శభాష్...రవితేజ 'శంభో శివ శంభో' (రివ్యూ)

By Srikanya
Shambo Shiv Shambo
Rating
-జోశ్యుల సూర్య ప్రకాష్
సంస్థ: శ్రీ సాయి గణేష్‌ ప్రొడక్షన్స్‌
నటీనటులు: రవితేజ, శివబాలాజీ, అల్లరి నరేష్‌, ప్రియమణి, అభినయ, కృష్ణభగవాన్‌,
రోజా, కృష్ణుడు, ముఖేష్‌ రిషి, రాజా రవీంద్ర, ఆహుతి ప్రసాద్‌, జీవా, సుధ, కిన్నెర,
సూర్యతేజ్‌, ప్రవీణ్‌, చిత్రలేఖ, రాధాకుమారి తదితరులు
కెమెరా: పి.జి.ముత్తయ్య
సంగీతం: సుందర్.సి.బాబు
మాటలు: సూర్య
సమర్పణ: శ్రీమతి బెల్లంకొండ పద్మావతి
నిర్మాతలు: బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, బెల్లంకొండ గణేష్‌ బాబు
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.సముద్రఖని
రిలీజ్ డేట్: జనవరి 14, 2010

కామిడీతో కితకితలు పెట్టిసి కలెక్షన్స్ దుమ్ము దులిపే రవితేజ,అల్లరి నరేష్ కలిసి ఓ సీరియస్ సినిమాను..అంతకంటే సీరీయస్ గా లాగి అవతల పాడేసారు.సూపర్ హిట్ 'నాడోడిగల్' తమిళ రీమేక్ గా వచ్చిన 'శంభో శివ శంబో' చిత్రం ఆద్యంతం వారిలోని నటుడుని బయిటకు తీస్తూ ఉత్కంఠ గా, భావోద్వేగాలతో సాగిపోయింది. కొంత తమిళ వాసనలు ఉన్నా, కథ చెప్పే విధానంలో కొత్తదనం దాన్ని అధిగమిస్తుంది. అయితే రెగ్యులర్ మశాలా చిత్రాలు చూడటం అలవాటు పడిన వారికి ఈ కథని వాస్తవ పరిస్ధితుల్లో చెప్పిన విధానం కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. కాని కొద్దిగా అలవాటు పడితే అప్పడప్పుడూ వచ్చే ఇలాంటి సినిమాలు బాగున్నాయినిపిస్తాయి.

మిడిల్ క్లాస్ కి చెందిన ముగ్గురు బాల్య స్నేహితులు(రవితేజ,నరేష్,శివబాలాజి) భవిష్యత్ పై ఆశతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూంటారు.అందులో లీడర్ లాంటి రవితేజకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటేనే తను ఇష్టపడే మామ(తణికెళ్ల) కూతురు (ప్రియమణి)దక్కుతుందనే కండీషన్ ఉంటుంది. ఆ ప్రయత్నాల్లో అతనుంటాడు. ఇక అల్లరి నరేష్ కి ఎబ్రాడ్ వెళ్లి లైఫ్ సెటిల్ చేసుకోవాలనే కోరిక. పాస్ పోర్టు,వీసాలంటూ అతను ఎప్పుడూ తిరుగుతూంటాడు.మూడోవాడు శివబాలాజి కి బ్యాంక్ లోన్ తెచ్చుకుని సొంతంగా కంప్యూటర్ బిజినెస్ పెట్టుకోవాలని కోరిక.అలాగే శివబాలాజి కి ఓ ప్రేమ కథ ఉంటుంది. అతను రవితేజ చెల్లిని ప్రేమిస్తూంటాడు. ఇలా ఎవరి హడావిడిలో వారుండగా ఓ రోజు రవితేజ కాలేజీ ప్రెండ్ వచ్చి ట్విస్ట్ ఇస్తాడు.

అతను ఇక్కడికి వచ్చి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. ఎందుకు అంటే వాడికి ఓ ఫెయిల్యూర్ లవ్ స్టోరి ఉంటుంది. అది తెలుసుకున్న ముగ్గురు స్నేహితులు ఆ ప్రేమను గెలిపించటం తమ ధర్మంగా భావించి బయిలు దేరతారు. అయితే ఆ ప్రేమికులు తల్లితండ్రులు సామాన్యులు కాదు. అమ్మాయి కడప ప్యాక్షనిస్టు(ముఖేష్ రుషి) కూతురు. అబ్బాయి సికింద్రాబాద్ ఎంపి(రోజా) కొడుకు. భయపడక ఇచ్చిన మాట ప్రకారం ప్లాన్ వేసి,నానా కష్టాలుపడి హీరోలు ముగ్గురూ ప్రేమికులిద్దరిని ఒకటి చేస్తారు . అయితే ఇది తెలుసుకున్న ఆ ప్రేమికుల తల్లితండ్రులు ఊరుకోరు. వారు తమ అర్ధ,అంగ బలంతో ఈ ముగ్గరు జీవితాలతో దారుణంగా ఆడుకుంటారు. మరో ప్రక్క ఆ ప్రేమజంట పొరపొచ్చాలు వచ్చి విడిపోతారు. ఆ పరిస్ధితుల్లో తాము ఓడిపోయాం అని తెలిసిన ఈ ముగ్గరూ ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది మిగతా కథ.

