twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమ్మోహనం రివ్యూ: క్యూట్ లవ్‌స్టోరి.. ఇంద్రగంటి మ్యాజిక్

    By Rajababu
    |

    Recommended Video

    Sammohanam Movie Review | సమ్మోహనం రివ్యూ

    Rating:
    3.0/5
    Star Cast: అదితిరావు హైదరీ, సుధీర్ బాబు, నరేష్, పవిత్ర లోకేష్
    Director: ఇంద్రగంటి మోహనకృష్ణ

    దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రాల్లో ఎమోషనల్ కంటెంట్‌తో కుటుంబ సమేతంగా వినోదించే విధంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అష్టాచెమ్మా, అంతకు ముందు ఆ తర్వాత లాంటి చిత్రాలు అందుకు సాక్ష్యంగా నిలిచాయి. తాజాగా సమ్మోహనం అనే ఆహ్లదకరమైన టైటిల్‌తో జూన్ 15న ఇంద్రగంటి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సన్నితమైన హాస్యం చుట్టూ అల్లుకొన్న ప్రేమకథలో బాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోయిన్ అదితిరావు హైదరీ, టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు భాగస్వామ్యమయ్యారు. సినిమా రిలీజ్‌కు ముందు వచ్చిన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. సినీ నేపథ్యంగా వచ్చిన ఈ క్యూట్ లవ్‌స్టోరి అంచనాలను ఏ మేరకు అధిగమించిందో తెలుసుకోవాలంటే సమ్మోహనం కథలోకి వెళ్లాల్సిందే.

    సమ్మోహనం కథ..

    సమ్మోహనం కథ..

    సినిమాను అమితంగా ప్రేమించి సర్వేష్ (నరేష్) కుమారుడు విజయ్ (సుధీర్ బాబు)‌ ఓ చిల్డ్రన్ కామిక్స్ వేసే ఆరిస్టు. సినిమా అన్నా, సినిమా నటులన్నా మంచి అభిప్రాయం ఉండదు. తండ్రి, కొడుకుల మధ్య ఇలాంటి అభిప్రాయ బేధాలు ఎప్పడూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ హీరోయిన్ సమీరా రాథోడ్ (అదితిరావు హైదరీ) నటించే సినిమా షూటింగ్ విజయ్ ఇంట్లోనే జరుగుతుంది. ఆ క్రమంలో సమీరాతో పరిచయం ఇష్టంగా మారుతుంది. వారి మధ్య ఇష్టం మరో మెట్టు ఎక్కి ప్రేమగా మారుతుంది. తన ఇంట్లో షూటింగ్ ముగిసిన తర్వాత విజయ్ వ్యక్తం చేసిన ప్రేమను సమీరా నిరాకరిస్తుంది.

    కథ ముగింపు ఇలా

    కథ ముగింపు ఇలా

    విజయ్ ప్రేమను సమీరా ఎందుకు నిరాకరించింది? తాను ఎక్కువగా ఇష్టపడిన వ్యక్తి ప్రేమను పొందలేకపోవడానికి సమీరాకు ఎలాంటి పరిస్థితులు అడ్డంకిగా నిలిచాయి. సమీరా జీవితంలో చోటుచేసుకొన్న ఓ క్లిష్టమైన పరిస్థితిని విజయ్ ఎలా పరిష్కరించారు. చివరకి తమ ప్రేమను సమీరా, విజయ్‌ ఎలా గెలిపించుకొన్నారు? విజయ్ తండ్రికి ఉండే సినిమా పిచ్చి సినిమాకు ఎలాంటి సపోర్టును అందించింది అనే ప్రశ్నలకు తెర మీద లభించే సమాధానమే సమ్మోహనం చిత్ర కథ.

    సమ్మోహనం ఫస్టాఫ్ అనాలిసిస్

    సమ్మోహనం ఫస్టాఫ్ అనాలిసిస్

    సినిమాపై సర్వేష్‌కు ఉన్న ఇష్టం.. విజయ్‌కి ఉన్న అయిష్టత అనే రెండు అంశాలతో కథ ప్రారంభమవుతుంది. అందమైన ఇంట్లో నలుగురితో కూడి కుటుంబంలో జరిగే సంఘటనలు వాస్తవానికి దగ్గరగా అనిపిస్తాయి. ఆ తర్వాత ఇంట్లో సినిమా హడావిడి, సమీరా, విజయ్ మధ్య పరిచయం, మంచి హ్యుమర్‌తో కూడిన సన్నివేశాలతో చకచకా పరుగులు పెడుతుంది. ఇంటర్వెల్‌కు ముందు ఇంటి టెర్రస్‌పై సమీరా, విజయ్ మధ్య ఉండే ఓ లెంగ్తీ సీన్‌ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుంది. ఓ భావోద్వేగ సన్నివేశంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

