Sampradayini Suppini Suddapoosani First Review: సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ ఫస్ట్ రివ్యూ
టాలీవుడ్ నటుడు శివాజీ నిర్మాతగా మారి శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందించిన చిత్రం సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. ఈ చిత్రంలో శివాజీ హీరోగా, సీనియర్ నటి లయ లీడ్‌గా నటిస్తున్నారు. ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సుధీర్ శ్రీరామ్ తొలి చిత్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో రోహన్, శరత్ లోహితాశ్వ, ఆలీ, ధన్‌రాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాస్, కరణ్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి రంజిన్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, బాలు మనోజ్ డీ ఎడిటర్‌గా, రిత్విక్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా మార్చి 6వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ క్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) ఇచ్చిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమాపై వారు వెల్లడించిన ఫీడ్‌బ్యాక్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

శ్రీరామ్ (శివాజీ)కి భార్య (లయ), కొడుకు (రోహన్) నుంచి రకరకాల వేధింపులు, సమస్యలు వస్తాయి. వారితో గొడవ పడుతూ వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం సాగుతుంది. కొడుకు చేసే అల్లరి చిల్లరి పనులు, భార్యకు ఉండే అత్యాశ శ్రీరామ్‌కు నిద్ర పట్టనివ్వకుండా చేస్తాయి. ఈ క్రమంలో అనుకోకుండా ఓ వ్యక్తి మరణిస్తాడు. ఆ మృతి చెందిన వ్యక్తి బాడీని దాచేందుకు చేసే ప్రయత్నంలో అనేక గందరగోళాలు ఏర్పడుతాయి. తమ ఫ్యామిలీకి ఎదురైన సమస్యను కొడుకు, భార్యతో కలిసి ఎలా సాల్వ్ చేశారనేది ఈ సినిమా కథ.
ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ఫన్, మర్డర్ మిస్టరీగా రూపొందిన ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు అధికారులు, ప్రతినిధులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కాన్ని మార్పులు, చేర్పులు, కొన్ని డైలాగ్స్ విషయంలో సలహాలు, సూచనలు ఇచ్చారు. వాటిని మూవీ టీమ్ సానుకూలంగా పరిష్కరించడంతో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా సెన్సార్ కార్యక్రమాలు క్లియర్ అయ్యాయి అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక ఆద్యంత వినోదానికి పెద్ద పీట వేస్లూ సెటైరికల్, డైలాగ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై సెన్సార్ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. కంటెంట్ ఆధారంగా ఈ ఈ సినిమాకు యూఏ (UA16+) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం 16 ఏళ్ల నిండిన ఆడియెన్స్ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఈ చిత్రాన్ని చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుందని సెన్సార్ నిబంధనలను పేర్కొన్నారు.
ఇక ఈ సినిమాలో కంటెంట్ డిమాండ్ చేయడంతో నిడివిని చాలా బ్యాలెన్స్ చేశారు. ఈ సినిమాలోని పాత్రలకు సరైన న్యాయం చేసేలా.. తెర మీద ఫన్ క్రియేట్ అయ్యేలా సీన్లను బాగా కూర్పు చేశారు. దాంతో ఈ మూవీ నిడివి సుమారుగా 2 గంటల 26 నిమిషాలు. అంటే సుమారుగా 146 నిమిషాల రన్‌టైమ్ ఫిక్స్ చేశాం అని సెన్సార్ సర్టిఫికెట్ వెల్లడించింది.
ఈటీవీ విన్ సమర్పణలో వస్తున్న సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ కంటెంట్ విషయంలో క్లీన్‌గా ఫ్యామిలీ ఆడియెన్స్ నవ్వించేలా ఉంటుంది. రెండున్నర గంటలపాటు ఫన్ రైడ్ గ్యారెంటీ అని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతున్నది. ఈ సినిమాను థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఆడియెన్స్ ఇచ్చే తీర్పుపైనే సినిమా రన్ ఆధారపడి ఉంటుందనే వాస్తవం. ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ స్టోరీలు, రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











