Samajavaragamana Review నాన్‌స్టాప్ లాఫింగ్ బ్యాంక్.. కడుపుబ్బ నవ్వించే సామజవరగమన (రివ్యూ)

Rating:
3.0/5
Star Cast: Sree Vishnu, VK Naresh, Reba Monika jhon, Vennela Kishore
Director: Ram Abbaraju

నటీనటులు: శ్రీ విష్ణు, రెబా మోనిక జాన్, వీకే నరేష్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, రఘు బాబు, దేవీ ప్రసాద్, ప్రియ తదితరులు
దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: అనిల్ సుంకర, రాజేశ్ దండ
కథ, డైలాగ్స్: రామ్ అబ్బరాజు, భాను భోగవరపు, నందు సావిరిగన
మ్యూజిక్: గోపి సుందర్
సినిమాటోగ్రఫి: రాంరెడ్డి
సినిమాటోగ్రఫి: చోటా కే ప్రసాద్
ఆర్ట్ డైరెక్షన్: బ్రహ్మ కడలి
బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్
రిలీజ్ డేట్: 2023-06-28

ఉమా మహేశ్వర్ రావు (వీకే నరేష్) 25 ఏళ్లుగా డిగ్రీ పాస్ కావడానికి కష్టాలు పడుతుంటాడు. ఉమా మహేశ్వర్ రావు కొడుకు బాక్సాఫీస్ బాలు అలియాస్ బాలు (శ్రీ విష్ణు) ఏషియన్ మల్టీ‌ప్లెక్స్ థియేటర్‌లో టికెట్లు అమ్మే ఉద్యోగం చేస్తుంటాడు. తండ్రి ఉమా మహేశ్వర్ రావు‌ను ఎలాగైనా డిగ్రీ పాస్ చేయించాలని పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తుంటాడు. ఇదిలా ఉండగా తనను ఇష్టపడే ప్రతీ అమ్మాయితో రాఖీ కట్టించుకొనే బాలు.. సరయు (రెబా మోనిక జాన్) చూసి ప్రేమలో పడుతాడు. బాలు, సరయు ప్రేమకు ఉమా మహేశ్వర్ రావు కుటుంబం ఆమోదం తెలుపుతుంది. కానీ వారి పెళ్లికి ఓ భారీ సమస్య వచ్చి పడుతుంది.

ఉమా మహేశ్వర్ రావు 25 ఏళ్లుగా డిగ్రీ పాస్ కావడానికి ఎందుకు కష్టపడుతున్నాడు? తండ్రిని డిగ్రీ పాస్ చేయించడానికి బాలు చేసే ప్రయత్నం వెనుక కథ ఏమిటి? అమ్మాయిలందరితో రాఖీ కట్టించుకొనే బాలు.. సరయును ఇష్టపడటానికి కారణం ఏమిటి? బాలు, సరయు ప్రేమ కథలో చోటు చేసుకొన్న సమస్య ఏమిటి? కొడుకు పెళ్లి చేయడానికి ఉమా మహేశ్వర్ రావు చేసిన ప్రయత్నాలు ఎలా సాగాయి? బాలు ప్రేమ కథకు రాధాకృష్ణ (శ్రీకాంత్ అయ్యంగార్), కులశేఖర్ (వెన్నెల కిషోర్)కు సంబంధమేమిటి? చివరకు ఉమా మహేశ్వర్ రావు డిగ్రీ పాస్ అయ్యాడా? బాలు, సరయు పెళ్లి జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే సామజవరగమన సినిమా కథ.

Samajavaragamana Review

డిగ్రీ పాస్ కావడానికి ఉమా మహేశ్వర్ రావు పడే అవస్థల ఆధారంగా బ్రహ్మండమైన కామెడీ ట్రాక్‌తో కథ మొదలవుతుంది. తండ్రి కొడుకులు ఉమా, బాలు మధ్య జరిగే సన్నివేశాలు, సీన్లకు రాసుకొన్న డైలాగ్స్, వారి మధ్య కెమిస్ట్రీ బాగా పడటంతో సినిమా ఆద్యంతం నవ్వులు పూయించేలా మారిపోయింది. సినిమా మొదలైనప్పటి నుంచి ప్రతీ సీన్ బూతులకు తావు లేకుండా ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వినోదం ప్రతీ ఒక్కరిని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే ప్రయత్నం చేయడంలో దర్శకుడు రామ్ అబ్బరాజు సక్సెస్ అయ్యాడు. బాలు ప్రేమ కథలో చిన్న ట్విస్టుతో ఫస్టాఫ్‌ను మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ముగించడంతో సెకండాఫ్‌పై మరింత ఆసక్తి పెరుగుతుంది.

Samajavaragamana Review

ఫస్టాఫ్‌లో హిలేరియస్ కామెడీ సీన్లు చూసిన తర్వాత అదే జోష్‌ను దర్శకుడు రామ్ కొనసాగించే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ ఎక్కువగా ఉండటంతో సెకండాఫ్ కాస్త స్లో అయినట్టు కనిపిస్తుంది. కానీ శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, జెమినీ సురేష్ పాత్రల ఎంట్రీతో సినిమా మరింత కామెడీగా మారుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సన్నివేశం వరకు తెరపై పండిన భావోద్వేగం ప్రతీ ఒక్కరిని టచ్ చేసేలా ఉంటుంది. ఓవరాల్‌గా మంచి ఫీల్‌గుడ్ సినిమా చూశామనే ఫీల్‌ను ప్రేక్షకుడు అనుభూతిని పొందడం ఖాయం.

