండింగ్ అవుతూ మూవీపై భారీ అంచనాలు పెంచేలా చేశాయి.

ఎమోషనల్ ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాను దుబాయ్ సెన్సార్ బోర్డుకు ప్రదర్శించిన ప్రివ్యూను చూసినట్టు ఉమేర్ సంధూ తెలిపాడు. ఈ సినిమా చూసిన తర్వాత తన మెసేజ్‌ను పోస్ట్ చేస్తూ.. వాట్ ఏ మూవీ. ఈ సినిమా చూసి సర్‌ప్రైజ్ అయ్యాను. ఈ చిత్రం తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుంది అని జోస్యం చెప్పాడు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన వివరంగా రివ్యూ కూడా అందించాడు.
ఓవర్సీస్ సెన్సార్ బోర్డుకు ప్రదర్శించిన ప్రివ్యూ ద్వారా ఇస్తున్న సైయారా ఫస్ట్ రివ్యూ . 2025 సంవత్సరంలో బెస్ట్ మ్యూజిక్ లవ్ స్టోరి అవుతుంది. మోహిత్ సూరి గ్రేట్‌గా కమ్ బ్యాక్ ఇస్తాడు. తొలిసారి సినిమా పరిశ్రమలో అడుగుపెడుతున్న ఆహన్ పాండే, అనీత్ పడ్డా తమ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుుకొన్నారు. పాటలు మాస్ బ్లాక్ బస్టర్. క్లైమాక్స్ ముగిసిన తర్వాత లేచి చప్పట్లు కొట్టకుండా ఉండలేరు. ఈ సినిమాకు నా రేటింగ్ 5 పాయింట్లకు 3.5 అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.
అయితే ఈ సినిమా రివ్యూపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. కొందరు ఆయనను ట్రోల్ చేస్తే.. మరికొందరు సినిమా యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. నిన్ను సెన్సార్ బోర్డు ఆఫీస్ గేట్లు కూడా తాకనివ్వరు. నీవు సినిమా చూశావా?. నీ రివ్యూలు కరెక్ట్ కాదు. తారే జమిన్ పర్ సినిమా డిజాస్టర్ అని రాశావు. అమీర్ ఖాన్ కెరీర్ ముగిసిందని చెప్పావు. ఆ మూవీ బ్లాక్‌బస్టర్ అయింది. అందుకే నీ రివ్యూలంతా బోగస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు మోహిత్ సూరి సూపర్ డైరెక్టర్. మంచి విజయం సాధించాలి. కొత్తగా ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్న వారికి సక్సెస్ లభించాలి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
సైయార్ పాటలు మాత్రం సంగీత ప్రియులను ఆకట్టుకొంటున్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తే కథ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఈ సినిమా గురించి ఉమేర్ సంధూ రివ్యూ పక్కన పెడితే.. ఫిల్మీబీట్ ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం వెయిట్ చేయండి. ఈ సినిమా గురింని బాక్సాఫీస్ కలెక్షన్లు, సినిమా సమీక్ష కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











