సంబరం కాదు, దుర్భరం కాదు

By Staff

Sambaram
-జలపతి గూడెల్లి
చిత్రం: సంబరం
నటీనటులు: నితిన్‌, నిఖిత, గిరిబాబు, సీత, చంద్రమోహన్‌,
పరుచూరి వెంకటేశ్వరరావు, తదితరులు..
సంగీతం: ఆర్పీ పట్నాయక్‌
నిర్మాత: తేజ
కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: దశరథ్‌

ఈ చిత్రంలో దర్శకుడు చెప్పుదల్చుకొన్న, ఎన్నుకొన్న పాయింట్‌ మంచిది. కానీ చెప్పే విధానంలోనే కొత్తదనం లేకపోవడం, మరీ 'బరువై'న దృశ్యాలను ఇరికించడంతో పెద్దగా ఆకట్టుకోదు. ప్రేమకు అర్హత అవసరం లేదు, పెళ్ళికి మాత్రం కావాలని మధ్యలో చెప్పి..చివర్లో..మళ్ళీ హీరోయిన్‌ లో 'పరివర్తన' తీసుకురావడం బాగానే ఉన్నా ఈ పాయింట్‌ చెప్పేందుకు కథకుడ, దర్శకుడైన దశరథ్‌ అల్లుకున్న సీన్స్‌ రోటీన్‌ గా ఉన్నాయి. తొలుత హీరో జులాయిగా తిరగడం, ఫ్రెండ్స్‌.. ఇతరులు అమ్మాయిలు ఎన్ని రకాలుగా ఉంటారో చెప్పడం..పాటలు..

ఆ తర్వాత, సెంటిమెంట్‌ దృశ్యాలు..క్లైమాక్స్‌ లో హీరో తెగకష్టపడి పైకి రావడం ...ఇవన్నీ మరీ పాత విషయాలు కావా? నిన్న మొన్నటి 'వాసు' (వెంకటేష్‌) నుంచి మొదలుపెడితే..ఎన్నో చిత్రాల్లో ఈ తరహా దృశ్యాలున్నాయి. ఇక దశరథ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌..(వీరంతా దాదాపు ఒకే గ్రూప్‌ కు చెందిన వారు)లాంటి వారితో వచ్చిన మరో చిక్కేమిటంటే...ప్రేక్షకులకు 'పర్సనాలిటీ డెవలప్‌ మెంట్‌' మీద క్లాస్‌ లు తీసుకుంటారు.

ఇవీ చదవడానికి బాగుంటాయి. కానీ తెరపై ఎస్వీ కృష్ణారెడ్డి నుంచి మొదలుపెడితే..హీరోయిన్‌...వదిన సీత వరకు అందరూ ఇలానే చెపితే..ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి, ఇలాంటి 'పర్సనాలిటీ డెవలప్‌ మెంట్‌' క్లాసులను హిమాయత్‌ నగర్‌ లో ఒక ఆఫీసు పెట్టుకొని చెప్పుకోవాల్సిందిగా తెలుగు దర్శక, నిర్మాతలకు మనవి. ఈ సినిమాలో ప్రధాన లోపం ఇదే.

నటన పరంగా అందరూ బాగానే చేశారు. పట్నాయక్‌ సంగీతం మోస్తారుగా మారి చాలా కాలమైంది. అది ఇందులోనూ అలాగే ఉంది. ఎం.ప్రసాద్‌ ఫోటోగ్రఫీ బాగుంది. దర్శకుడు కొన్ని కంటతడి పెట్టించే దృశ్యాలు తీసినా..కొన్నిసార్లు బరువుగా మారాయి. మొత్తమ్మీద సాధారణ చిత్రం.

కథ: నితిన్‌, నిఖిత చిన్ననాటి స్నేహితులు. ఇరు కుటుంబాలు మిత్రకుటుంబాలే. నితిన్‌ కు చదవు వంటబట్టదు. నిఖిత బాగా చదువుకుంటూ...ఉంటుంది. నిఖితకు నితిన్‌ అన్నా ఇష్టమే కానీ, తనను డామినేట్‌ చేసే మొగుడు రావాలనుకుంటుంది. మనవాడేమో ..జులాయిగా తిరిగేవాడు. ఇది తెలుసుకొని..బాగా కష్టపడి డబ్బు సంపాదిస్తాడు. చివర్లో హీరోయిన్లో పరివర్తన వచ్చి పెళ్ళి చేసుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X