Sampradayini Suppini Suddapoosani Movie Review: సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: శివాజీ, లయ, రోషన్, శరత్ లోహితాశ్వ, ఆలీ, ధన్‌రాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాస్, కరణ్ తదితరులు
దర్శకత్వం: సుధీర్ శ్రీరామ్
నిర్మాత: శివాజీ శొంఠినేని
సమర్పణ: ఈటీవీ విన్
మ్యూజిక్ డైరెక్టర్: రంజిన్ రాజ్
ఎడిటర్: బాలు మనోజ్ డీ
సినిమాటోగ్రాఫర్: రిత్విక్ రెడ్డి
బ్యానర్: శ్రీ శివాజీ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2026-03-06
అన్నమయ్య జిల్లా కొత్తపేటలో పంచాయితీ సెక్రటరీగా పనిచేసే శ్రీరామ్ నీతి, నిజాయితీకి మారుపేరు. లంచాలు, అవినీతికి ఆమడ దూరంలో ఉంటాడు. అయితే భార్య ఉత్తర (లయ) మాత్రం అక్రమ సంపాదన కోసం భర్త శ్రీరామ్‌ను వేధిస్తుంటుంది. ఇక కొడుకు మిట్టు (రోషన్) తుంటరి పనులు చేస్తూ హింసకు పాల్పడుతుంటాడు. భార్య, కొడుకులతో వేగలేకపోతున్న సమయంలో విక్రమ్ వాసుదేవ్ (ప్రిన్స్) అనే ఇన్స్‌పెక్టర్ తన ఇంట్లోనే హత్యకు గురవుతాడు. దాంతో గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని దాచేయాలని శ్రీరామ్ కుటుంబం ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఇంతలో ఎమ్మెల్యే (శరత్ లోహితాశ్వ) వర్గం శ్రీరామ్ ఫ్యామిలీని వెంటాడుతుంది.

నిజాయితీపరుడైన శ్రీరామ్‌కు వృత్తిపరంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి? భార్య, కొడుకుల వేధింపులు శ్రీరామ్‌కు ఏ రేంజ్‌లో ఉన్నాయి? శ్రీరామ్ ఇంట్లో ఇన్స్‌పెక్టర్ విక్రమ్ వాసుదేవ్ ఎలా హత్యకు గురయ్యాడు? శవాన్ని మాయం చేయడానికి శ్రీరామ్ ఫ్యామిలీ ఎలాంటి ప్రయత్నాలు చేసింది? ఎమ్మెల్యే వర్గం శ్రీరామ్ ఫ్యామిలీని ఎందుకు వెంటాడింది? విక్రమ్ వాసుదేవ్ హత్యకు కారణం ఏమిటి? ఈ హత్య నుంచి శ్రీరామ్ ఫ్యామిలీ ఎలా తప్పించుకొన్నది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
మర్డర్ మిస్టరీ చుట్టూ అల్లుకొన్న ఫన్, కామెడీ డ్రామా. ఈ సినిమాకు సస్పెన్స్ ఎలిమెంట్ సపోర్టుగా నిలిచింది. అయితే కథ, కథనాల పరంగా ఇప్పటికే వచ్చిన దృశ్యం సినిమాకు కథపరంగా కొన్ని పోలికలు కనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో రొటీన్ సీన్లు, రెగ్యులర్ డ్రామాతో సాగదీసినట్టు ఉంటుంది. కథలో ఊహించని ట్విస్టులు లేకపోవడం రొటీన్ సినిమానే ఫన్ సీన్లతో కొత్త ఫ్లేవర్‌తో చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే దర్శకుడు సుధీర్ సెకండాఫ్‌ను అంటే ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు బాగా ప్లాన్ చేసుకొని.. ఫస్టాఫ్‌లో కలిగిన అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్‌ను డీల్ చేసిన విధానమే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది.
నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. శివాజీ, లయ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అనుభవంతో వారి పాత్రల ద్వారా సినిమాకు అత్యంత బలంగా మారారు. ఇలాంటి క్యారెక్టర్లకు సిట్యుయేషన్, స్పాంటేనిటి అవసరం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తమ రోల్స్‌ను స్టోరీ డిమాండ్ మేరకు డ్రైవ్ చేశారు. రోషన్ ఉన్నంతలో బాగా చేశాడు. ఇంకా కొన్ని సీన్లు పడితే బాగుండు అనే ఫీలింగ్ కలిగింది. ధన్ రాజ్, ప్రిన్స్, శరత్, తదితరులు తమ పాత్రలకు పరిధి మేరకు రాణించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే ఫన్ డ్రామాకు కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను రంజిన్ రాజ్ పర్‌ఫెక్ట్‌గా డెలివరీ చేశాడు. పాయా పాటను ఎండ్ టైటిల్‌కు కాకుండా మధ్యలో పడితే ఆడియెన్స్‌కు మరింత జోష్ కలిగించేలా ఉంటుంది. మదనపల్లి, చిత్తూరు, హార్సిలీ హిల్స్ అందాలను చక్కగా తన కెమెరాలో రిత్విక్ రెడ్డి బంధించారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ అనుసరించిన నిర్మాణ విలువలు ఉన్నత ప్రమాణాలను చాటాయి.
శివాజీ, లయ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని రూపొందిన ఫన్ బేస్‌గా సాగే మర్డర్ మిస్టరీ. స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్లస్ పాయింట్. దర్శకుడు ఎంచుకొన్న పాయింట్ బాగుంది. ఇంకా బెటర్‌గా ప్రజెంట్ చేసి ఉంటే ఇంకా బెటర్ రిజల్డ్ రావడానికి అవకాశం ఉండేది. అంచనాలు లేకుండా వెళితే ఈ సినిమాను ఫుల్లుగా ఎంజాయ్ చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి క్రైమ్ థ్రిల్లర్స్ మూవీని ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











