Radhe Movie Review: సల్మాన్ ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్ హిట్టా? ఫట్టా?

Rating:
2.0/5
Star Cast: సల్మాన్ ఖాన్, దిశా పటానీ, రణదీప్ హుడా, జాక్రీ ష్రాఫ్, సుధాంశు పాండే
Director: ప్రభుదేవా

నిర్మాతలు: సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి, నిఖిల్ నమిత్, జీ స్టూడియోస్
స్క్రీన్ ప్లే: ఏసీ ముగిల్
మ్యూజిక్: సంచిత్ బల్హారా (బీజీఎం), సాజిద్ వాజిద్, దేవీ శ్రీ ప్రసాద్, హిమేష్ రష్మియా (సాంగ్స్)
సినిమాటోగ్రఫి: అయాంకా బోస్
ఎడిటింగ్: రితేష్ సోని
రిలీజ్: జీ ప్లెక్స్ ఓటీటీ
రిలీజ్ డేట్: 2021-05-13

రాధే కథ ఏమిటంటే.

రాధే కథ ఏమిటంటే.

ముంబై నగరంలో యువతను డ్రగ్స్ మత్తులో ముంచెత్తే డాన్ రానా (రణదీప్ హుడా) ఆగడాలు మితీమీరి పోతుంటాయి. ఆ సమయంలో రానాను ఎదుర్కొనే పవర్‌ఫుల్ ఆఫీసర్ అవసరం అవుతుంది. డ్రగ్ మాఫియాను తుద ముట్టించాలంటే సస్పెండ్ అయిన రాధే ( సల్మాన్ ఖాన్)ను రంగంలోకి దించుతారు.

రాధే సినిమాలో ట్విస్టులు

రాధే సినిమాలో ట్విస్టులు

పోలీస్ ఆఫీసర్ రాధే రంగంలోకి దిగిన తర్వాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయి? పోలీస్ కమిషనర్ అవినాష్ అభయంకర్ (జాకీ ష్రాఫ్)తో కలిసి రాధే ఎలా పనిచేశాడు.. అవినాష్ సోదరి దియా అభయంకర్‌ (దిశా పటానీ)తో రొమాంటిక్ లైఫ్ ఎలా సాగింది? రాధే, దియాల కెమిస్ట్రీ వర్కువుట్ అయిందా అనే ప్రశ్నలకు సమాధానమే రాధే సినిమా కథ.

దర్శకుడు ప్రభుదేవా వైఫల్యం

దర్శకుడు ప్రభుదేవా వైఫల్యం

రాధే మూవీ కోసం దర్శకుడు ప్రభుదేవా ఎంచుకొన్న కథ అత్యంత నాసిరకంగా ఉంది. ఇక కథనం ఎప్పుడో 80 దశకంలో చూడని విధంగా ఉంటుంది. ఎలాంటి క్వాలిటీ సీన్లు గానీ, ఎమోషనల్ సన్నివేశాలు కూడా కనిపించవు. దర్శకుడిగా ప్రభుదేవా క్రియేటివ్ ఫెయిల్యూర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సల్మాన్ ఖాన్ క్యారెక్టర్‌ను సరిగా రాసుకోలేని నిర్లక్ష్యం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. దిశా పటానీ కేవలం అలంకార ప్రాయంగానే కనిపిస్తుంది.

మెరుపులు మెరిపించని సల్మాన్ ఖాన్

మెరుపులు మెరిపించని సల్మాన్ ఖాన్

రాధేగా సల్మాన్ ఖాన్ పాత్ర విషయానికి వస్తే ఎలాంటి హంగులు, ఆర్బాటాలు కనిపించవు. సల్మాన్ కెరీర్‌లోనే ఇలాంటి నాసిరకం చిత్రం చూసి ఉండవేమో అనిపిస్తుంది. అర్ధం పర్థం లేని ఫైట్స్ విసిగించేలా చేస్తాయి. సల్మాన్ ఖాన్ అంటే డైలాగ్స్ డైనమెట్లుగా పేలుతాయి. కానీ ఈ సినిమాలో అలాంటివి మచ్చుకైనా కనిపించవు. సల్మాన్ బాడీ లాంగ్వేజ్‌లో కూడా ఎలాంటి కొత్తదనం కనిపించదు. అతడి కెరీర్‌లో 97 ఎన్‌కౌంటర్లు, 23 ట్రాన్స్‌ఫర్లు ఉన్నప్పటికీ వాటి ఇంటెన్సిటీ తెరపైన ఎక్కడా కనిపించదు.

