For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Samrat Prithviraj movie ఆకట్టుకోలేకపోయిన వార్ యాక్షన్ థ్రిల్లర్.. నిరాశపరిచిన అక్షయ్ కుమార్

  |

  Rating:
  2.5/5
  Star Cast: అక్షయ్ కుమార్, సంజయ్ దత్, సోనుసూద్, మనూషి చిల్లర్, అశుతోష్ రాణా
  Director: చంద్ర ప్రకాశ్ ద్వివేది

  బాలీవుడ్‌లో చారిత్రాత్మక చిత్రాల జోరు కొన్ని సంవత్సరాలుగా కనిపిస్తున్నది. పద్మావత్, కేసరి, బాజీరావు మస్తానీ లాంటి సినిమాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. తాజాగా మరోసారి చరిత్రలో మరుగున పడి ఉన్న విషయాలను భావి తరాలకు అందించాలనే ప్రయత్నంతో సామ్రాట్ పృథ్వీరాజ్‌ చిత్రానికి దర్శకుడు చంద్రప్రకాశ్ ద్వివేది తెరరూపం కల్పించారు. అక్షయ్ కుమార్, సంజయ్ దత్, సోనుసూద్, మనూషి చిల్లర్ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని పంచిందంటే?

  పృథ్వీరాజ్ కథ ఏమిటంటే?

  పృథ్వీరాజ్ కథ ఏమిటంటే?

  ఢిల్లీ సామ్రాజ్యంపై అధిపత్యం కోసం సామ్రాట్ పృథ్వీరాజ్ (అక్షయ్ కుమార్) ఎదురులేని పోరాటానికి సిద్ధమవుతాడు. మరో వైపు మహ్మద్ ఘోరి (మానవ్ విజ్) అంతే మొత్తంలో ఢిల్లీని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన యుద్దంలో ఘోరీని పృథ్వీరాజ్ ఓటమి పాలు చేస్తాడు. ఇదిలా ఉండే.. తనకు పక్కలో బళ్లెంగా మారిన జైచంద్ (అశుతోష్ రాణా) ఢిల్లీని హస్తగతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుంటాడు. పృథ్వీరాజ్ సాహసాలు, వీరత్వం చరూసి సంయోగిత (మనూషి చిల్లర్) ఆయనను తప్ప మరొకరిని పెళ్లి చేసుకొనని ప్రతీన పూనుకొంటుంది.

  సామ్రాట్ పృథ్వీరాజ్ కథలో ట్విస్టులు

  సామ్రాట్ పృథ్వీరాజ్ కథలో ట్విస్టులు

  ఢిల్లీని ఆక్రమించుకొనేందుకు ప్రయత్నించిన ఘోరీకి పృథ్వీరాజ్ ఏ విధంగా బుద్ది చెప్పాడు? తన పక్కనే ఉంటూ కుట్రలు పన్నే జైచంద్‌కు పృథ్వీరాజ్ ఎలా ఎదుర్కొన్నాడు? సంయోగిత ప్రేమను పృథ్వీరాజ్ అంగీకరించారా? ఢిల్లీని హస్తగతం చేసుకొనేందుకు చేసి ప్రయత్నాలను పృథ్వీరాజ్ ఎలా ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా కథ.

  దర్శకుడి పనితీరు..

  దర్శకుడి పనితీరు..

  సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా కథకు మూలం చాంద్ బర్డై రచించిన పృథ్వీరాజ్ రాసో అనే అద్భుతమైన ప్రేమకావ్యం. ఈ కథను ప్రముఖ దర్శకుడు చంద్రప్రకాశ్ ద్వివేది ఎంచుకొన్న తీరు బాగుంది. కానీ సినిమాలోని పాత్రల కోసం ఎంచుకొన్న నటీనటుల విషయమే ఈ సినిమాకు ప్రతీకూలంగా మారిందని చెప్పవచ్చు.

  చరిత్రలో చోటుచేసుకొన్న వాస్తవాలను కొన్ని చోట్ల వక్రీకరించారనే విమర్శలు వినిపించడం వల్ల ఈ సినిమా స్క్రిప్ట్‌పై పరిశోధన జరగలేదనే విషయాన్ని సినీ పండితులు చెప్పడం.. ఆ ప్రభావం సినిమాపై స్పష్టంగా కనిపిస్తుంది. వెండితెర మీద సినిమా కాకుండా హిస్టరీ లెక్చరర్ చెప్పిన పాఠంగా మారడం ఈ సినిమాకు ప్రతికూలంగా మారిందని చెప్పవచ్చు.