    సమ్మోహనం సెకండాఫ్ అనాలిసిస్

    సమ్మోహనం సెకండాఫ్ అనాలిసిస్

    సమ్మోహనం సెకండాఫ్‌లో కొంత నెమ్మదిగానే ప్రారంభమవుతుంది. సమీరా యాక్సిడెంట్ సీన్ తర్వాత కథ వేగం పుంజుకొంటుంది. సమీరా నటించిన కుమ్మెస్తా సినిమాలోని సన్నివేశాలు ప్రేక్షకుడి మంచి వినోదాన్ని పంచుతాయి. ఇక సమీరాకు ఎదురైన సమస్యను పరిష్కరించే క్రమంలో విజయ్ తన తండ్రితో ఆడిన ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. చివర్లో విజయ్, సమీరాను కలిపే ఎపిసోడ్ ఎమోషనల్‌గా ఉంటుంది.

    ఇంద్రగంటి మోహనకృష్ణ మేకింగ్

    ఇంద్రగంటి మోహనకృష్ణ మేకింగ్

    సున్నితమైన హాస్యం, లవ్, ఇలాంటి అంశాలతో మ్యాజిక్ చేయడం దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకు కొత్తేమీ కాదు. సమ్మోహనం చిత్రంలో తాను ఎంపిక చేసుకొన్న సినీ నేపథ్యం ప్రేమకథకు ఎస్సెట్‌గా మారింది అని చెప్పవచ్చు. తొలిభాగాన్ని నడిపించిన తీరు దర్శకుడు ప్రతిభకు మరోసారి అద్దపట్టింది. సున్నితమైన అంశాలను డీల్ చేసిన విధానం ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సినీ పరిశ్రమలో ఉండే లోపాలపై ఇంద్రగంటి విసిరిన సెటైర్లు నవ్వుల్లో ముంచెత్తాయి. కథను డీల్ చేసే ప్రాసెస్‌లో సెకండాఫ్ కొంత నెమ్మదించినట్టు కనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథను నడిపిన విధానం ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతుంది. సినిమా చూస్తూనే అందమైన కథను వింటున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది.

    ఫ్రెష్‌గా, కొత్తగా సుధీర్‌బాబు

    ఫ్రెష్‌గా, కొత్తగా సుధీర్‌బాబు

    సమ్మోహనం చిత్రంలో విజయ్ పాత్రలో సుధీర్‌బాబు కొత్తగా కనిపించాడు. యాక్టింగ్ పరంగా సుధీర్‌బాబు చాలా డిఫరెంట్‌గా కనిపించాడు. లుక్ పరంగా ఫ్రెష్‌నెస్ కనిపించింది. టెర్రస్‌, మనాలి, క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాల్లో అదరగొట్టేశాడని చెప్పవచ్చు. విజయ్ పాత్రలో చాలా మెచ్యూరిటీ కనిపించింది. ప్రేక్షకులను మెప్పించవచ్చు అనిపించిన ప్రతీ అవకాశాన్ని అంది పుచ్చుకొన్నారు. సుధీర్ ఫెర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్ అని చెప్పవచ్చు.

    అదితిరావు గ్లామర్, నటన

    అదితిరావు గ్లామర్, నటన

    ఇక సమీరా రాథోడ్‌గా అదితిరావు హైదరీ తన నటనతో మెరుపులు మెరిపించారు. బ్లాక్ మెయిల్ చేసే ఓ వ్యక్తికి, తనను ప్రేమించి వ్యక్తికి మధ్య నలిగిపోయే పాత్రలో అదితి ఒదిగిపోయింది. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన, కళ్లతో పలికించిన హావభావాలు అమోఘం అని చెప్పవచ్చు. ఇప్పటికే బాలీవుడ్, తమిళ ప్రేక్షకులను తన నటనతో మైమరిపించిన అదితి నేరుగా తెలుగు ప్రేక్షకుల్లో నిలిచిపోతుందని చెప్పవచ్చు. సమ్మోహనం ద్వారా తెలుగులో నటనతోపాటు గ్లామర్‌ ఉన్న హీరోయిన్‌గా పేరు సంపాదించుకోవచ్చు.