దర్శకుడు సముద్రఖని కథ చెప్పే విధానంలో వాస్తవికంగా అనిపించేలా సీన్స్ ప్రెజెంట్ చేసి సగం సక్సెస్ సాధించారు. మిగతా సగం విజయం ఆర్టిస్టుల నుంచి ప్రశంసమైన రాబట్టటంతో సాధించాడు. అయితే ఎవరికైనా హీరోలకు వచ్చిన కష్టం లాంటి సిట్యువేషన్ వస్తే ఏం చేయాలన్న ముగింపే ఇవ్వలేకపోయారనిపిస్తుంది. అలాగే ఈ తరహా నేరేషన్ తెలుగుకు కొత్త కావటంతో ప్రేక్షకుడు ఊహకి సన్నివేశాలు వదిలేయకుండా మరికాస్త క్లారిటీ ఇచ్చి ఉండాల్సింది. ముఖ్యంగా ప్రియమణి పెళ్ళి జరిగినట్లు చూపెడితే బావుండేది. అలాగే అల్లరి నరేష్ లవ్ స్టోరి ప్రారంభం చూపారు కానీ తర్వాత ఏమిటన్నది లేదు. నిజానికి ఇవి పెద్దగా అవసరం లేకపోయినా అన్ని వర్గాలకీ అందాలి..అంటే క్లారిటీ ఇవ్వక తప్పదు.

ఇక రెగ్యులర్ గా కామిడీని పండించే రవితేజ,అల్లరి నరేష్ ల చేత సీరియస్ గా నటింపచేయటం కొంతమందికి మింగుడు పడని విషయం. అందులోనూ ఈ చిత్రం ప్రోమోలు,పోస్టర్స్ చూసి ఏదో కామిడీ వ్యవహారం అని వచ్చే వారికి పూర్తి నిరాస అన్పించటం ఖాయం. అలాగే చాలా కాలంగా తెలుగు దాదాపు ప్రతీ తెలుగు సినిమాల్లో హీరో ఒకటి రెండు సీన్స్ లలో ప్రెండ్స్ పెళ్లిని చేసేయటం అనేది రెగ్యులర్ గా జరుగుతూంటుంది. అదే ఈ చిత్రంలో కథ మొత్తం 'ప్రెండ్ పెళ్లి ..దాని పర్యవసానాలు' అన్నట్లు తిరుగుతూండటం ఆశ్చర్యం గా అనిపించే అవకాశం ఉంది. ఇవన్నీ ప్రక్కన పెడితే అల్లరి నరేష్ ఈ చిత్రంలో చాలా బాగా చేసాడు. రెగ్యులర్ ఎక్సప్రెషన్ కు భిన్నంగా తన ఫేస్ ను ప్రెజెంట్ చేసాడు. సునీల్,కృష్ణ భగవాన్ కామిడీకూడా కొత్తగా ఉండి నవ్విస్తుంది.

అలాగే ప్రియమణి,రవితేజ మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా హైలెట్ గా ఉన్నాయి. రవితేజ..తన మామతో "నీ నిజాయితీ నచ్చింది!" అని పదే పదే చెప్పటం బాగుంటుంది. ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన రోజా రీ ఎంట్రీ బాగున్నా ఆమెకి చెప్పిన డబ్బింగ్ బాగోలేదు. విలన్ గా ముఖేష్ రుషి డైరక్టర్ మారినా నటన మార్చేలేదు. రవితేజ మాత్రం తన రెగ్యులర్ ఎక్సప్రెషన్స్ కు కొన్ని సార్లు బ్రేక్ ఇచ్చారు. ఇక రవితేజ చెల్లిగా,శివబాలాజీ లవర్ గా చేసిన అమ్మాయి బాగా చేసింది. పాటలు గొప్పగా లేకపోయినా చెత్తగా అయితే లేవు. ఎక్సపెక్ట్ చేసిన కామిడీ లేకపోయినా ఊహించని ఎమోషన్స్ ఉన్నాయి. సెకెండాఫ్ లో లాగ్ లు ఉన్నా సెంటిమెంట్ కవర్ చేసేసింది. రావు రమేష్ ఉపన్యాసం సీన్ ఒకటి ఎడిట్ చేస్తే బావుంటుంది.

ఏదైమైనా ఈ చిత్రం తమిళ రీమేక్ అని ఫిక్స్ అయి వెళ్ళకుండా ఓ మంచి కథను ఎలా ప్రెజెంట్ చేసారో చూడాలంటే శంభో శివ శంభో మంచి ఆప్షన్. అయితే ఏదో భీబత్సమైన కామిడీ అని భ్రమపడి వెళితే మాత్రం బ్రతుకు జీవుడా అని బయిటపడాలి. ప్రేమిస్తే,సెవన్ బై జీ బృందావన కాలినీ,సుబ్రమణ్యపురం చిత్రాలు నచ్చిన వారికి ఇదీ నచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X