Samajavaragamana Review

దర్శకుడు రామ్ అబ్బరాజు, భాను భోగవరపు, నందు సావిరిగన టీమ్ పడిన శ్రమ తెరపైన ప్రతీ సన్నివేశంలో కనిపిస్తుంది. రెగ్యులర్, సింపుల్ కథను వినోదాన్ని జోడించి చెప్పిన విధానం అద్బుతంగా ఉంటుంది. జంధ్యాల, ఈవీడీ, రేలంగి నరసింహారావు తరహా కామెడీని ఈ సినిమా గుర్తు చేసేలా ఉంటుంది. నాన్ స్టాప్ కామెడీతోపాటు 10000 వాలా టాపాసుల్లా డైలాగ్స్ పేలిపోతుంటాయి. ఒక్క నిమిషం ఏదైనా ఆలోచిస్తే మంచి కామెడీ డైలాగ్ మిస్ అయిపోతామా అనే విధంగా సన్నివేశాలను రాసుకొన్నారు. చాలా రోజు తర్వాత క్లీన్ కామెడీ, ఎంటర్‌టైనర్‌ను అందించడంలో రామ్ అబ్బరాజు సఫలమయ్యారనే చెప్పాలి.

Samajavaragamana Review

సామజవరగమన సినిమాలో నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. హీరో శ్రీ విష్ణు కంటే ముందు.. వీకే నరేష్ గురించి చెప్పుకోవాలి. ఉమా మహేశ్వర్ రావు పాత్రలో ఆయన నటన, డైలాగ్ డెలివరీ, హావభావాలు, కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. ఈ సినిమాలో వీకే నరేష్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. సినిమా భారాన్నంతా వీకే నరేష్ మోశారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక శ్రీవిష్ణు విషయానికి వస్తే.. ఇప్పటి వరకు డిఫరెంట్ యాక్టింగ్‌తో మెప్పించే ప్రయత్నం చేశారు. కానీ సామజవరగమన సినిమాలో శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్ ఎక్ట్రార్డినరీగా ఉంది. కామెడీ, ఎమోషనల్ సన్నివేశాల్లో రకరకాల వేరియేషన్స్ చూపించారు. నటుడిగా కొత్త కోణంలో శ్రీ విష్ణు ఆవిష్కరించుకొనే చేశారనే చెప్పాలి.

Samajavaragamana Review

సరయు పాత్రలో మలయాళ హీరోయిన్ రెబ్బా మోనిక జాన్ గ్లామర్ పరంగానే కాకుండా ఫెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఆకట్టుకొన్నారు. శ్రీవిష్ణుతో మంచి కెమిస్ట్రీని పండించారు. ఇక శ్రీవిష్ణుతో కలిసి సుదర్శన్ చేసిన కామెడీ బ్రహ్మండంగా పేలింది. శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ సెకండాఫ్‌లో సినిమాను నిలబెట్టే ప్రయత్నంచేశారు. రాజీవ్ కనకాల పాత్ర చిన్నదైనా గుర్తుండిపోయే పాత్రలో కనిపించారు. మిగితా క్యారెక్టర్లలో నటించిన వారంతా వారి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పలు సన్నివేశాలకు ఆయన మ్యూజిక్ ప్రాణం పోసింది. పాటలు ఈ సినిమాకు మైనస్. వాస్తవానికి ఈ సినిమాకు పాటలు అవసరం లేదనిపిస్తుంది. కామెడీ ఫ్లోకు పాటలు అడ్డుపడ్డాయనే ఫీలింగ్ కలుగుతుంది. ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులతో కళకళలాడించే విధంగా చిత్రీకరించిన రాంరెడ్డి సినిమాటోగ్రఫి బాగుంది. సినిమాను ఎడిటర్ చోటా కే ప్రసాద్ పరుగులు పెట్టించారు. సెకండాఫ్‌లో శ్రీకాంత్ అయ్యంగార్ ట్రాక్ కొంత కత్తిరించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. అనిల్ సుంకర, రాజేశ్ దండ అనుసరించిన నిర్మాణ విలువలు టాప్ క్లాస్‌గా ఉన్నాయి.

Samajavaragamana Review

కుల, మతాలకు అతీంగా ప్రేమ, ఎమోషన్స్, ఫ్యామిలీ వాల్యూస్ లాంటి బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన క్లీన్ అండ్ ఫెయిర్ ఎంటర్‌టైనర్ సామజవరగమన. వీకే నరేష్, శ్రీ విష్ణు నటన, కామెడీ ట్రాక్ ఈ సినిమాకు అత్యంత బలంగా మారింది. దర్శకుడు రామ్ అబ్బూరి దట్టించిన వినోదం కడుపుబ్బ నవ్విస్తుంది. రెండు గంటలపాటు మంచి వినోదాన్ని ఆస్వాదించే సినిమా ఇది. ఎలాంటి అనుమానాలు లేకుండా థియేటర్‌కు వెళితే వినోదాన్ని భారీగా నింపుకొన్న హృదయంతో బయటకు వస్తారు. గతంలో జంధ్యాల, ఈవీవీ, రేలంగి నరసింహరావు తరహా సినిమాలను గుర్తు చేస్తుంది. మస్ట్ వాచ్ సామజవరగమన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X