    దుమ్మురేపిన నరేష్

    దుమ్మురేపిన నరేష్

    సీనియర్ నటుడు నరేష్‌ను ఇప్పటి వరకు రెగ్యులర్ పాత్రలతో ఒకే కోణంలో చూసి ఉంటాం. సర్వేష్‌గా నరేష్ నటన విశ్వరూపం చూపారంటే కొంత అతిశయోక్తిగా ఉంటుందేమో కానీ.. అంతే స్థాయిలో నటించారు. సినీ నటుడు బలమైన కోరిక ఉన్న సర్వేష్‌గా ప్రతీ సన్నివేశంలో బ్రహ్మండంగా కనిపించారు. తనకు వచ్చిన తొలి సినీ అవకాశం సందర్భంగా నటించే సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. అలాగే సమీరాను బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తికి గుణపాఠం చెప్పే సీన్ పీక్స్ అని చెప్పవచ్చు.

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో సుధీర్ బాబుకు తల్లిగా పవిత్ర లోకేష్, స్నేహితులుగా రాహుల్ రామకృష్ణ, ఇతర పాత్రల్లో కనిపించిన ప్రతీ ఒక్కరు గుర్తుండిపోయేలా నటించారు. అర్జున్ రెడ్డి తర్వాత రాహుల్ రామకృష్ణ మరోసారి తనదైన శైలిలో హాస్యాన్ని పంచారు. హీరో చెల్లెలిగా కనిపించిన న్యూస్ యాంకర్ నటన ఫ్రెష్‌గా ఉంది.

    పీజీ విందా సినిమాటోగ్రఫీ

    పీజీ విందా సినిమాటోగ్రఫీ

    సమ్మోహనం చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సాంకేతిక నిపుణుల పేర్లలో సినిమాటోగ్రాఫర్ పీజీ విందా ఒకరు. సినిమాకు ఆయన కెమెరా వర్క్ ప్రాణంగా నిలిచింది. టెర్రస్ పైన సీన్లు, యాంబియేన్స్ కన్నులపండువగా ఉంటుంది. అదితి రావు కనిపించే ప్రతీ సీన్‌ను అందంగా చెక్కారా అనిపించింది. లవ్‌స్టోరి కంటెంట్‌ను అద్బుతంగా అనుభూతిని ప్రేక్షకుడికి పంచెందుకు విందా ప్రతిభ తోడ్పాటునందించింది.

    వివేక్ సాగర్ మ్యూజిక్

    వివేక్ సాగర్ మ్యూజిక్

    సమ్మోహనం చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు. బయట వినడానికే కాకుండా చెలితార పాట తెరపైన కూడా చాలా బాగుంది. ప్రధానంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లైవ్లీగా ఉంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్యాక్ స్కోర్ వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    అదిత్య 369, జెంటిల్మన్ చిత్రాలను అందించిన శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత. సినిమా నేపథ్యంగా సాగే కథను తెర మీద అందంగా కనిపించడానికి చేసిన కృష్టి ప్రతీ సన్నివేశంలోనూ కనిపిస్తుంది. ఎప్పటిలానే శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    స్టార్ వ్యాల్యూస్ లేకున్నా కంటెంట్ ఉంటే ఆదరిస్తారని పెళ్లిచూపులు, మెంటల్ మదిలో, మహానటి లాంటి సినిమాలు నిరూపించాయి. అదే కోవలో వచ్చిన చిత్రం సమ్మోహనం. హాస్యం, గ్లామర్, లవ్ లాంటి అంశాలతో రూపొందిన సమ్మోహనం చిత్రం సకుటుంబంతో కలిసి ఆరగించే మంచి భోజనం అని చెప్పవచ్చు. మధ్యలో కొన్ని అడ్డుపడే కరివేపాకు లాంటి అంశాలు ఉన్నా మంచి సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్
    అదితిరావు, సుధీర్‌బాబు, నరేష్ పెర్ఫార్మెన్స్
    ఇంద్రగంటి మోహనకృష్ణ మేకింగ్
    పీజి విందా సినిమాటోగ్రఫీ
    వివేక్ సాగర్ మ్యూజిక్

    మైనస్ పాయింట్స్
    సెకండాఫ్‌లో కొంత స్లోగా ఉండటం
    ఫార్మూలా ప్రేక్షకుల టేస్ట్ దూరంగా

    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: అదితిరావు హైదరీ, సుధీర్ బాబు, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ తదితరులు
    దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ
    నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
    సినిమాటోగ్రఫీ: పీజీ విందా
    సంగీతం: వివేక్ సాగర్
    రిలీజ్: జూన్ 15, 2018

    English summary
    Director Indraganti Mohan Krishna's latest movie is Sammohanam. Sudheer Babu and Aditi Rao Hydari are lead pair. Sivalenka Krishna Prasad is the producer. This movie is going to release on june 15th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X