For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  KRK movie review మెప్పించలేకపోయిన ప్రేమ కథ.. కానీ విజయ్ సేతుపతి పెర్ఫార్మెన్స్‌తో... !

  |

  Rating:
  2.5/5

  నటీనటులు: విజయ్ సేతుపతి, నయనతార, సమంత రుత్ ప్రభు, ప్రభు, రెడిన్ కింగ్ల్సే, ఎస్ శ్రీశాంత్ తదితరులు
  రచన, దర్శకత్వం: విఘ్నేష్ శివన్
  నిర్మాతలు: విఘ్రేష్ శివన్, నయనతార, ఎస్ఎస్ లలిత్ కుమార్
  సినిమాటోగ్రఫి: ఎస్ఆర్ కథిర్
  ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
  మ్యూజిక్: అనిరుధ్ రవిచంద్రన్
  బ్యానర్: రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
  రిలీజ్ డేట్: 2022-04-28

  KRK కథ ఏమిటంటే?

  KRK కథ ఏమిటంటే?

  రాంబో (విజయ్ సేతుపతి) పుట్టుకతోనే దురదృష్టవంతుడు. ప్రతీ విషయంలోను నిరాశే ఎదురవుతుంటుంది. జీవితం నిస్పృహతతో కొనసాగుతున్న సమయంలో రాంబో లైఫ్‌లోకి కతీజా (సమంత), కన్మణి (నయనతార) ప్రవేశిస్తారు. ఇద్దరితోను రాంబో ప్రేమలో పడుతాడు. ఇద్దరూ కూడా ఒకరికంటే మరొకరు ఎక్కువగా ప్రేమిస్తారు.

  KRK మూవీలో ట్విస్టులు

  KRK మూవీలో ట్విస్టులు

  రాంబోతో కతీజా ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? అలాగే కన్మణితో అఫైర్ వల్ల రాంబోలో ఆత్మవిశ్వాసం పెంచిందా? ఇద్దరితో ప్రేమ వల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. అన్ని విషయాల్లో దురదృష్టం వెంటాడే రాంబోను కన్హణి, కతీజా ఎందుకు ప్రేమించారు? రాంబోను కతీజా పెళ్లి చేసుకొన్నదా? లేదా కన్మణిని రాంబో పెళ్లి చేసుకొన్నాడా? రాంబో జీవితానికి ఎలాంటి ముగింపు లభించింది? చివరికి రాంబో అదృష్ణ జాతకుడిగా మారారా? అనే ప్రశ్నలకు సమాధానమే కన్మణి రాంబో కతీజా సినిమా కథ.

  KRK మూవీ ఎలా ఉందంటే?

  KRK మూవీ ఎలా ఉందంటే?

  రాంబో కుటుంబంలో ఎవరైనా పెళ్లి చేసుకొంటే జంటలో ఎవరో ఒకరు మరణిస్తారనే ఓ శాపం అనే అంశంతో కథ ఎమోషనల్‌గా మారుతుంది. రాంబోను వెంటాడే దురదృష్ణ పరిస్థితులు విజయ్ సేతుపతి పాత్రపై సింపథీ కలిగించేలా ఉంటాయి. అయితే కథలో బలమైన పాయింట్, మంచి కథనం లేకపోవడంతో సినిమా పేలవంగా సాగుతుంటుంది. అయితే కతీజా (సమంత) రాంబో ప్రేమ కథలో ఫీల్ లేకపోవడం, కన్మణి, రాంబో అఫైర్‌లో ఎమోషనల్‌ పాయింట్ లేకపోవడంతో సినిమా సాదాసీదాగా మారుతుంది. క్లైమాక్స్‌లో చెప్పిన పాయింట్ ఆకట్టుకోలేకపోవడంతో సినిమా పేలవంగా కనిపిస్తుంది.

  విఘ్రేశ్ శివన్ దర్శకత్వం గురించి

  విఘ్రేశ్ శివన్ దర్శకత్వం గురించి

  దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంచుకొన్న పాయింట్.. దాని చుట్టు అల్లుకొన్న పాయింట్ బాగానే ఉన్నప్పటికి.. ఆకట్టుకొనే కథనంతో కథను నడిపించలేకపోవడం భారీ మైనస్‌గా మారింది. అలాగే ప్రేక్షకుడిని కథలో లీనం చేయడంలో కూడా దర్శకుడిగా విఫలమయ్యాడని చెప్పవచ్చు. ఎమోషనల్ పాయింట్‌ను మంచి ప్రేమ కథగా మార్చడంలో దారుణంగా తడబాటుకు గురయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది.