  అక్షయ్ కుమార్ ఎలా చేశారంటే..

  అక్షయ్ కుమార్ ఎలా చేశారంటే..

  పృథ్వీరాజ్ చౌహాన్‌గా అక్షయ్ కుమార్‌ పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారనే చెప్పాలి. పృథ్వీరాజ్ లాంటి క్యారెక్టర్ చేయాల్సి వస్తే.. మానసికంగా, శారీరకంగా ఉండాల్సిన ధృడత్వం తెర మీద కనిపించకపోవడం ఈ సినిమాకు మరో మైనస్ పాయింట్. యుక్త వయసులో ఉండే పృథ్వీరాజ్ పాత్రలో అక్షయ్ ఒదిగిపోయినట్టు కనిపించడు. ఇక మనూషి చిల్లర్‌తో కెమిస్ట్రీ తేలిపోయింది. స్క్రీన్ పై వయసు తేడా స్పష్టంగా కనిపించింది.

  ఇతర నటీనటులు ప్రతిభ

  ఇతర నటీనటులు ప్రతిభ

  ఇక మహ్మద్ ఘోరీగా మానవ్ జీ తన పాత్రలో ఉండే బలహీనతలను కప్పిపుచ్చి.. ప్రేక్షకులను మెప్పించే విధంగా తన ప్రతిభను చాటుకొనే ప్రయత్నం చేశాడు. అలాగే జైచంద్ పాత్రలో అశుతోష్ రాణా కూడా అసంపూర్తిగానే కనిపిస్తాడు. జానపద గాయకుడు చాంద్ బర్డాయ్ పాత్రలో సోనుసూద్ ఫర్వాలేదనిపించారు. కాక కన్హా పాత్రలో సంజయ్ దత్ బ్రహ్మండంగా వినోదాన్ని పంచాడు. సాక్షి తన్వర్‌తోపాటు ఇతర నటీనటులు ఫర్వాలేదనిపించారు.

  సాంకేతిక అంశాలు..

  సాంకేతిక అంశాలు..

  ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మనుష్ నందన్ అందించిన సినిమాటోగ్రఫి కూడా పేలవంగా ఉంది. అలాగే శంకర్, ఎహాసాన్, లాయ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకోలేకపోయింది. గ్రాఫిక్, వీఎఫ్ఎక్స్ విషయంలో క్వాలిటీ కనిపించదు. ఓవరాల్‌గా టెక్నికల్‌గా అద్భుతమైన ఫీలింగ్ కల్పించడంలో విఫలమైందని చెప్పవచ్చు.

   ఫైనల్‌గా ఎలా ఉందంటే..

  ఫైనల్‌గా ఎలా ఉందంటే..

  యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ స్క్రిప్టుపై మరింత కసరత్తు చేసి ఉండే డెఫినెట్‌గా మంచి చిత్రం అయి ఉండేదనిపిస్తుంది. అయితే చరిత్రపై విస్తృత పరిశోధన చేయకుండా ఈ సినిమాను రూపొందించారా అనే అనుమానం కలుగుతుంది. చరిత్ర ఆధారంగా రూపొందే సినిమాలు, అక్షయ్ కుమార్ ఫ్యాన్స్‌కు నచ్చడానికి అవకాశాలు ఉన్నాయి.

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: అక్షయ్ కుమార్, సంజయ్ దత్, సోనుసూద్, మనూషి చిల్లర్, అశుతోష్ రాణా తదితరులు
  రచన, దర్శకుడు: చంద్ర ప్రకాశ్ ద్వివేది
  నిర్మాత: ఆదిత్య చోప్రా
  సినిమాటోగ్రఫి: మనుష్ నందన్
  ఎడిటింగ్: ఆరిఫ్ షేక్
  మ్యూజిక్: శంకర్, ఎహసాన్ లాయ్
  బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా
  బ్యానర్: యష్ రాజ్ ఫిలింస్
  రిలీజ్ డేట్: 2022-06-03

  English summary
  Bollywood star Hero Akshay Kumar's Samrat Prithviraj movie released on 3rd June. Here is the exclusive review of Filmibeat Telugu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X