Sampradayaini Suppini Suddapusaani Movie Twitter Review: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ట్విట్టర్ రివ్యూ

టాలీవుడ్ సీనియర్ హీరో శివాజీ, లయ జంటగా నటించిన చిత్రం సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ స్వయంగా నిర్మించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌తో కలిసి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటిలు ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మాస్టర్ రోహన్, శరత్ లోహితాశ్వ, ఆలీ, ధన్‌రాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాస్, కరణ్ తదితరులు నటించారు.

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రానికి రంజిన్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, బాలు మనోజ్ డీ ఎడిటర్‌గా, రిత్విక్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా మార్చి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. అయితే మార్చి 5వ తేదీన రాత్రి సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని మూవీ ప్రీమియర్స్‌‌ను ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై నెటిజన్లు అందించిన టాక్ ఏమిటీ? క్రిటిక్స్ రివ్యూ ఏమిటీ? అనే వివరాలు పరిశీలిస్తే..

Sampradayaini Suppini Suddapusaani Movie Twitter Review in Telugu  Is Sivaji Sontineni s Movie hits the bulls eye

సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని ఒక క్రైమ్ థ్రిల్లర్. దీనికి సుధీర్ శ్రీరామ్ రచన, దర్శకత్వం వహించారు. ఫస్టాఫ్ బిలో యావరేజ్‌గా అనిపించింది. సెకండాఫ్ రోటీన్‌గా సాగిపోయింది. శివాజీ, లయతో పాటు ఇతర లీడ్ యాక్టర్స్ అద్భుతంగా నటించారు. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫి జస్ట్ ఓకే అనిపించింది. క్లైమాక్స్‌ను ముందే ఊహించే విధంగా మలిచారు అని ఓ అభిమాని రివ్యూ ఇచ్చాడు.

గ్రామానికి సర్పంచ్‌గా ఉన్న శివాజీ తన కుటుంబంతో సంతోషంగా ఉంటాడు. ఒక రోజున ఓ పోలీస్ ఆఫీసర్ .. శివాజీ ఇంట్లో చనిపోతాడు. దాంతో శివాజీ అతని కుటుంబ సభ్యులు ఆ శవాన్ని దాచేస్తారు. మరి ఆ శవం ఎలా బయటపడింది? ఆ పోలీస్ ఆఫీసర్‌ని ఎవరు చంపారు? ఇంట్లోకి శవం ఎలా వచ్చింది? అనేది సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని కథ. ప్రధాన నటీనటుల నటన, బీజీఎం కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. సెకండాఫ్‌ని సాగదీసినట్లుగా అనిపించింది. స్క్రీన్ ప్లే ఎంగేజ్‌గా అనిపించలేదు, ఎమోషన్ కనెక్ట్ కాలేదు. క్లైమాక్స్ ట్విస్ట్ అస్సలు ఇంపాక్ట్ చూపించలేదు అని ఈ సినిమాపై ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.

కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. ప్రధాన నటీనటుల నటన బాగుంది. కొన్ని కాంబినేషన్స్‌లో సీన్స్, బీజీఎం బాగున్నాయి.అయితే కొంత ల్యాగ్‌తో పాటు కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లే రోటీన్‌గా అనిపించింది అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X