ఆటలో అరటిపండుగా దిశా పటానీ

ఆటలో అరటిపండుగా దిశా పటానీ

ఇక మిగితా పాత్రల విషయానికి వస్తే.. దిశా పటానీ కేవలం ఆట బొమ్మగానే కనిపిస్తుంది. పాటల్లో ఆటలాడటం, సల్మాన్‌తో రొమాన్స్ చేయడం తప్ప మరో ప్రాధాన్యం ఎక్కడా కనిపించదు. ఇక జాకీ ష్రాఫ్ పాత్ర కూడా అటు కామెడీ ఎక్కువ.. క్యారెక్టర్ ఆర్టిస్టుకు తక్కువ అనే విధంగా సాగుతుంది. మేఘా ఆకాశ్, ఇతర పాత్రలు కూడా అంతగా ఆకట్టుకొనేలా లేవనే చెప్పవచ్చు.

బలహీనమైన విలన్‌ వల్లే

బలహీనమైన విలన్‌ వల్లే

కథకు కావాల్సిన బలమైన విలన్‌‌ రాధే సినిమాలో కనిపించకపోవడం మరో ప్రధానమైన లోపం. ముంబై డ్రగ్స్ సామ్రాజ్యాన్ని పాలించే రానాగా రణ్‌దీప్ హుడా ఆకట్టుకోలేకపోయాడు. విలన్‌గా మెప్పించలేకపోయాడనే చెప్పవచ్చు. దాంతో బలమైన విలన్ కొరవడిన సమయంలో హీరో పాత్ర ఎలా తేలిపోతుందనే విషయం రాధే సినిమా ద్వారా తెలుసుకోవచ్చు. విలన్ పాత్ర కేంద్రంగా నడిచే పాత్రలో ఎలాంటి భావొద్వేగాలు లేకపోవడం సినిమాకు పెద్ద శాపంగా మారింది.

సాంకేతిక విభాగాల పనితీరు

సాంకేతిక విభాగాల పనితీరు


కథ, కథనాలు బాగా లేని నేపథ్యంలో సాంకేతిక విభాగాలు ఎంత బలంగా పనిచేసినా వాటికి అంతగా గుర్తింపు ఉండదనేది సత్యం. రాధే సినిమా విషయంలో కూడా అదే జరిగింది. మ్యూజిక్ విషయంలో కూడా దారుణమైన వైఫల్యం కనిపిస్తుంది. సీటీ మార్ పాట వినడానికి బాగున్నా స్టెప్పులు నాసిరకంగా ఉండటం మరో జీర్ణించుకోలేని విషయం. పాపులర్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో డ్యాన్సుల్లో క్వాలిటీ కూడా అంతంత మాత్రమే అని చెప్పవచ్చు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, ఇతర విభాగాలు సినిమాపై ప్రభావం చూపలేకపోయాయి.

Recommended Video

Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
ఫైనల్‌గా

ఫైనల్‌గా

దర్శకుడు ప్రభుదేవా, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో మూవీ వస్తుందంటే భారీ అంచనాలు ఉండటం సహజం. అయితే అలాంటి అంచనాలను 10 శాతం కూడా అందుకోలేకపోయింది. కొరియన్ మూవీ ది అవుట్‌లాస్ సినిమా ఆధారం చేసుకొని నిర్మించిన రాధే చిత్రాన్ని సరైన రీమేక్‌గా మలచడంలో దారుణంగా విఫలమయ్యారు. ఓవరాల్‌గా ఈద్ రోజున సల్మాన్ ఖాన్ తన అభిమానులను తీవ్రమైన నిరాశకు గురిచేశారు. రాధే ప్రేక్షకులకు ఓ బాదే కార్యక్రమమే అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు,

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X