Salaar twitter Review ఊరమాస్ లెవెల్లో కమ్ బ్యాక్.. ప్రభాస్ మూవీ ఎలా ఉందంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మించిన చిత్రం సలార్. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతిహాసన్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో, ట్విట్టర్‌లో నెటిజన్లు ఎలా రియాక్ట్ అయ్యారంటే..

ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఇప్పుడే చూశాను. ఈ సినిమా మాన్‌స్టర్ బ్లాక్‌బస్టర్. స్క్రీన్ మీద కనిపించిన ప్రతీ సారి ప్రభాస్ భాయ్ గూస్‌బంప్స్ వచ్చాయి. రెబల్ స్టార్ పెర్ఫార్మెన్స్ ఫెంటాస్టిక్. యూనిట్ అందరికి కంగ్రాట్స్. ప్రశాంత్ నీల్ విజువల్ ట్రీట్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రతీ ఒక్కరు చూడాల్సిన సినిమా అని హీరో నిఖిల్ ట్వీట్ చేశాడు.
సలార్ సినిమా చూసిన తర్వాత రికార్డులు భూస్థాపితం.. నేలమట్టం కావడం తథ్యం. ప్రభాస్ రాయల్ కమ్ బ్యాక్. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు చెప్పారు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఆకాశానికి ఎత్తున సలార్‌తో నిలిచాడు. ప్రతీ సీన్‌లో ఆయన ప్రజెన్స్ అద్బుతంగా ఉంది. మాగ్నెటిక్ ఛరిష్మాతో రేడియేట్ చేశాడు. తన నటనతో ప్రభాస్ మంత్రముగ్దుల్ని చేశాడు. కేవలం ఆయన నటించలేదు. తన స్క్రీన్ ప్రజెన్స్‌తో దేవా పాత్రలో జీవించాడు అని నెటిజన్ పోస్టు పెట్టాడు.
సలార్ 2 గంటల 55నిమిషాల సినిమా. నాలుగ ఫైట్స్, చాలా డ్రామా. ఒక్క సింగిల్ డల్ మూమెట్స్ లేవు. నాలుగు ఫైట్ సీన్లను డిజైన్ చేసి ఎలివేట్ చేసిన విధానం బాగుంది. ఈ సినిమా ఫెంటాస్టిక్. పెట్టిన ప్రతీ పైసాకు న్యాయం చేస్తుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ తన ట్వీట్‌లో.. సలార్ మాన్‌స్టర్ యాక్షన్ డ్రామా. యాక్షన్ మూవీ లవర్స్‌కు ఉన్న దాహాన్ని తీర్చే సినిమా. రెబల్ స్టార్ ప్రజెన్స్ అద్బుతంగా ఉంది. చూస్తుంటే చూపు తిప్పుకోలేని ఆయన పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లు గూస్‌బంప్స్. చాలా రోజుల తర్వాత ప్రభాష్ స్టేచర్‌కు తగిన పాత్ర లభించింది. బాక్సాఫీస్‌ను రఫాడించడం ఖాయం అని అన్నారు.
నా మాటలు రాసిపెట్టుకొండి. ప్రభాస్ కోసం సలార్ సినిమా మాస్ లెవెల్లో కమ్ బ్యాక్ అవుతుంది. బ్లడ్ బాత్ ఎక్స్‌పీరియెన్స్ కోసం సిద్దంగా ఉండండి. మీకు గొప్ప అనుభూతి కలుగుుతంది అని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు.
యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ పైరసీ రాకుండా అడ్డుకట్ట వేయండి. దయచేసి పైరసీ విషయాలను వెలుగులోకి తీసుకురండి. ఏదైనా కంటెంట్ లీక్ అయితే వెంటనే తెలియజేయండి. పైరసీ విషయం తెలిస్తే ఈ కింది ఈమెయిల్‌కు షేర్ చేయండి అని ఓ అభిమాని పోస్టు పెట్టారు.
సలార్ విడుదల నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్‌కు చిరంజీవి ఫ్యాన్స్ విషెస్ అందించారు. సలార్ సినిమా భారీ హిట్ కావాలి. డార్లింగ్ ప్రభాస్, చిత్ర యూనిట్‌కు భారీ విజయం లభించాలి అని ఆకాంక్షించారు.
హైదరాబాద్‌లో మొత్తం 800 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 4 లక్షల మంది సినిమా చూసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోనే ఫస్ట్ డే ఇలా ఉంటే.. దేశం మొత్తం ఎలా ఉంటుంది అని ఓ అభిమాని తన ఆనందాన్ని పంచుకొన్నాడు.


Click it and Unblock the Notifications