  విజయ్ సేతుపతి ఫెర్ఫార్మెన్స్

  విజయ్ సేతుపతి ఫెర్ఫార్మెన్స్


  విజయ్ సేతుపతి తన ఫెర్ఫార్మెన్స్‌తో రాంబో పాత్రను నిలబెట్టేందుకు ప్రయత్నించిన తీరు బాగుంది. అయితే లవర్ బాయ్‌గా విజయ్ సేతుపతికి ఇది కొత్తగా ఉంటుందనిపించింది. ఇప్పటి వరకు విజయ్ సేతుపతిని చూడటం వల్ల కావొచ్చు.. లవర్ బాయ్‌గా జీర్ణించుకోవడం కష్టమే. ఎమోషనల్ సన్నివేశాల్లో, క్లైమాక్స్‌లో విజయ్ సేతుపతి నటన బాగుంది.

  సమంత, నయనతార ఎలా చేశారంటే..

  సమంత, నయనతార ఎలా చేశారంటే..

  సమంత, నయనతార పాత్రలు కొత్తగా ఉన్నప్పటికీ.. వాటిని తెర మీద మలిచిన తీరు ఆకట్టుకోలేకపోయాయి. కతీజా పాత్రకు సమంత, కన్హణి పాత్రకు నయనతార న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. కథ బలహీనంగా ఉండటం, పాత్రల డిజైన్ పేలవంగా ఉండటంతో వారు తమ నటనతో ఆకట్టుకొనేందుకు చేసిన ప్రయత్నం అంతగా ఫలితం ఇవ్వలేదు. వారి పాత్రల్లో పెద్దగా భావోద్వేగం కనిపించకపోవడంతో మరీ రొటీన్‌గా మారాయి. క్రికెటర్ శ్రీశాంత్ పాత్ర కూడా సాదాసీదాగా ఉంది.

  టెక్నికల్ అంశాల గురించి

  టెక్నికల్ అంశాల గురించి


  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి గొప్పగా లేదనిపిస్తుంది. పాటల విషయానికి వస్తే.. టూ టూ, మరో రెండు పాటలు అనిరుద్ స్టైల్‌లో ఉంటాయి. బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల బీజీఎం కూడా ఎలివేట్ కాలేదనిపిస్తుంది. మిగితా విభాగాలు ఒకే అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. బాదం, పిస్తా ఎపిసోడ్ కొంత వినోదంగా ఉంటుంది. ఆరిపోయిన ఇడ్లీలకు హాట్ బాక్స్ ఎందుకు లాంటి డైలాగ్స్ నవ్విస్తాయి.

  ఫైనల్‌గా సినిమా ఎలా ఉందంటే?

  ఫైనల్‌గా సినిమా ఎలా ఉందంటే?

  లవ్, ఎమోషన్స్, ముక్కోణపు ప్రేమ కథ కోణంలో సాదాసీదాగా సాగే సినిమా కన్మణి రాంబో కతీజా. కథ, కథనాలపై ఎలాంటి కసరత్తు లేకుండా చేస్తే ఎలా ఉంటుందో అలానే ఈ సినిమా ఉంటుంది. మంచి ఎమోషనల్ సినిమాకు కావాల్సిన ముడిసరకు ఉన్నా.. పర్‌ఫెక్ట్ సినిమాగా మలచలేకపోయారనే ఫీలింగ్ చివరకు కలుగుతుంది. స్టార్ హీరో, హీరోయిన్లు ఉన్నారనే ఒక అంశమే సినిమాను చూసేలా చేయడానికి ప్రభావితం చేస్తుంది. మిగితా విషయాలు పెద్దగా సినిమాను చూసే విధంగా ప్రేరేపించవు. కాబట్టి వీకెండ్‌లో ఏమీ తోచకపోతే.. థియేటర్‌కు వెళ్లి మీ అనుభూతి ఎలా ఉంటుందో చెక్ చేసుకోవచ్చు.

  English summary
  Nayantara and Samantha Ruth Prabhu's Kaathuvaakula Rendu Kaadhal (KRK) movie hits theatre on 28th April. Here is the filmibeat Telugu movie review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X