»   » ఎన్నో చీత్కారాలు.. బాధ, విషాదం.. చైతూకు చెప్పను.. సమంత

ఎన్నో చీత్కారాలు.. బాధ, విషాదం.. చైతూకు చెప్పను.. సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

2012 సంవత్సరానికి 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రానికి ఉత్తమ నటి అవార్డు దక్కడంపై సమంత సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పలు విషయాలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. రోజంతా ట్వీట్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేసింది. 'ఏం మాయ చేశావో'.. చిత్రం ఏడేళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఆ నాటి మధుర సృతులను గుర్తు చేసుకొన్నది. పలువురు అభిమానులతో ట్విట్టర్‌లో ముచ్చటించింది.

ఎటో వెళ్లి పోయింది మనసు నాకు ప్రత్యేకం

ఎటో వెళ్లి పోయింది మనసు నాకు ప్రత్యేకం

‘ఎటో వెళ్లి పోయింది మనసు చిత్ర చాలా ప్రత్యేకమైనది. ఆ చిత్రం అంతగా ఆడకపోవడంతో కొంత నిరాశ చెందాను. కానీ ప్రేక్షకులు, క్రిటిక్స్, సన్నిహితులు ప్రశంసించడం ఆనందం వేసింది. ఇక ఆ చిత్రానికి తాజాగా అవార్డు లభించడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం నా కెరీర్, జీవితం చాలా బాగా ఉన్నది' అని సమంత తెలిపింది.

అప్పుడే ఏడేళ్లు అయిందా?

అప్పుడే ఏడేళ్లు అయిందా?

ఏం మాయ చేశావో చిత్రం చేసి అప్పుడే ఏడేళ్లు కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆ చిత్రం చేసేటప్పడు నాకు తెలుగు అసలే రాదు. ఆ డైలాగ్స్‌ను గుర్తు పెట్టుకోవడాని చాలా కష్టపడ్డాను. ఆ షూటింగ్‌లో దాదాపు చచ్చిపోయేంత పనైంది.

నాకు ఎన్నో చీత్కారాలు.. బాధ, విషాదం

నాకు ఎన్నో చీత్కారాలు.. బాధ, విషాదం

అబ్బా ఏడేళ్లు గడిచిపోయాయి. ఏడేళ్ల కాలంలో పడ్డ శ్రమ, అభద్రతాభావం, అపజయాలు, చీత్కారాలు, బాధ, విషాదం, విజయం, ఖ్యాతి, డబ్బు లాంటి విషయాలు వెంట ఉన్నాయి. అవి మాత్రమే సంతోషాన్ని, విజయాన్ని ఇచ్చావనుకోను. ఏడేళ్లలో అంతటి సంతోషాన్ని సొంతం చేసుకోవడం

సోషల్ మీడియాలో ఎటాక్‌పై ఎం చెప్పాలి..

సోషల్ మీడియాలో ఎటాక్‌పై ఎం చెప్పాలి..

సోషల్ మీడియాలో నాపై ఆడిపోసుకొనే వారు నా గురించి, వారి గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారు. వారి కామెంట్లతో హార్ట్ ఎటాక్‌కు గురికాను. ప్రతీసారి చావలేను. అందరిని కలుపుకోవడంతోనే నీ విజయగాధ సంపూర్ణమవుతుంది.

 సినీ పరిశ్రమకు రుణపడి ఉంటాను

సినీ పరిశ్రమకు రుణపడి ఉంటాను

సంపద, ఖ్యాతి అవన్నీ పూర్తిగా సంతోషాన్నిఇవ్వలేవవనేది నా అభిప్రాయం. నా కు చాలా మందిని పరిచయం చేసిన సినిమా పరిశ్రమకు జీవితాంతం రుణపడి ఉంటాను.

కష్ట సమయాల్లో నావెంటే..
కష్టం, సుఖం.. అన్ని సమయాల్లో..
నా వ్యక్తిత్వంపై ప్రభావం చూపి ప్రేమను పంచారు. వారిని సుఖం, కష్ట సమయాల్లో వారి వెంటే నడిచాను. నా జీవితంలోకి ప్రవేశించి గొప్ప జీవితాన్ని ప్రసాదించిన వారికి థ్యాంక్స్.

నా లోపాన్ని వ్యక్తిత్వంతో
నా లోపాన్ని వ్యక్తిత్వంతో అధిగమించా
నేను పొట్టిగా ఉంటాను అనే విషయం గురించి ఎప్పుడూ బాధపడలేదు. ఆ లోపాన్ని నా వ్యక్తిత్వంతో అధిగమించాను. నా కెరీర్‌కు ఆ లోపం అడ్డుపడలేదు. ఎన్నో విజయాలను అందుకొన్నాను.

చైతూను చూడమని చెప్పను..
నాగచైతన్యను చూడమని చెప్పను..
నాగచైతన్యను హారర్ చిత్రాలు అంటే ఇష్టం ఉండదు. నేను అప్పుడే చెప్పాను. ఆయన రాజు గారి గది2 చిత్రం చూడడు. చూడమని నేను కూడా చెప్పను.

    English summary
    Samantha honoured with Nandi Award by Andhra Pradesh govt for her performance in Yeto Vellipoyindi Manasu. Recently, she did a Twitter chat with her fans and revealed a few secrets about herself and her would-be in-laws which will leave you amused.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu