Citadel Honey Bunny Twitter Review: సిటాడెల్ హానీ బన్నీ ట్విట్టర్ రివ్యూ.. అదిరిపోయిన సమంత లిప్ లాక్ (వీడియో)
ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు, వరుణ్ ధావన్ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 7వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ వెబ్ సిరీస్‌ను రాజ్ అండ్ డీకే రూపొందించారు. హాలీవుడ్‌లో ప్రముఖ నటుడు రిచర్డ్ మ్యాడెన్, హీరోయిన్ ప్రియాంక చోప్రా జోనస్ నటించిన వెబ్ సిరీస్‌కు ఇండియన్ వెర్షన్ అనే విషయం తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తర్వాత వస్తున్న సమంత సిరీస్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు,సినీ ప్రముఖులు చేసిన ట్విట్ల వివరాల్లోకి వెళితే..
సిటాడెల్ హానీ బన్నీ సిరీస్ ప్రీమియర్‌ను ముంబైలో సినీ తారలకు ప్రత్యేకంగా ప్రీమియర్‌ను ప్రదర్శించారు. ఈ ప్రీమియర్‌కు సినీ స్టార్స్ భారీగా తరలి వచ్చారు. వారిలో తేజస్వి ప్రకాశ్, అవనీత్ కౌర్, కృతిశెట్టి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు హీరో, హీరోయిన్లు ఈ సినిమా గురించి తమ రివ్యూను అందించారు.

సిటాడెల్ ప్రీమియర్ చూసిన తర్వాత నటి నిమ్రత్ కౌర్ తన అభిప్రాయాన్ిన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సిరీస్ చూస్తే పిచ్చెక్కి పోతుంది. బ్రిల్లియెంట్ రైడ్, ప్రతీ క్షణం కొత్త అనుభూతిని పొందాను. ఈ సినిమా సీట్లకు హత్తుకుపోయి చూసేంత థ్రిల్లింగ్ ఉంటుంది అని ఆమె పోస్టు చేశారు.
సిటాడెల్ వెబ్ సిరీస్‌లో సమంత యాక్షన్ సన్నివేశాల్లోనే కాదు.. శృంగార సన్నివేశాల్లో కూడా లీనమై నటించింది. వరుణ్ ధావన్‌తొ కలిసి చేసిన లిప్ లాక్ సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నది. ఈ ముద్దు సీన్లలో ఇద్దరు కలిసి నటించిన దృశ్యాలు భారీ చర్చకు దారి తీశాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
సిటాడెల్ మూవీలో వరుణ్ ధావన్, సమంత రుత్ ప్రభు మధ్య కెమిస్ట్రీ చేస్తే మైండ్ బ్లోయింగ్ అవుతుంది. ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ మీకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సమంత పవర్‌ఫుల్ రోల్, వరుణ్ ధావన్ మ్యాగ్నటిక్ చార్మ ఆకట్టుకొనేలా ఉంటుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.
సిటాడెల్ హానీ బన్నీ మూవీ ప్రీమియర్‌కు హీరోయిన్ అనుష్క సేన్ హాజరయ్యారు. మీడియా పాయింట్ వద్ద ఆమె గ్లామర్ మెరుపులు మెరిపించారు. అనంతరం ఈ సినిమా చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు.
హాలీవుడ్ నటి ఏంజెలీనా రుస్పో తాజాగా సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు. సిటాడెల్ సిరీస్ చేసిన తర్వాత సమంత ఎంత శ్రమించిందో మీకు తెలుస్తుంది. ఈ సిరీస్‌లో ఆమె ప్రతిభ ఎంత బాగా ఉందో మీరే చూస్తారు అని అన్నారు.
సిటాడెల్ ప్రీమియర్‌కు తెలుగు హీరోయిన్, ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హాజరయ్యారు. పొట్టి బట్టల్లో ఆమె అందాలను ఆరబోశారు. మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాకు ఫోజులిస్తూ గ్లామర్ పంట పండించారు.


Click it and Unblock the Notifications











